Thursday, February 02, 2012

పగబట్టిన పడుచు--1971


సంగీతం::M.రంగారావ్ 
రచన::C.D.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::హరనాధ్,గుమ్మడి,రాజనాల,శారద,విజయరాధిక,జ్యోతిలక్ష్మి,అంజలీదేవి, 

పల్లవి::

అనుకున్నది ఏమైనది..అనుకోనిది ఎదురైనది
అనుకున్నది ఏమైనది..అనుకోనిది ఎదురైనది 
అనురాగ దీపం..వణికింది సుడిగాలిలోన 
ఆహాహః..ఆహాహా..ఆహాహా
అనుకున్నది ఏమైనది..అనుకోనిది ఎదురైనది 
అనురాగ దీపం..వణికింది సుడిగాలిలోన

చరణం::1

ఒక కన్ను చిలికించె..చిరునవ్వులు 
ఒక కన్ను కురిపించె..పెను మంటలు 
ఒక కన్ను చిలికించె..చిరునవ్వులు 
ఒక కన్ను కురిపించె..పెను మంటలు 
ఈ వింత యెదకోత తీరేదికాదా ఈ వింత 
యెదకోత తీరేదికాదా ఔనా..ఇంతేనా    
అనుకున్నది ఏమైనది..అనుకోనిది ఎదురైనది  
అనురాగ దీపం..వణికింది సుడిగాలిలోన
  
చరణం::2
      
విడలేని ముడియేదొ..పడివున్నది 
విధియేమొ విడదీయ..చూస్తున్నది 
విడలేని ముడియేదొ..పడివున్నది 
విధియేమొ విడదీయ..చూస్తున్నది 
ఈ గాధ ఇకనైన..ముగిసేదికాదా
ఈ గాధ ఇకనైన..ముగిసేదికాదా
ఔనా..ఇంతేనా    
అనుకున్నది ఏమైనది..అనుకోనిది ఎదురైనది  
అనురాగ దీపం..వణికింది సుడిగాలిలోన

No comments: