సంగీతం::రమేష్ నాయుడు
రచన::D. సినారె
గానం::రామకృష్ణ బృందం
తారాగణం::S.V. రంగారావు, రాజబాబు,అంజలీదేవి, విజయనిర్మల,సత్యనారాయణ,రమాప్రభ
పల్లవి::
అనుబంధం ఆత్మీయత..అంతా ఒక బూటకం
అనుబంధం ఆత్మీయత
ఆత్మతృప్తికై మనుషులు..ఆడుకొనే నాటకం..మ్మ్
నాటకం..నాటకం..వింత నాటకం
అనుబంధం ఆత్మీయత..అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు..ఆడుకొనే నాటకం
వింత నాటకం
చరణం::1
ఎవరు తల్లి ఎవరు కొడుకు
ఎందుకు ఆ తెగని ముడి
కొన ఊపిరిలో ఎందుకు అణగారని అలజడి
ఎవరు తల్లి ఎవరు కొడుకు
ఎందుకు ఆ తెగని ముడి
కొన ఊపిరిలో ఎందుకు అణగారని అలజడి
కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికీ..ఎవ్వరిరీ
ఎవ్వరిరీ
అవి కాలుతున్నా..ఆ..అవి కాలుతున్నా
వెలుగులె కావాలి అందరికీ అందరికీ
అనుబంధం ఆత్మీయత..అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు..ఆడుకొనే నాటకం..మ్మ్
వింత నాటకం
చరణం::2
కొడుకంటూ నీకు ఒకడున్నాడు
వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు
నిన్ను కడసారైనా చూడ రాలేదు
వల్లకాటికైనా వస్తాడను ఆశలేదు
ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషను
ఏ తల్ల్లీ కనగూడదు ఇలాంటి కొడుకును
ఇలాంటి కొడుకును
అనుబంధం ఆత్మీయత..అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు..ఆడుకొనే నాటకం..మ్మ్
వింత నాటకం
చరణం::3
కానివారి ముచ్చటకై కలవరించు మూఢునికి
కన్నవారి కడుపుకోత ఎన్నడైన తెలిసేనా
తారాజువ్వల వెలుగుల..తల తిరిగిన ఉన్మాదికి
చితిమంటల చిటపటలు వినిపించేనా
చితిమంటల చిటపటలు వినిపించేనా
అనుబంధం ఆత్మీయత..అంతా ఒక బూటకం
అనుబంధం ఆత్మీయత
ఆత్మతృప్తికై మనుషులు..ఆడుకొనే నాటకం..మ్మ్
నాటకం..నాటకం..వింత నాటకం
No comments:
Post a Comment