Wednesday, March 07, 2012
మాతౄ దేవత--1969
సంగీతం::K.V.మహాదేవన్
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,B.వసంత
దర్శకత్వం::సావిత్రి
నిర్మాత::అట్లూరి పూర్ణచంద్రరావు,M.చంద్రశేఖర్
నటీనటులు::సావిత్రి, ఎన్.టి.రామారావు, శోభన్‌బాబు, చంద్రకళ, నాగభూషణం, రేలంగి, హేమలత, బేబిరాణి, రాజబాబు, మంజుల, సురభి బాలసరస్వతి, విజయలలిత, సాక్షి రంగారావు
మహిళాదినోత్సవం సందర్బంగా,
మానవ జాతి మనుగడకె ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
|| మానవ జాతి ||
ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల వల్లి
ఒక రామయ్యకే కన్న తల్లి సకలావనికే కల్పవల్లి
ఆ ఆ ఆ....ఓ..ఓ.....
మానవ జాతి మనుగడకె ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
సీతగా ధరణిజాతగా సహన శీలం చాటినది
రాధగా మధుర బాధగా ప్రణయ గాధల మీటినది
సీతగా ధరణిజాతగా సహన శీలం చాటినది
రాధగా మధుర బాధగా ప్రణయ గాధల మీటినది
మెల్లగా కవితలల్లగా తేనేజల్లు కురిసినది
మెల్లగా కవితలల్లగా తేనేజల్లు కురిసినది
లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా సమర రంగాన దూకునది
లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా సమర రంగాన దూకునది
మానవ జాతి మనుగడకె ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
తరుణి పెదవిపై చిరునగ వొలికిన మెరయును ముత్యాల తరులు
కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవు ఆ సిరులు
కన్న కడుపున చిచ్చురగిలెనా కరువుల పాలౌను దేశం
కన్న కడుపున చిచ్చురగిలెనా కరువుల పాలౌను దేశం
తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం
తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం
ఆ...ఆ...ఆ...ఓ ఓ...
మానవ జాతి మనుగడకె ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
తరగని పెన్నిధి మగువ
Labels:
మాతౄ దేవత--1969
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment