Tuesday, July 22, 2014

నాయకుడు--1987






















సంగీతం::ఇళయరాజా 
రచన::వెన్నెలకంటి 
గానం::S.P.బాలు,S.P.శైలజ

పల్లవి::

ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది
ఏదో తెలియని బంధమిది

చరణం::1

పూజకు నోచని పూవును కోరి
వలచిన స్వామివి నువ్వేలే
రూపం లేని అనురాగానికి
ఊపిరి నీ చిరునవ్వేలే
కోవెల లేని..ఈ..ఈఈఈ
కోవెల లేని దేవుడవు
గుండెల గుడిలో వెలిశావు
పలికే జీవన సంగీతానికి
వలపుల స్వరమై ఒదిగావు
తనువూ మనసు ఇక నీవే

ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది
ఏదో తెలియని బంధమిది

చరణం::2

వేసవి దారుల వేళలలోన వెన్నెల తోడై కలిసావు
పూచే మల్లెల తీగకు నేడు పందిరి నీవై నిలిచావు
ఆశలు రాలే..ఏఏఏఏఏ 
ఆశలు రాలే శిశిరంలో ఆమనీ నీవై వెలిశావు
ఆలుమగల అద్వైతానికి అర్ధం నీవై నిలిచావు
తనువు మనసు ఇక నీవే

ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది
ఏదో తెలియని బంధమిది
హ్హాహ్హా....హా 

ఆంధ్రకేసరి--1983



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
తారాగణం::విజయచంద్ర,మురళిమోహన్,శ్రీధర్,J.V.రమణమూర్తి,అల్లురామలింగయ్య,రాజబాబు.

పల్లవి::

నమః సోమాయచ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయచ
నమశ్శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయచ
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే
చ నమో వృక్షేభ్యోహరి కేశేభ్యో నమస్తారాయ నమశ్శంభవేచ
మయో భవే చ నమశ్శంకరాయ చ మయస్కరాయచ
నమశ్శివాయ చ శివతరాయచ

వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

చరణం::1

రాజరాజ నరేంద్రుడు..కాకతీయులు
తేజమున్న మేటి దొరలు..రెడ్డి రాజులు
గజపతులు..నరపతులు..ఏలిన ఊరు
ఆ కథలన్ని నినదించె గౌతమి హోరు
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

చరణం::2

శ్రీవాణి గిరిజాస్చిరాయ దథతో వక్షో ముఖాంగేశు
యే లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీపుంస యోగోద్భవాం
దేవేదత్రయమూర్తాయ స్త్రిపురుష సంపూజితాపస్సురైర్భూయాశుః
పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే

ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
కవిసార్వభౌములకిది ఆలవాలము
కవిసార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించె నందనవనము

వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

చరణం::3

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు

వేదంలా ఘోషించే గోదావరి
అమరదామంలా శోభిల్ల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించే గోదావరి
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి

Andhra Kesari--1983
Music::Satyam
Lyricis::Aarudra
Singer::S.P.Balu
Cast::Vijayachander,MuraliMohan,Sriidhar,J.V.RamaNamoorti,Alluraamalingayya,Raajabaabu.

::::

vedamlaa ghoshinche godavari
amaradhaamamlaa shobhille rajamahendri
shatabdhala charitagala sundara nagaram
gata vaibhava deeptulato kammani kavyam

raja raja narendrudu kakateeyulu
tejamunna meti doralu reddirajulu
gajapatulu, narapatulu yelina vuru
aa kadhalanni ninadinche goutami horu

shree vanee girijaashchirayadadhato vakshomukhangeshuye
lokaanam sthiti maavahantyavihataam stri pumsayogorbhava
tevedatraya murtayastri purushaasampujitaavassurai
rbhuuyaamsuhu purushottamambhujabhavah shrikandharaashreyase

aadi kavita nannaya rasenichata
shrinadha kavi nivasamu pedda muchata
kavi sarvabhoumulakidi aalavalamu
nava kavitalu vikasinche nandanavanamu

dittamaina shilpala devalaaluu
kattu kadhala chitraangi kanaka medalu
kottukuni poye konni koti lingalu
veereshilingamokadu migilenu chalu

Monday, July 21, 2014

ఆలయశిఖరం--1983


సంగీతం::సత్యం
రచన::ఉపద్రష్ట సాయి
గానం::S.P.బాలు 
తారాగణం::చిరంజీవి,సుమలత,గొల్లపూడిమారుతిరావు,సత్యనారాయణ. 


పల్లవి::

హే..హేహే
ఇది ఆశలు రేపే లోకం..అడియాశలు చేసే లోకం
హే..స్వార్థం మరిగిన మనుషుల్లారా
సాగదు సాగదు మీ మోసం..ఊ
సాగదు..సాగదు..మీ మోసం

ఇది ఆశలు రేపే లోకం..అడియాశలు చేసే లోకం
హే..స్వార్థం మరిగిన మనుషుల్లారా
సాగదు సాగదు మీ మోసం..ఊ
సాగదు..సాగదు..మీ మోసం

చరణం::1

కోటలు కట్టిన రాజులెక్కడో..ఓ
బాటలు వేసిన కూలీలెవరో
కోటలు కట్టిన రాజులెక్కడో..బాటలు వేసిన కూలీలెవరో
కాలం నడిచే కాలినడకలో..సమాధిరాళ్ళై నిలిచారు..ఊ ఊ
చరిత్రగానే మిగిలేరు

ఇది ఆశలు రేపే లోకం..అడియాశలు చేసే లోకం
హే..స్వార్థం మరిగిన మనుషుల్లారా
సాగదు సాగదు మీ మోసం..ఊ
సాగదు..సాగదు..మీ మోసం

చరణం::2

మనుషుల మమతలు మట్టిగోడలు
కలిసిన మనుసులు మర్రి ఊడలు
మనుషుల మమతలు మట్టిగోడలు
కలిసిన మనుసులు మర్రి ఊడలు
కన్నవారి కల పండించాలీ..ఈ
కన్నవారి కల పండించాలి
రేపటి వెలుగయి నిలవాలి

ఇది ఆశలు రేపే లోకం
అడియాశలు చేసే లోకం
హే..స్వార్థం మరిగిన మనుషుల్లారా 
సాగదు సాగదు మీ మోసం..ఊ
సాగదు..సాగదు..మీ మోసం
హై..హేహే..హై

Sunday, July 20, 2014

ఆలయశిఖరం--1983


సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::చిరంజీవి,సుమలత,గొల్లపూడిమారుతిరావు,K.సత్యనారాయణ. 


పల్లవి::

నీ రూపు మారింది గోపాలుడా
లేని నాజూకు పెరిగింది నా రాముడా
పూలఉయ్యాల ఊపాలా..ఆ
ఓ బాలుడా..బాలుడా..గోపాలుడా
హా..ఆ బాలుడా..గోపాలుడా

హ్హా..హ్హా..హ్హా
ఈ రాధ కన్నేస్తే గోపాలుడే
మరి ఈ సీత కరుణిస్తే శ్రీరాముడే
వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే
బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే

చరణం::1

మెరిసే..నీ కళ్ళలోనా
గండు మీనై నేనీది రానా..ఆ..ఆ
వలపే..నీ గుండెలోనా
మురళి పిలుపై నే ఊగిపోనా


మెరిసే నీ కళ్ళలోనా..ఆ
గండు మీనై నేనీది రానా..ఆ..ఆ 
ఓ..ఓ..వలపే నీ గుండె లోనా
మురళి పిలుపై..నే ఊగిపోనా

నీ కమ్మని పెదవి పిల్లనగ్రోవి కావాలంటనా
అది ఊదుతుంటే ఒళ్ళే మరచి ఊగుతుంటాను

ఆహ..నీ రూపు మారింది గోపాలుడా
లేని నాజూకు పెరిగింది నా రాముడా
వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే
బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే

చరణం::2

ఎదురుగ నీవుండిపోతే..జీవనదిలా ఉప్పొంగిపోనా
నదిలా ఉప్పొంగిపోతే..నిన్ను ఎదలో నేదాచుకోనా..ఆ
ఎదురుగ నీవుండిపోతే..జీవనదిలా ఉప్పొంగిపోనా
ఆ..ఆ..నదిలా ఉప్పొంగిపోతే నిన్ను ఎదలో నేదాచుకోనా..ఆ

హద్దులు దాటి..మబ్బులు మీటి..ఆడుకుందామా
ముద్దులతోనే..మిద్దెలు కట్టి ముచ్చటగుందామా

ఆహ..నీ రూపు మారింది గోపాలుడా
లేని నాజూకు పెరిగింది నా రాముడా
పూలఉయ్యాల ఊపాలా..ఆ
ఓ బాలుడా..బాలుడా..గోపాలుడా
హా..ఆ బాలుడా..గోపాలుడా 

హ్హా..హ్హా..హ్హా
ఈ రాధ కన్నేస్తే గోపాలుడే
మరి ఈ సీత కరుణిస్తే శ్రీరాముడే
వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే
బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే

కదలడు-వదలడు--1969



సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి 
శ్రీ లక్ష్మి నారాయణ కంబైన్స్ వారి
దర్శకత్వం::B విఠలాచార్య
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,జయలలిత,రామకృష్ణ,విజయలలిత

పల్లవి::

కట్టు కట్టు గళ్ళచీర..పెట్కో పెట్కో పెళ్ళిబొట్టు 
చుక్కలాంటి..చిన్నదాన..జున్ను ముక్కలాగ ఉన్నదాన
చుక్కలాంటి..చిన్నదాన..జున్ను ముక్కలాగ ఉన్నదాన

చుట్కో చుట్కో..పట్టుపాగ..పట్కో పట్కో..పూలదండ  
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

చరణం::1

నీ కులుకులు చూస్తుంటే..ఆకలి కానే కాదు
నీ కన్నుల నీడ ఉంటే..లోకంతో పని లేదు
నీ కులుకులు చూస్తుంటే..ఆకలి కానే కాదు
నీ కన్నుల నీడ ఉంటే..లోకంతో పని లేదు

చేతులు చేతులు కలిపి..పోదామా పోదామా
చెక్కిలి చెక్కిలి కలిపి..ఉందామా ఉందామా
నా చిలిపి తుమ్మెద రాజా

చుట్టుకో చుట్టుకో..పట్టుపాగ..పట్టుకో పట్టుకో..పూలదండ
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

చరణం::2

ముత్యాల పందింట్లో..మూడుముళ్ళు వేస్తావా
మురిపాల మబ్బుల్లో..ముద్దుగ చెల్లిస్తావా
ముత్యాల పందింట్లో..మూడుముళ్ళు వేస్తావా
మురిపాల మబ్బుల్లో..ముద్దుగ చెల్లిస్తావా

చుక్కల పల్లకి తెస్తా..భలేగా భలేగా
చక్కిలి గింతలు చేస్తా..ఇలాగా ఇలాగా
ఓ చక్కర నవ్వుల రాణీ

కట్టు కట్టు గళ్ళచీర..పెట్కో పెట్కో పెళ్ళిబొట్టు 
చుక్కలాంటి..చిన్నదాన..జున్ను ముక్కలాగ ఉన్నదాన
చుక్కలాంటి..చిన్నదాన..జున్ను ముక్కలాగ ఉన్నదాన

చుట్కో చుట్కో..పట్టుపాగ..పట్కో పట్కో..పూలదండ  
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు..చిన్నవాడ..నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

ఏడంతస్తుల మేడ--1980



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామమూర్తి 
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,సుజాత,జగ్గయ్య,జయసుధ,జయప్రద,ప్రభాకర్‌రెడ్డి 

పల్లవి::

ఏడంతస్తుల..మేడ ఇది
వడ్డించిన..విస్తరిది
ఏడంతస్తుల..మేడ ఇది
వడ్డించిన..విస్తరిది
ఏమీ లేక..ఉన్నదొక్కటే
నాకు మీరు..మీకు నేను
నాకు మీరు..మీకు నేనూ 

చరణం::1

పడుచుతనపు ఉడుకును కలిపి
గంజి నీళ్ళు..తాగిస్తుంటే
కుర్ర వలపు..వర్రతనంతో
మిరపకాయ..తినిపిస్తుంటే
పడుచుతనపు ఉడుకును కలిపి
గంజి నీళ్ళు..తాగిస్తుంటే
కుర్ర వలపు..వర్రతనంతో
మిరపకాయ..తినిపిస్తుంటే

చాప కన్న..చదరే మేలని
చతికిలపడి..అతుకుతు ఉంటే
ఒదిగి ఒదిగి ఇద్దరమొకటై నిదరనే 
ఏయ్..నిదరనే నిదరపొమ్మంటుంటే..ఏ ఏ ఏ 
వెన్నెల మల్లెల..మంచమిది
ఎన్నో జన్మల..లంచమిది
మూడు పొద్దులు ముద్దు ముచ్చటే 
నాకు మీరు..మీకు నేను
నాకు మీరు..మీకు నేనూ 

ఏడంతస్తుల..మేడ ఇది
వడ్డించిన..విస్తరిది

చరణం::2

పాయసాన..గరిటై తిరిగే
పాడు బ్రతులులెందుకు మనకు
పాలలోన..నీరై కరిగే
బంధమొకటి చాలును కడకు
పాయసాన..గరిటై తిరిగే
పాడు బ్రతులులెందుకు మనకు
పాలలోన..నీరై కరిగే
బంధమొకటి చాలును కడకు

చావు కన్నా..బ్రతుకే మేలని
తెలిసి కలిసి..మసులుతు ఉంటే
ప్రేమకన్న పెన్నిధి..లేదని తెలుసుకో..
ఏయ్..తెలుసుకో మనసు నీదంటుంటే..ఏ ఏ ఏ 

ఎండ వానల..ఇల్లు ఇది
ఎండని..పూపొదరిల్లు ఇది
రేయి పగలు..ఆలు మగలే 
నాకు మీరు..మీకు నేను
నాకు మీరు..మీకు నేనూ 

ఏడంతస్తుల..మేడ ఇది
వడ్డించిన..విస్తరిది
ఏమీ లేక..ఉన్నదొక్కటే
నాకు మీరు..మీకు నేను
నాకు మీరు..మీకు నేనూ

భక్త ప్రహ్లాద--1967::కరహరప్రియ::రాగం



సంగీతం::సాలూరి రాజేశ్వర్ రావు
రచన::సముద్రాల రాఘవాచార్య(సీనియర్ )
గానం::P.సుశీల
తారాగణం::S.V. రంగారావు,మంగళంపల్లి బాలమురళీ కృష్ణ,రేలంగి,పద్మనాభం,
హరనాధ్, అంజలీదేవి,జయంతి,బేబి రోజా రమణి
కరహరప్రియ::రాగం 

పల్లవి::

జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా 
నా భారము నీవే కదా 

జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు 
సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ 

నిన్నేగానీ పరులనెఱుంగా..రావే వరదా
బ్రోవగ రావే..వరదా..వరదా
అని మొరలిడగా..కరి విభు గాచిన
అని మొరలిడగా..కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా

హే ప్రభో...హే ప్రభో
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
కరుణాభరణా..కమలలోచనా
కరుణాభరణా..కమలలోచనా
కన్నుల విందువు చేయగా రావే
కన్నుల విందువు చేయగా రావే
ఆశృత భవ బంధ నిర్మూలనా
ఆశృత భవ బంధ నిర్మూలనా
లక్ష్మీ వల్లభా..లక్ష్మీ వల్లభా

సూత్రధారులు--1989



సంగీతం::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.శైలజ  
తారాగణం::A.N.R. , భానుచందర్ , రమ్యకృష్ణ 

పల్లవి::

జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే

ఆఆ రేపల్లే గోపన్నా రేపు మరిచి నిదరోయే రేపు మరిచి నిదరోయే
యాదగిరి నరసన్నా ఆదమరచి నిదరోయే ఆదమరచి నిదరోయే
ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే
కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా

నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా
మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా
అరెరెరెరె యాహి యాహి యాహి యాహి యాహి యాహి
క్రిష్ణావతారమెత్తి కొకలెత్తుకు పోబోకురా
అరెరెయ్రెయ్ యాహి యాహి యాహి యాహి యాహి యాహి
వామనావతరమెత్తి వామనావతరమెత్తి సామిలాగా ఐపోకు
బుద్ధావతారమెత్తి బోధి చెట్టుని అంటి ఉండకు
రఘు వంశ తిలకుడివై రాముడివై రమణుడివై రాముడివై రమణుడివై
సీత తోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీత తోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే

జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా
నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా
లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే

 Sutradharulu--1989
Music::K.V.Mahadevan
Lyricist::D.C.Narayana Reddy
Singer::S.P.Sailaja
Cast::A.N.R. ,Bhanuchandar,Ramyakrishna

:::

Jola jo lamma jola jejela jola jejela jola
Neelala kannulaku nityamalle poola jola
nityamalle poola jola
jola jo lamma jola jejela jola jejela jola
Nilala kannulaku nityamalle pUla jola
nityamalle poola jola
Olalololololo hayi haaye Olololololo haayi haye

Haa repalle gopanna repu marichi nidaroye repu marichi nidaroye
yadagiri narasanna adamarachi nidaroye adamarachi nidaroye
edukondala enkanna eppudanaga nidaroye Yeppudanaga nidaroye
kode pillada nikemo kunukaina radaye kunukaina ...Chi.
Olalololololo hayi haaye Olololololo haayi haye
Olalololololo hayi haaye Olololololo haayi haye

jola jo lamma jola jejela jola jejela jola
Neelala kannulaku nityamalle poola jola
nityamalle poola jola

Meenavataarametti meni chuttu rabokura
arererere yahi yahi yahi yahi yahi yahi
yahi yahi yahi yahi yaahi
krishnavatarametti kokalettuku pobokura
ayyayayyo yahi yahi yahi yahi yahi yahi
ha ha ha ha haaa haaa
vamanavatarametti vamanavatarametti samilaga ayyipoku
buddhavatarametti bodhi chettuni anti Vundaku
raghu vamsha tilakudivai ramudivai ramanudivai
ramudivai ramanudivai..
sita tone undipora gita nuvve diddipora
Ee sita tone undipora na gita nuvve diddipora

Olalololololo hayi haaye Olololololo haayi haye
Olalololololo hayi haaye Olololololo haayi haye

jola jo lamma jola jejela jola jejela jola
Neelala kannulaku nityamalle poola jola
nityamalle poola jola
Olalololololo hayi haaye Olololololo haayi haye
Olalololololo hayi haaye Olololololo haayi haye

haayi haayi..

Friday, July 18, 2014

ఇలవేలుపు--1956



సంగీతం::సుసర్ల దక్షిణామూర్తి 
రచన::వడ్డాది
గానం::జిక్కి 
తారాగణం::అక్కినేని, చలం,జమున,గుమ్మడి,అంజలీదేవి,రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం

పల్లవి::

అన్నా అన్నా..విన్నావా
చిన్ని కృష్ణుడు వచ్చాడు
అన్నా అన్నా..విన్నావా
చిన్ని కృష్ణుడు వచ్చాడు
చిన్ని కృష్ణుడు వచ్చాడు
వెన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా..విన్నావా

చరణం::1

కాళిమడుగున దూకిన వాడు
ఆపద తొలగి వచ్చాడు
కాళిమడుగున దూకిన వాడు
ఆపద తొలగి వచ్చాడు
చల్లని చూపుల చూస్తాడు
కన్నుల పండుగ చేస్తాడు
చల్లని చూపుల చూస్తాడు
కన్నుల పండుగ చేస్తాడు

అన్నా అన్నా..విన్నావా
చిన్ని కృష్ణుడు వచ్చాడు
చిన్ని కృష్ణుడు వచ్చాడు
వెన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా..విన్నావా

చరణం::2

గోకులమందున గోవిందునితో
గోపికనై విహరిస్తాను
గోకులమందున గోవిందునితో
గోపికనై విహరిస్తాను
ముద్దుల మూర్తిని కంటాను
మోహన మురళి వింటాను
ముద్దుల మూర్తిని కంటాను
మోహన మురళి వింటాను

అన్నా అన్నా..విన్నావా
చిన్ని కృష్ణుడు వచ్చాడు
చిన్ని కృష్ణుడు వచ్చాడు
వెన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా..విన్నావా

చరణం::3

బృందావనిలో నందకిషోరుని
చెంతను నాట్యము చేస్తాను
బృందావనిలో నందకిషోరుని
చెంతను నాట్యము చేస్తాను
యమునా తీర విహారంలో
హాయిగ పరవశమౌతాను
యమునా తీర విహారంలో
హాయిగ పరవశమౌతాను

అన్నా అన్నా..విన్నావా
చిన్ని కృష్ణుడు వచ్చాడు
చిన్ని కృష్ణుడు వచ్చాడు
వెన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా..విన్నావా

Ilavelupu--1956  
Music::Susarla Dakshanamoori
Lyrics::Vaddadi
Singer::Jikki
Cast::Akkineni,Chalam,Jamuna,Gummadi,Anjalidevi,Relangi,Ramanareddy,Sooryakaantam.

::::

annaa annaa..vinnaavaa
chinni kRshNuDu vachchaaDu
annaa annaa..vinnaavaa
chinni kRshNuDu vachchaaDu
chinni kRshNuDu vachchaaDu
vennela chelikaaDochchaaDu
annaa annaa..vinnaavaa

::::1

kaaLimaDuguna dUkina vaaDu
Apada tolagi vachchaaDu
kaaLimaDuguna dUkina vaaDu
Apada tolagi vachchaaDu
challani chUpula chUstaaDu
kannula panDuga chEstaaDu
challani chUpula chUstaaDu
kannula panDuga chEstaaDu

annaa annaa..vinnaavaa
chinni kRshNuDu vachchaaDu
chinni kRshNuDu vachchaaDu
vennela chelikaaDochchaaDu
annaa annaa..vinnaavaa

::::2

gOkulamanduna gOvindunitO
gOpikanai viharistaanu
gOkulamanduna gOvindunitO
gOpikanai viharistaanu
muddula moortini kanTaanu
mOhana muraLi vinTaanu
muddula moortini kanTaanu
mOhana muraLi vinTaanu

annaa annaa..vinnaavaa
chinni kRshNuDu vachchaaDu
chinni kRshNuDu vachchaaDu
vennela chelikaaDochchaaDu
annaa annaa..vinnaavaa

::::3

bRndaavanilO nandakishOruni
chentanu naaTyamu chEstaanu
bRndaavanilO nandakishOruni
chentanu naaTyamu chEstaanu
yamunaa teera vihaaramlO
haayiga paravaSamoutaanu
yamunaa teera vihaaramlO
haayiga paravaSamoutaanu

annaa annaa..vinnaavaa
chinni kRshNuDu vachchaaDu
chinni kRshNuDu vachchaaDu
vennela chelikaaDochchaaDu

annaa annaa..vinnaavaa

Thursday, July 17, 2014

కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి--1981



సంగీతం::కృష్ణ చక్ర 
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చంద్రమోహన్,రాధిక 

పల్లవి::

సాగే నది కోసం సాగర సంగీతం
కలిసే నది కోసం కడలే నీ గీతం
సిరివెన్నెలమ్మ కోనలోన వెన్నెల
చిరునవ్వులమ్మ కూతురైన కన్నెలా

చరణం::1

ఏదలో ఆరటాలే..పడిలేచే కెరటాలై
కలిశే బులపాటలే..తొలి మోమాటలై
సాగరాల ఘోషలే విని సాగే వాగు వంక
చిలుక గోరువంక గూడుకట్టే గుండెలోన
జల్లుమనే మది పల్లవిగా మనమల్లుకోనే ఈ వేళ
కొత్త కద్దరంచు చీర నేను కట్టగా
తొలి అద్దకాల ముద్దు నేను పెట్టగా

చరణం::2

వచ్చే వలపు వసంతం..నులి వెచ్చని తేనెలతో
మెరిసే శ్రావణ మేఘం..తనివి తీరని దాహంతో
కన్నెవలపు కోడిపులుపు కలిసే కౌగిలింత
అలకే తీరి పులకే పూత కొచ్చే వేళలోన
ఆ గతమే నా స్వాగతమై..ఈ జీవితమే నీదైతే
తొలి తూరుపింటి లేత ఎండ బొట్టుగా
చుక్క దీపమెట్టు వేళ ముద్దు పెట్టగా


Kayyala Ammayi Kalavaari Abbayi--1981
Music::Krishna chakra
Lyrics::Veturi SundaraRamamoorti
Singer's::S.P.Baalu,P.SuSeela
Cast::Chandramohan,Radhika

:::

saagE nadi kOsam saagara sangeetam
kalisE nadi kOsam kaDalE nee geetam
sirivennelamma kOnalOna vennela
chirunavvulamma kooturaina kannelA

:::1

EdalO aaraTaalE..paDilEchE keraTaalai
kaliSE bulapaaTalE..toli mOmaaTalai
saagaraala ghOshalE vini saagE vaagu vanka
chiluka gOruvanka gooDukaTTE gunDelOna
jallumanE madi pallavigA manamallukOnE ee vELa
kotta kaddaranchu cheera nEnu kaTTagA
toli addakaala muddu nEnu peTTagA

:::2

vachchE valapu vasantam..nuli vechchani tEnelatO
merisE SraavaNa mEgham..tanivi teerani daahamtO
kannevalapu kODipulupu kalisE kougilinta
alakE teeri pulakE poota kochchE vELalOna
aa gatamE naa swaagatamai..ee jeevitamE needaitE
toli toorupinTi lEta enDa boTTugA
chukka deepameTTu vELa muddu peTTagA