Wednesday, August 19, 2009

దత్త పుత్రుడు--1972






















సంగీతం::T.చలపతిరావు
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ, నాగభూషణం, రామకృష్ణ, పద్మనాభం

పల్లవి::

అందానికి అందానివై..ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా..ఆ..నా దానా

అనురాగమే నీ రూపమై..కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా..ఆ..నా రాజా

చరణం::1

వలపించావు వల వేశావు..నను నీలోనే దాచేసావు
వలపించావు వల వేశావు..నను నీలోనే దాచేసావు
మనసు సొగసు దోచావు మనసు సొగసు దోచావు
మదిలో నన్నే..నిలిపావు..నిలిపావు

అందానికి అందానివై..ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా..ఆ..నా దానా

అనురాగమే నీ రూపమై..కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా..ఆ..నా రాజా

చరణం::2

నీలాకాశం నీడలలోన..నిర్మల ప్రేమ వెలగాలి
నీలాకాశం నీడలలోన..నిర్మల ప్రేమ వెలగాలి
వలపే విజయం పొందాలి వలపే విజయం పొందాలి
మమతల మధువే..కురవాలి..కురవాలి

అందానికి అందానివై..ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా..ఆ..నా దానా

అనురాగమే నీ రూపమై..కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా..ఆ..నా రాజా

No comments: