Wednesday, February 08, 2012

ఆడదాని అదృష్టం--1975


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4670
సంగీతం::S.హనుమంతరావ్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.జానకి    
తారాగణం::చలం,రామకృష్ణ,సుమ,మమత,మిక్కిలినేని,గిరిజ,నిర్మల,జయమాలిని 

పల్లవి::

మొన్ననే వయసొచ్చిందీ..నిన్ననే నీ పిలుపొచ్చిందీ
ఈనాడే ఈనాడే..కొత్త విసురొచ్చిందీ
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
మొన్ననే వయసొచ్చిందీ..ఆహాయ్ 

చరణం::1

చెక్కిలే తమలపాకు..పెదవియే చిగురాకు
చెక్కిలే తమలపాకు..పెదవియే చిగురాకు
ఒళ్ళంత నాజూకు..ఊఊ హోయ్..ఒళ్ళంత నాజూకు
కళ్ళలో ఉందిరోయ్..కావలసిన షోకు
లేలేత అందాలు..వీలైన సరదాలు
లేలేత అందాలు..వీలైన సరదాలు
మోజైన మురిపాలు..తాజాగ అందిస్తాను 
ఆహా ఆహా ఆహా ఆహా ఆహా..ఆఆ             
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
మొన్ననే వయసొచ్చిందీ..నిన్ననే నీ పిలుపొచ్చిందీ..హోయ్

చరణం::2

చూపుతో మంటలు రగిలించీ..నవ్వుతో మల్లెలు కురిపించీ
అంతలో తొలి గిలిగింతలతో..వింతగా నిను కవ్విస్తాను
రేయైన పగలైనా ఏవేళ ఏమైనా..రేయైన పగలైనా ఏవేళ ఏమైనా
నీ వేడి ఒడిలోన నేనొదిగి..వుంటాను నేనొదిగి వుంటాను        
మొన్ననే వయసొచ్చిందీ..నిన్ననే నీ పిలుపొచ్చిందీ
ఈనాడే ఈనాడే..కొత్త విసురొచ్చిందీఈఈఇ
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        

పవిత్ర బంధం--1971













సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,కాంచన, కృష్ణంరాజు, పద్మనాభం,నాగయ్య.

పల్లవి::

చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ

చరణం::1

చిగురించి విరబూసే..చెట్టే చెట్టు 
చిట్టిపాప నడయాడే..ఇల్లే ఇల్లు
చిగురించి విరబూసే..చెట్టే చెట్టు 
చిట్టిపాప నడయాడే..ఇల్లే ఇల్లు
ఆడినదే ఆట తను..పాడినదే పాట 
ఆడినదే ఆట తను..పాడినదే పాట
అది చూచి మైమరచే తల్లే కద తల్లీ 
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ

చరణం::2

బాలపాప పలుకులే..పంచదార చిలకలు 
బాలపాప పలుకులే..పంచదార చిలకలు
చందమామ కన్నా..మా చంటిబాబు మిన్న 
చందమామ కన్నా..మా చంటిబాబు మిన్న
చల్లనివి చక్కనివి..పసిపిల్లల కళ్ళు 
చల్లనివి చక్కనివి..పసిపిల్లల కళ్ళు 
ఆ కళ్ళే కమలాలు..అవి దేవుని గుళ్ళు  
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ

చరణం::3

ఎనలేని స్వప్నాలు..నోచెను తల్లి 
కనులారా కనగానే..మురియును తండ్రి
ఎనలేని స్వప్నాలు..నోచెను తల్లి 
కనులారా కనగానే..మురియును తండ్రి
కన్నవారి ఫలము..కనులున్న వారి ధనము 
కన్నవారి ఫలము..కనులున్న వారి ధనము 
వెలగాలి మా బాబు..వెయ్యేళ్ళ దీపం..మ్మ్
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ
లల్లాలలాలలా ల్లల్లాలలాలల 
మ్మ్ హూ..మ్మ్ హూ 

Sunday, February 05, 2012

ష్టేట్‌రౌడీ--1998




సంగీతం::బప్పిలహరి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల

Film Directed By::B.Gopal
తారాగణం::ఛిరంజీవి,రాధ,భానుప్రియ,రావ్‌గోపాల్‌రావ్,శారద,జయమాలిని,త్యాగరాజు,కైకాల సత్యనారాయణ.

:::::::::

చుక్కల పల్లకిలో..చూపుల అల్లికలో

పలికెను కల్యాణ గీతం..మలయ సమీరంలో
అనురాగాలే..ఆలపించనా..ఆకాశమే మౌన వీణగా
ఆ ఆ ఆ ఆ......
చుక్కల పల్లకిలో..చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం..మలయ సమీరంలో

నీ చిరునడుమున వేచిన సిగ్గును దోసిట దోచాలనీ
ఆగని పొద్దును ఆకలి ముద్దును కౌగిట దువ్వాలని
హే..పడుచుదనం చెప్పిందిలే
పానుపు మెచ్చిందిలే..హే..

చుక్కల పల్లకిలో..చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం..మలయ సమీరంలో

తలుపులు ఉబికిన తొలకరి వయసుకు తొలిముడి విప్పాలని
పెరిగే దాహం జరిపే మధనం పెదవికి చెప్పాలని హే..తనువెల్లా కోరిందిలే..తరుణం కుదిరిందిలే..ఓ ఓ

చుక్కల పల్లకిలో..చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం..మలయ సమీరంలో

అనురాగాలే..ఆలపించనా..ఆకాశమే మౌన వీణగా
ఆ ఆ ఆ ఆ......
చుక్కల పల్లకిలో..చూపుల అల్లికలో
పలికెను కల్యాణ గీతం..మలయ సమీరంలో

ష్టేట్‌రౌడీ--1989



సంగీతం::బప్పిలహరి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల

Film Directed By::B.Gopal
తారాగణం::ఛిరంజీవి,రాధ,భానుప్రియ,రావ్‌గోపాల్‌రావ్,శారద,జయమాలిని,త్యాగరాజు,కైకాల సత్యనారాయణ. 
::::::::::::::

రాధా రాధా మదిలోన మన్మధ బాధ

రాత్రి పగలు రగిలించేయ్ మల్లెల బాధ
పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటేయవే

ఓ ఓ ఓ ఓ ఓ .....
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ
నువ్వూగితే కాలాగదు నే నాడితే నువ్వాగవూ

ఆఆ..ఆఆ..
రాధా రాధా మదిలోన మన్మధ బాధ
రాజా రాజా మనసైన మన్మధ రాజా

చరణం::1

స్వరాలు జివ్వుమంటే నరాలు కెవ్వుమంటే
సంపంగి సన్నాయి వాయించనా
పెదాలే అంటుకొంటే పొదల్లో అల్లుకుంటే
నా నవ్వు లల్లాయి పండించనా
బుసకొట్టే పిలుపుల్లో కసిపుట్టే వలపుల్లో కైపెక్కి ఊగాలిలే

ఓ ఓ ఓ ...
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలించేయ్ మల్లెల బాధ

చరణం::2

పూబంతి కూతకొచ్చి చేబంతి చేతికిచ్చి
పులకింత గంధాలు చిందించనా
కవ్వింత చీర కట్టి కసిమల్లె పూలు పెట్టి
జడ నాగు మెడకేసి బంధించనా
నడిరేయి నాట్యంలో తొడగొట్టే లాస్యంలో చెలరేగిపోవాలిలే

ఎ ఎ ఎ ఎ
రాధా రాధా మదిలోన మన్మధ బాధ
రాత్రి పగలు రగిలించేయ్ మల్లెల బాధ
పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటేయవే

హోయ్ హోయ్ హోయ్..
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ


State Rowdy--1989 
Music::Bappilahari
Lyricis::
Singer's::S.P.Balu
Film Directed By::B.Gopal
Cast::Chiranjeevi,Radha,Bhanupriya,RaogopalRao,Sarada Tyagayya,Jayamaalini,Kaikala Satyanarayana

:::::::::::

Radha radha madilona manmadha badha
ratri pagalu ragilinchey mallela badha
padagettina paruvalatoo
kavvinchake kateyaave

raja raja manasaina manmadha raja
ratri pagalu ragilindi mallela badha
nuvvugite kaalagadu
nenadite nuvvagavu

::::1

swaralu jivvumante naralu kevvumante
sampangi sannayi vayinchanaa
pedale antukunte podallo allukunte
na navvu lallayi padinchana
busakotte pilupullo
kasi putte valapullo kaipekki ugalile

::::2

pubanti kutakochi chebanti chetikichi
pulakinta gandhalu chindinchanaa
kavvinta cheera katti
kasi malle pulu petti
jada nagu medakesi bandhinchanaa
nadireyi natyamlo todagotte lasyamlo

chelaregipovalile

ష్టేట్‌రౌడీ--1998




సంగీతం::బప్పిలహరి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::ఛిరంజీవి,రాధ,భానుప్రియ,రావ్‌గోపాల్‌రావ్,శారద,జయమాలిని,త్యాగరాజు,కైకాల సత్యనారాయణ.

:::::::::

బెబెబెబెబెబె బ్రేక్ డ్యాన్స్..బెబెబెబెబెబె బ్రేక్ డ్యాన్స్

బ్రేక్ డ్యాన్స్..బ్రేక్ డ్యాన్స్ ..హ..హా..

12344444..డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
12344444..డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్ బ్రేక్..డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్

జతకుదిరే ఇద్దరికీ..కసిముదిరే పెదవులకీ
ఓ ఓ ఓ లవ్లీ..మై..డాళింగ్..డాళింగ్..

మతి చెదిరే తపనలకి..రుచి తెలిసే సొగసులకీ
ఓ ఓ.. సుప్రీమ్..మై..హాడ్ సమ్

12344444..డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్

చరణం::1

హే..హే..
నడుము భలే కొలత సరే..సమయమిదే కసిగువ్వా గువ్వా..హా..
నడుము భలే కొలత సరే..సమయమిదే కసిగువ్వా గువ్వా..హా..
జివ్వుమనే యవ్వనమే..ఇవ్వమనే కసితారా జువ్వా..
ఓఓఓఓ లవ్లీ..మై..మై..మై..డాళింగ్
ఓ ఓ ఓ..సుప్రీమ్..మై..హాడ్ సమ్

12344444..డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్

చరణం::2
హ..హ..
హ..హ..
రాతిరికి జాతరలో..సోకులకీ యమ షకు..షేకూ..హ
రాతిరికి జాతరలో..సోకులకీ యమ షకు..షేకూ..హ
కొత్తరకం కౌగిలిలో..మదన జ్వరం..ఇక నీకూ నాకూ
ఓ ఓ ఓ..సుప్రీమ్..మై..హాడ్ సమ్
ఓఓఓఓ లవ్లీ..మై..డాళింగ్

12344444..డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్ బ్రేక్..డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్

జతకుదిరే ఇద్దరికీ..కసిముదిరే పెదవులకీ
ఓ ఓ ఓ లవ్లీ..మై..డాళింగ్..డాళింగ్..

మతి చెదిరే తపనలకి..రుచి తెలిసే సొగసులకీ
ఓ ఓ.. సుప్రీమ్..మై..హాడ్ సమ్

12344444.......

ఎవరికివారే యమునాతీరే--1974


సంగీతం::చక్రవర్తి
రచన::గోపి
గానం::P.సుశీల
తారాగణం::రాజబాబు,ప్రభాకర రెడ్డి,సత్యనారాయణ,కృష్ణకుమారి,గిరిజ,రోజారమణి

పల్లవి::

జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 
పాప మేమి చేశానో..కన్నులీయ మరిచావూ..ఓఓఓ 
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 

చరణం::1

లోకమంత వెన్నెలచేసి..చీకటిలో నను వుంచావు
వేదనతో నే నున్నానూ..వేడుకగా నువు చూచేవూ..ఓఓఓ  
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 

చరణం::2

నీవూ ఒక మనిషిగ పుడితే - నీ చూపే కరువైపోతే
నాలాగే విలపించేవూ..ప్రతి దేవుని నిందించేవూ..ఓఓఓ      
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 

చరణం::3

నే చేసిన నేరం చెబితే..ఆ నేరం తిరిగి చేయనూ
నే చేసిన నేరం చెబితే..ఆ నేరం తిరిగి చేయనూ 
ఈ కనుల కోసమైనా నేనూ..మరల మరల పుడుతుంటానూ  
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా  
పాప మేమి చేశానో..కన్నులీయ మరిచావూ..ఓఓఓ  
జాలిలేని బ్రహ్మయ్యా..బదులు పలుక వేమయ్యా 

Saturday, February 04, 2012

అభిమానం--1959





సంగీతం::ఘంటసాల
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,జిక్కి

తారాగణం::అక్కినేని,సావిత్రి,కృష్ణకుమారి,కన్నాంబ,చలం,నాగయ్య,రేలంగి,రమణారెడ్డి,
అల్లురామలింగయ్య,S.వరలక్ష్మీ.

పల్లవి::

వలపు తేనెపాట తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట

వలపు తేనెపాట తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట

చరణం::1

వలపించె వలపు తోట నీ ప్రేమ పసిడితోట
ఓఓఓఓఓఓఓఓ...ఒహొహో ...
వలపించె వలపు తోట నీ ప్రేమ పసిడితోట
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట

వలపు తేనెపాట తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట

చరణం::2

నిలవాలిలే హమేశా ఈనాటి ప్రేమ భాషా
నిలవాలిలే హమేశా ఈనాటి ప్రేమ భాషా
ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాషా
ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాషా

వలపు తేనెపాట తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట పరువాల చిన్నెల సయ్యాట
ఆహహా ఆహహా..హహహహా..ఆహహహహహా

Abhimaanam--1960
Music::Ghantasala
Lyricis::Samudrala(junior)
Singer's::Ghantasala,Jikki
Cast::Akkineni,Savitri,Krishakumaari

::::::

aahaahaa haahaahaa..aahaahaa haahaahaa
oohu..ooo..oohuhuu..oohuhu..ohuhu
valapu tenepaaTa..tolivayasu poolatOTa
paruvaala chinnela sayyaaTa
valapu tenepaaTa..tolivayasu poolatOTa
paruvaala chinnela sayyaaTa

::::1

valapinche valapu tOTaa 
ne prema pasiDitOTaa
O O O O... OhOhO O O O
valapinche valapu tOTaa
ne prema pasiDitOTaa
koorimi nerigi kalisevaari bratuku poolabaaTa
koorimi nerigi kalisevaari bratuku poolabaaTa
valapu tenepaaTa..tolivayasu poolatOTa
paruvaala chinnela sayyaaTa

::::2

nilavaalile hameshaa..aa 
eenaaTi premabhaashaa..aa
O O O O..OhOhO O O O
nilavaalile hameshaa..aa
eenaaTi premabhaashaa..aa
prema peLLi muchchaTalanTe kaadule tamaashaa
prema peLLi muchchaTalanTe kaadule tamaashaa
valapu tenepaaTa tolivayasu poolatOTa
paruvaala chinnela sayyaaTa
paruvaala chinnela sayyaaTa

aahahaa aahahaa haaha haahaahahaa..haahaahahaa

అభిమానం--1959




సంగీతం::ఘంటసాల
రచన::J.R.సముద్రాల(సముద్రాల జూనియర్)  
గానం::ఘంటసాల,జిక్కి


:::::::

ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీ దొరసాని

:::::::1


ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది
ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది
హాయ్! ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది
అందచందాల వన్నెలాడి అయినా బాగుంది


ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీ దొరసాని

::::::2


కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది
మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది
ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది
అందచందాల వన్నెలాడి కోపం పోయింది

ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీ దొరసాని

::::3


పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది
పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది
పడుచువాళ్ళ పాతలతోనే పల్లెసీమ పండింది
పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది
హాయ్! చివరకు చిలిపిగ నవ్వింది, చేయి చేయి కలిపింది
అందచందాల వన్నెలాడి ఆడి పాడింది

ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహో బస్తీ దొరసాని

Abhimaanam--1960
Music::Ghantasala 
Lyricis::Samudrala(junior)
Singer's::Ghantasala, Jikki
Cast::Akkineni,Savitri,Krishakumaari

:::::::::

ohoo basti dorasani baga mustabayyindi
andachandala vanneladi ento bagundi
ohoo basti dorasani baga mustabayyindi
andachandala vanneladi ento bagundi
ohoo bastidorasani

::::1

muchataina kurulanu duvvi puladanda mudichindi
puladandato bate moothi kuda mudichindi
muchataina kurulanu duvvi puladanda mudichindi
puladandato bate moothi kuda mudichindi
haay...aapai kopam vachindi...vachina kopam hechindi
andachandala vanneladi ainaa bagundi
ohoo basti dorasani baga mustabayyindi
andachandala vanneladi ento bagundi
ohoo bastiidorasanii

::::2

kotta pellikuturu madilo kosari siggu vesindi
mattumattu kannulatonu manasutheera chusindi
kotta pellikuturu madilo kosari siggu vesindi
mattumattu kannulatonu manasutheera chusindi
haay...ameku saradaa vesindi..jarigi daggarakochindi
andachandala vanneladi kopam poindi
ohoo basti dorasani baga mustabayyindi
andachandala vanneladi ento bagundi
ohoo bastiidorasanii

::::3

paduchuvalla patalatone palleseema pandindi
palleseemalo haayi vellivirisi nindindi
paduchuvalla patalatone palleseema pandindi
palleseemalo haayi vellivirisi nindindi
haay...chivaraku chilipiga navvindi
cheyi cheyi kalipindi
andachandala vanneladi adipadindi
ohoo basti dorasani baga mustabayyindi
andachandala vanneladi ento bagundi

ohoo bastiidorasanii

Thursday, February 02, 2012

పగబట్టిన పడుచు--1971


సంగీతం::M.రంగారావ్ 
రచన::C.D.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::హరనాధ్,గుమ్మడి,రాజనాల,శారద,విజయరాధిక,జ్యోతిలక్ష్మి,అంజలీదేవి, 

పల్లవి::

అనుకున్నది ఏమైనది..అనుకోనిది ఎదురైనది
అనుకున్నది ఏమైనది..అనుకోనిది ఎదురైనది 
అనురాగ దీపం..వణికింది సుడిగాలిలోన 
ఆహాహః..ఆహాహా..ఆహాహా
అనుకున్నది ఏమైనది..అనుకోనిది ఎదురైనది 
అనురాగ దీపం..వణికింది సుడిగాలిలోన

చరణం::1

ఒక కన్ను చిలికించె..చిరునవ్వులు 
ఒక కన్ను కురిపించె..పెను మంటలు 
ఒక కన్ను చిలికించె..చిరునవ్వులు 
ఒక కన్ను కురిపించె..పెను మంటలు 
ఈ వింత యెదకోత తీరేదికాదా ఈ వింత 
యెదకోత తీరేదికాదా ఔనా..ఇంతేనా    
అనుకున్నది ఏమైనది..అనుకోనిది ఎదురైనది  
అనురాగ దీపం..వణికింది సుడిగాలిలోన
  
చరణం::2
      
విడలేని ముడియేదొ..పడివున్నది 
విధియేమొ విడదీయ..చూస్తున్నది 
విడలేని ముడియేదొ..పడివున్నది 
విధియేమొ విడదీయ..చూస్తున్నది 
ఈ గాధ ఇకనైన..ముగిసేదికాదా
ఈ గాధ ఇకనైన..ముగిసేదికాదా
ఔనా..ఇంతేనా    
అనుకున్నది ఏమైనది..అనుకోనిది ఎదురైనది  
అనురాగ దీపం..వణికింది సుడిగాలిలోన

Wednesday, February 01, 2012

కోరికలే గుర్రాలైతే--1979

 


సంగీతం::సత్యం గారు  

రచన::కోసరాజు 

గానం::S.P.బాలు,వసంతగారు.

Directed by::Dasari Narayana Rao 

తారాగణం::మురళిమోహన్,చంద్రమోహన్,మొహన్‌బాబు,జయలక్ష్మీ,ప్రభ,నిర్మల,రమాప్రభ,హేమమాలిని. 


పల్లవి::


ఏమి వేషం ఏమి రూపం..ఏమి వేషం ఏమి రూపం

ఒహో..మ్మ్ హూ..ఏ హే రావా కథానాయకీ

సావిత్రీ..ఆ ఆ ఆ..ఆ..ఆ..ఐ లవ్యూ..ఆ ఆ ఆ..ఆ..ఆ


నచ్చినానా మెచ్చినావా..ఓహో ఆహా..ఏ హే,,ఆశ దీర్చలేవా..

ధర్మరాజా..ఆ ఆ ఆ..ఆ..ఆ..ఐ లవ్యూ..ఒహో..హో హో..ఓహ్య్..


చరణం::1


నిన్నటి నాటుపిల్ల..యీ నాడు బలే రసగుల్లా

ఓ..ఒక ఛాన్సు యిచ్చిచూడూ..దులిపేస్తా నీతోడూ

సరి సరి నాకు తెలుసు..అహా..నీలో వున్న సరుకు

యిక పెరుగునులే మార్కెట్టు..సావిత్రీ..ఆ ఆ ఆ ఆ ఆ..ఐ లవ్యూ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ..


చరణం::2


ఒకసారి పైకి తెస్తె..జన్మంతా రుణపడి వుంటా 

ఓ..రేయి పగలు కృషి చేస్తా..ఒకదారిని నీకు చూపిస్తా

చూడు చూడు కోతి మూకల్ని..నవ్వుతుండే ఆ వెధవల్ని

హ్హ..ఎవరెటు చస్తే మనకేమీ..సావిత్రి..ఆ ఆ ఆ ఆ ఆ ఆ..ఐ లవ్యూఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


ఏమి వేషం..ఏమి వేషం..అబ్భా..ఏమి రూపం

ఒహో..మ్మ్ హూ..ఏ హే రావా కథానాయకీ

సావిత్రీ..ఆ ఆ ఆ..ఆ..ఆ..ఐ లవ్యూ..ఆ ఆ ఆ..ఆ..ఆ,,హ్హా..ఓ..ఓ..