Friday, August 28, 2009

ఓ మనిషి తిరిగి చూడు--1976









సంగీతం::రమేష్ నాయుడు
రచన::D.C. నారాయణరెడ్డి 
గానం::రామకృష్ణ,M.రమేష్ 
తారాగణం::మురళిమోహన్,మోహన్ బాబు,ఈశ్వర రావు,జయసుధ,నిర్మల

పల్లవి::

బండెనక బండి కట్టి..జోడెడ్ల బండికట్టి
బండెనక బండి కట్టి..జోడెడ్ల బండికట్టి
ఆ బండి మీద..ఆహ బండి మీద 
ఆ బండి మీద పోదమా..ఓ సిన్నారి లచ్చు 
ఆ బండి దాటి పోదమా..ఓ సిన్నారి లచ్చు

నువు బండి కట్టవద్దు..ఏ బండి దాటవద్దు 
బండి కట్టవద్దు..ఏ బండి దాటవద్దు 
నీ ఇంట వుంటె..నీ ఇంటవుంటే తప్పురో 
ఓ కిలాడి కిట్టు..ఎవరైన చూస్తే ముప్పురో 
ఓ కిలాడి కిట్టు..

చరణం::1

పొగబండి మీద తీసుకెలతాను 
పట్నం సొగసంతా..దోసిట్లో పెడతాను 
పొగబండి మీద తీసుకెలతాను 
పట్నం సొగసంతా..దోసిట్లో పెడతాను
కాసుల పేరిచ్చి..వన్నె గాజులు తొడిగిచ్చి
కాసుల పేరిచ్చి..వన్నె గాజులు తొడిగిచ్చి
ఊరంతా సరదాగా ఊరేగిస్తాను
అహ..అహ..అహ..ఉహు..ఉహు..ఉహు
అహ..అహ..అహ..ఉహు..ఉహు..ఉహు
అటు తిప్పి ఇటు తిప్పి..ఆపైన కనుగప్పి 
అటు తిప్పి ఇటు తిప్పి..ఆపైన కనుగప్పి 
మటుమాయమౌతవొ..మదిలో వదిలేస్తవో 
బండి నాకు వద్దు..ఒక బండి అసలు వద్దు 
బండి నాకు వద్దు..ఒక బండి అసలు వద్దు 
అహ నిన్ను నమ్మలేనురో..ఓ చలాకి చందు 
నేనున్న ఊరు వదలనోయ్..ఓ చలాకి చందు

బండెనక బండి కట్టి..జోడెడ్ల బండికట్టి
బండెనక బండి కట్టి..జోడెడ్ల బండికట్టి
ఆ బండి మీద..ఆహ బండి మీద 
ఆ బండి మీద పోదమా..ఓ సిన్నారి లచ్చు 
ఆ బండి దాటి పోదమా..ఓ సిన్నారి లచ్చు

చరణం::2

ఏటి గట్టు మీద..గూడు కడతాను 
ఆ గూటి చుట్టు..మల్లెపూలు చుడతాను 
ఏటి గట్టు మీద..గూడు కడతాను 
ఆ గూటి చుట్టు..మల్లెపూలు చుడతాను
నురగల్లో నురుగులా..పువ్వుల్లో పువ్వులా 
సందిట్లో నినుదాచ..సంబరపడతాను 
అహ..అహ..అహ..ఉహు..ఉహు..ఉహు
అహ..అహ..అహ..ఉహు..ఉహు..ఉహు
ఏదొద్దు ఏమొద్దు..ఈ సరసాలిపుడొద్దు 
ఏదొద్దు ఏమొద్దు..ఈ సరసాలిపుడొద్దు 
మొదటతాళి కట్టరా..పిదప చేయి పట్టరా

బండెనక బండి కట్టి..జోడెడ్ల బండికట్టి
బండెనక బండి కట్టి..జోడెడ్ల బండికట్టి
ఆ బండి మీద..ఆహ బండి మీద 
ఆ బండి మీద పోదమా..ఓ సిన్నారి లచ్చు 
ఆ బండి దాటి పోదమా..ఓ సిన్నారి లచ్చు

Tuesday, August 25, 2009

తాతా మనవడు--1973




సంగీతం::రమేష్ నాయుడు
రచన::D. సినారె
గానం::రామకృష్ణ బృందం 
తారాగణం::S.V. రంగారావు, రాజబాబు,అంజలీదేవి, విజయనిర్మల,సత్యనారాయణ,రమాప్రభ 

పల్లవి::

అనుబంధం ఆత్మీయత..అంతా ఒక బూటకం
అనుబంధం ఆత్మీయత
ఆత్మతృప్తికై మనుషులు..ఆడుకొనే నాటకం..మ్మ్
నాటకం..నాటకం..వింత నాటకం

అనుబంధం ఆత్మీయత..అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు..ఆడుకొనే నాటకం
వింత నాటకం

చరణం::1

ఎవరు తల్లి ఎవరు కొడుకు 
ఎందుకు ఆ తెగని ముడి
కొన ఊపిరిలో ఎందుకు అణగారని అలజడి
ఎవరు తల్లి ఎవరు కొడుకు 
ఎందుకు ఆ తెగని ముడి
కొన ఊపిరిలో ఎందుకు అణగారని అలజడి
కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికీ..ఎవ్వరిరీ
ఎవ్వరిరీ
అవి కాలుతున్నా..ఆ..అవి కాలుతున్నా
వెలుగులె కావాలి అందరికీ అందరికీ

అనుబంధం ఆత్మీయత..అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు..ఆడుకొనే నాటకం..మ్మ్
వింత నాటకం

చరణం::2

కొడుకంటూ నీకు ఒకడున్నాడు
వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు
నిన్ను కడసారైనా చూడ రాలేదు
వల్లకాటికైనా వస్తాడను ఆశలేదు
ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషను
ఏ తల్ల్లీ కనగూడదు ఇలాంటి కొడుకును
ఇలాంటి కొడుకును

అనుబంధం ఆత్మీయత..అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు..ఆడుకొనే నాటకం..మ్మ్
వింత నాటకం

చరణం::3

కానివారి ముచ్చటకై కలవరించు మూఢునికి
కన్నవారి కడుపుకోత ఎన్నడైన తెలిసేనా
తారాజువ్వల వెలుగుల..తల తిరిగిన ఉన్మాదికి
చితిమంటల చిటపటలు వినిపించేనా 
చితిమంటల చిటపటలు వినిపించేనా

అనుబంధం ఆత్మీయత..అంతా ఒక బూటకం
అనుబంధం ఆత్మీయత
ఆత్మతృప్తికై మనుషులు..ఆడుకొనే నాటకం..మ్మ్
నాటకం..నాటకం..వింత నాటకం

Friday, August 21, 2009

ఆత్మీయులు--1969




సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::D.సినారె
గానం:::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు కాకుంటే కంగారు
ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు కాకుంటే కంగారు
ఈరోజుల్లో..ఓ ఓ ఓ ఓ ఓ

చరణం::1

తాజా తాజా మోజుల కోసం..తహతహలాడుతు ఉంటారు
తాజా తాజా మోజుల కోసం..తహతహలాడుతు ఉంటారు
పొట్టి షర్ట్లతో టైటు ప్యాంట్లతో..లొట్టి పిట్టలవుతుంటారు
మెప్పులు కోసం..అప్పులు చేసి
మెప్పులు కోసం అప్పులు చేసి..తిప్పలపాలవుతుంతారు
ఈరోజుల్లో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

చరణం::2

రోడ్డు సైడున రోమియోలలా..రోజంతా బీటేస్తారు
రోడ్డు సైడున రోమియోలలా..రోజంతా బీటేస్తారు
సొగసరి చిన్నది కంటపడిందా చూపులతో మింగేస్తారు
ఆ చిన్న కాస్తా..చెయ్యి విసిరితే
ఆ చిన్నది కాస్త చెయ్యి విసిరితే చెప్పకుండా చెక్కేస్తారు

ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు..కాకుంటే కంగారు
ఈరోజుల్లో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 

చరణం::3

పాఠాలకు ఎగనామం పెట్టి..మ్యాటిని షోలకు తయ్యారు
పాఠాలకు ఎగనామం పెట్టి..మ్యాటిని షోలకు తయ్యారు
పార్టీలంటూ పికినికులంటూ..పుణ్యకాలము గడిపేరు
పరీక్ష రోజులు..ముంచుకురాగా
పరీక్ష రోజులు ముంచుకురాగా..తిరుపతి ముడుపులు కడతారు

ఈరోజుల్లో..పడుచువారు గడుసువారు
సహనంలో కిసానులు..సమరంలో జవానులు
ఈరోజుల్లో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఆడపిల్లలను గౌరవించితే..ఆత్మ గౌరవం పెరిగేను
సమరసభావం కలిగిన నాడే చదువుల విలువలు పెరిగేను
దేశానికి వెన్నెముకలు మీరు దివాళ కోరులు కావద్దు
భవితవ్యానికి బాటలు వేసే..భారం మనదని మరవద్దు
ఆ భారం మనదని మరవద్దు..మనదని మరవొద్దు

Wednesday, August 19, 2009

దత్త పుత్రుడు--1972

















సంగీతం::T.చలపతిరావు
రచన::సినారె 
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ, నాగభూషణం, రామకృష్ణ, పద్మనాభం

పల్లవి::

గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా

హాయ్ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా

చరణం::1

తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి
నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి..ఆహా
తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి
నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి

అదను చూసి నా చేయి పట్టుకుంటివి
ఆనాటి నుంచి నా మదిలో..అల్లరి పెడుతుంటివి

గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా

ఆఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా

చరణం::2

నీ కందీరగ నడుమేమో కదులుతున్నది
దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది
నీ కందీరగ నడుమేమో కదులుతున్నది
దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది

నీ ఉంగారాల జుట్టేమో ఊగుతున్నది
దాన్ని ఒక్కసారి నిమరాలని ఉబలాటం ఉన్నది

హోయ్..గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా

హాఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా

చరణం::3

పైర గాలి నా చెవిలో ఊగుతూ ఉన్నది
పైర గాలి నా చెవిలో ఊగుతున్నది
నీ పడుచుదనం రుచి ఎంతో చూడమన్నది

లగ్గమాడే రోజు దగ్గెరున్నది
మనం లగ్గమాడే రోజు దగ్గెరున్నదీ..ఈ ఈ ఈ
అందాకా ఈ తొందర ఎందుకులే అన్నది

హాయ్..గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా

హాఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా..హా

దత్త పుత్రుడు--1972






















సంగీతం::T.చలపతిరావు
రచన::సినారె 
గానం::P.సుశీల 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ, నాగభూషణం, రామకృష్ణ, పద్మనాభం
పల్లవి::

హ్హా హ్హా హ్హా...అమ్మో
హ్హా హ్హా హ్హా...అమ్మో 
చక్కాని చిన్నవాడే..చుక్కల్లో చందురూడే 
మెరుపల్లే మెరిశాడే..తొలకరి వానల్లే కురిశాడే 
ఎవరో..ఓఓఓఓ..తెలుసా..గారాల బావ తెలుసా 

చక్కాని చిన్నవాడే..చుక్కల్లో చందురూడే 
మెరుపల్లే మెరిశాడే..తొలకరి వానల్లే కురిశాడే 

చరణం::1 

ఆఆఆఆ..ఓహో..ఆఆఆఆ..ఓహో..ఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
అత్తకొడుకని విన్నానే..అయిన వాడనుకున్నానే 
ఓహో..ఓహో..ఓ..ఓ..ఓహో..ఓహో..ఓ..ఓ
వల్లమాలిన సిగ్గేసి..తలుపు చాటున చూసానే 
ఏమి అందం..ఏమి చందం..ఏమి అందం ఏమి చందం
గుండెల్లో రేగెను గుబగుబలేవో..గుసగుసలేవో 

చక్కాని చిన్నవాడే..హహహా..చుక్కల్లో చందురూడే..హహహా
మెరుపల్లే మెరిశాడే..తొలకరి వానల్లే కురిశాడే 
ఎవరో..ఓఓఓఓ..తెలుసా..గారాల బావ తెలుసా 

చరణం::2 

హ..హ..హ...హ..ఊహుహూహు
ఆ..ఆ..ఆ..ఆ..ఓఓఓఓ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఆహాహాహా..హోయ్..ఆహాహాహాఆహా..హోయ్
ఆహాహాహాఆహా..ఆ..హా..ఆ..హా 
లల్లాలలా..హోయ్..లల్లాలలా..హోయ్..లల్లాలలాహోయ్..లాలలా

మెల్లగా..హాయ్..మెల మెల్లగా
హాయ్..హాయ్..హాయ్..హాయ్ 
మెల్లగా నను చూసాడే..కళ్ళతో నవ్వేసాడే 
మెత్తగా నను తాకాడే..కొత్త కోరికలు లేపాడే 
ఏమి వింత..ఈ గిలిగింత..ఏమి వింత ఈ గిలిగింత
రెపరెపలాడే నా ఒళ్ళంతా..ఏదో పులకింత 

చక్కాని చిన్నవాడే..హహహా
చుక్కల్లో చందురూడే..హహహా 
మెరుపల్లే మెరిశాడే..తొలకరి వానల్లే కురిశాడే 
ఎవరో..ఓఓఓఓ..తెలుసా..గారాల బావ తెలుసా

దత్త పుత్రుడు--1972





సంగీతం::T.చలపతిరావు
రచన::సినారె 
గానం::ఘంటసాల,రమోల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ, నాగభూషణం, రామకృష్ణ, పద్మనాభం

పల్లవి::

మనసైన..ఓ చినదాన..ఒక మాటుంది వింటావా 
ఆ..సిగ్గుపడే..ఓహ్ చిలకమ్మా..కంది చేనుంది పోదామా 
ఓహో.. 
మనసైన..ఓహ్ చినదాన..ఒక మాటుంది వింటావా 
ఆ..సిగ్గుపడే..ఓహ్ చిలకమ్మా..కంది చేనుంది పోదామా 

ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా 
అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా 
ఒడిలెహీ..ఒడిలెహీ..ఒడిలెహీ
అహహహహాహాహాహాహాహా 
ఒడిలెహీ..ఒడిలెహీ..ఒడిలెహీ
అహహహహాహాహాహాహాహా 

చరణం::1

నా గుండెలోన అందమైన గూడు ఉన్నది
ఆ గూటిలోన నీకే చోటు ఉన్నది 
ఆహ
నా..గుండెలోన అందమైన గూడు ఉన్నది
ఆ..గూటిలోన నీకే చోటు ఉన్నది 
ఆ..చోట ఉంటావా
ఆ..ఆ 
నా మాట వింటావా
ఊహూ 
ఆ..చోట ఉంటావా
ఆ.. 
నా మాట వింటావా..ఆ..ఆ..నా మాట వింటావా
బులపాఠ..తీర్చుకుంటావా 

మనసైన..ఓహ్ చినదాన..ఒక మాటుంది వింటావా 
ఆ..సిగ్గుపడే..ఓహ్ చిలకమ్మా..కంది చేనుంది పోదామా 
ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా 
అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా 
ఒడిలెహీ..ఒడిలెహీ..ఒడిలెహీ 
అహహహహాహాహాహాహాహా 
ఒడిలెహీ..ఒడిలెహీ..ఒడిలెహీ
అహహహహాహాహాహాహాహా 

చరణం::2

మా..ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది
ఆ..పందిరి కింద మల్లెపూల పానుపున్నది 
మా..ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది
ఆ..పందిరి కింద మల్లెపూల పానుపున్నది 
ఆ..పానుపు అడిగింది
ఊ.. 
నీ రాణి ఎవరంది 
ఓహో.. 
ఆ పానుపు అడిగింది..నీ రాణి ఎవరంది
మన కోసం చూస్తూ ఉంది 

మనసైన..ఓహ్ చినదాన..ఒక మాటుంది వింటావా 
ఆ..సిగ్గుపడే..ఓహ్ చిలకమ్మా..కంది చేనుంది పోదామా 
ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా 
అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా 
ఒడిలెహీ..ఒడిలెహీ..ఒడిలెహీ
అహహహహాహాహాహాహాహా  
ఒడిలెహీ..ఒడిలెహీ..ఒడిలెహీ 
అహహహహాహాహాహాహాహా 

చరణం::3

నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి
నీ పొంగులే నా గుండెలో ఉప్పొంగుతున్నాయి 
ఊ.. 
నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి
నీ పొంగులే నా గుండెలో ఉప్పొంగుతున్నాయి 
కొంచెం చూడనిస్తావా
నో..నో 
పోని తాకనిస్తావా
ఆహ.. 
కొంచెం చూడనిస్తావా..ఆ..ఆ..పోని తాకనిస్తావా
నను నీతో చేర్చుకుంటావా..ఆ

మనసైన..ఓహ్ చినదాన..ఒక మాటుంది వింటావా 
ఆ..సిగ్గుపడే..ఓహ్ చిలకమ్మా..కంది చేనుంది పోదామా

దత్త పుత్రుడు--1972






















సంగీతం::T.చలపతిరావు
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ, నాగభూషణం, రామకృష్ణ, పద్మనాభం

పల్లవి::

అందానికి అందానివై..ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా..ఆ..నా దానా

అనురాగమే నీ రూపమై..కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా..ఆ..నా రాజా

చరణం::1

వలపించావు వల వేశావు..నను నీలోనే దాచేసావు
వలపించావు వల వేశావు..నను నీలోనే దాచేసావు
మనసు సొగసు దోచావు మనసు సొగసు దోచావు
మదిలో నన్నే..నిలిపావు..నిలిపావు

అందానికి అందానివై..ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా..ఆ..నా దానా

అనురాగమే నీ రూపమై..కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా..ఆ..నా రాజా

చరణం::2

నీలాకాశం నీడలలోన..నిర్మల ప్రేమ వెలగాలి
నీలాకాశం నీడలలోన..నిర్మల ప్రేమ వెలగాలి
వలపే విజయం పొందాలి వలపే విజయం పొందాలి
మమతల మధువే..కురవాలి..కురవాలి

అందానికి అందానివై..ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా..ఆ..నా దానా

అనురాగమే నీ రూపమై..కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా..ఆ..నా రాజా

Tuesday, August 18, 2009

భార్య బిడ్డలు--1972





సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

వలచీనానమ్మ..హమ్మా..హమ్మా..హమ్మా..హమ్మా
వలచీనానమ్మ
వలచినానని తెలిసికూడా నే పలకరించినా పలకడమ్మా 
వలచీనానమ్మ..వలచీనానమ్మ 
హేయ్..వలచీనావమ్మా..హమ్మా..హమ్మా..హమ్మా..హమ్మా
వలచీనావమ్మా
వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా..వలచీనావమ్మా

చరణం::1 

కళ్ళున్నందుకు ఒకసారైనా కలపాలోయి
కమ్మని కబురులు సరదాకైనా చెప్పాలోయి..ఈ
కళ్ళున్నందుకు ఒకసారైనా కలపాలోయి
కమ్మని కబురులు సరదాకైనా చెప్పాలోయి..ఈ

కబురులు కమ్మగ ఉండవమ్మ జరగకపోతేనూ
కబురులు కమ్మగ ఉండవమ్మ జరగకపోతేనూ
కళ్ళు కలిపితే ఊరకపోదు..కలతేరేగేను..ఊఊఉ 

వలచీనానమ్మ..హమ్మా..హమ్మా..హమ్మా..హమ్మా
వలచీనానమ్మ

వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా..వలచీనావమ్మా

చరణం::2

వయసంటేనే నీ ఒంటికి పడదా ఊరకుంటావు
సొగసంటే నీ కంటికి చేదా చూడనంటావు
వయసంటేనే నీ ఒంటికి పడదా ఊరకుంటావు
సొగసంటే నీ కంటికి చేదా చూడనంటావు

సొగసులోనా సొగసే లేదు సొంతం కాకుంటే
సొగసులోనా సొగసే లేదు సొంతం కాకుంటే
వయసే ఒంటికి చెరుపౌతుంది..వదలి ఊరుకుంటే

వలచీనానమ్మ..హమ్మా..హమ్మా..హమ్మా
వలచీనానమ్మ

వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా..వలచీనావమ్మా

ఓఓ..ఓ..హోఓ..ఓ..ఓఓ..ఓ..హోఓ..ఓ

Monday, August 17, 2009

విచిత్ర వివాహం--1973



ఈ పాట వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి


సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::భానుమతి

నాగరికత పేరుతో..నవ్వులపాలయ్యేరు
దోరవయసు జోరులో..దారితప్పిపోయేరు
నా మాటలో నిజం వింటారా మీరు?

అమ్మాయిలూ అబ్భాయిలూ నామాటలో నిజం వింటార మీరు
అమ్మాయిలూ అబ్భాయిలూ నామాటలో నిజం వింటార మీరు
అమ్మాయిలూ..అబ్బాయిలూ

దంమ్మారో దంమ్మంటు పాడేరులే..ఆడమగా కలసి ఆడేరులే
దంమ్మారో దంమ్మంటు పాడేరులే..ఆడామగా కలసి ఆడేరులే
ఇదే గానమంటు..ఇదే నాట్యమంటు..పెడదారిలో మీరు పడిపోతున్నారు

అమ్మాయిలూ అబ్భాయిలూ నామాటలో నిజం వింటార మీరు
అమ్మాయిలూ..అబ్బాయిలూ

ప్రతివారు లవ్‌పేరు చెపుతారులే..పైమోజుకే లోంగిపోతారులే
ప్రతివారు లవ్‌పేరు చెపుతారులే..పైమోజుకే లోంగిపోతారులే
ఇదే ఫ్యాషనంటు..ఇదే కల్చరంటు..పెడదారిలో మీరు పడిపోతున్నారు

అమ్మాయిలూ అబ్భాయిలూ నామాటలో నిజం వింటార మీరు
అమ్మాయిలూ..అబ్బాయిలూ

ప్రతిజంట ఈలాగె వర్ధిల్లాలీ..ప్రతి ఇల్లు ఈలాగె విలసిల్లాలీ
ప్రతిజంట ఈలాగె వర్ధిల్లాలీ..ప్రతి ఇల్లు ఈలాగె విలసిల్లాలీ
ఈ చిరునవ్వు చిందే..పసిపాపల్లు ఉండే..సంసారమేకదా..సౌభాగ్యసీమ

అమ్మాయిలూ అబ్భాయిలూ నామాటలో నిజం వింటార మీరు
అమ్మాయిలూ..అబ్బాయిలూ

Monday, August 03, 2009

ప్రేమ సాగరం ~~ 1983



సంగీతం::T.రాజేద్రన్
రచన::రాజశ్రీ
గానం::SP.బాలు,S.జానకి


ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్
ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను

గాలుల గారాలే చెలి కులుకున నిలిపినది
మెరుపుల మిసమిసలె మేఘలకు తెలిపినది
ముద్దు మోములో కొటి మోహములు చిలికేను నా చెలి కనులే
సింధు భైరవిని చిలక పలుకుల దోర పెదవులే పలికే
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
లాలాలల లాలాలల
లాలాలల లాలాలల

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను

అప్సరా ఆడెనే అందలే మ్రోగెనే
అరులు విరిసి పలకరించె మనసు
కలలు మురిసి పులకరించె వయసు
కన్నులు కులికెను కవితలు పలికెను
పాదము కదిలెను భావము తెలిసెను
అదే కదా అనుక్షణం చెరగని
సల్లాపమే ఉల్లాసమే ఆ నగవు
మోహము కొనసాగే తొలి మోజులు చెలరేగే
నా పాటకు పల్లవిలా చెలి పొంగెను వెల్లువలా
అమరవాణి ఇది అందాల గని ఇది నవతరానికే ఆధారం
మధుర మధుర సుకుమార ప్రణయ రసలోక తరంగిణి చెలి స్నేహం ఆ ఆ
పలవరింతలు రేపెను పోటి
ఆమె కెవరు లేరిక సాటి
పలవరింతలు రేపెను పోటి
ఆమె కెవరు లేరిక సాటి
లాలాలల లాలాలల
లాలాలల లాలాలల

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను