సంగీతం::ఇళయరాజా
రచన::వెన్నెలకంటి
గానం::S.P.బాలు,S.P.శైలజ
పల్లవి::
ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది
ఏదో తెలియని బంధమిది
చరణం::1
పూజకు నోచని పూవును కోరి
వలచిన స్వామివి నువ్వేలే
రూపం లేని అనురాగానికి
ఊపిరి నీ చిరునవ్వేలే
కోవెల లేని..ఈ..ఈఈఈ
కోవెల లేని దేవుడవు
గుండెల గుడిలో వెలిశావు
పలికే జీవన సంగీతానికి
వలపుల స్వరమై ఒదిగావు
తనువూ మనసు ఇక నీవే
ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది
ఏదో తెలియని బంధమిది
చరణం::2
వేసవి దారుల వేళలలోన వెన్నెల తోడై కలిసావు
పూచే మల్లెల తీగకు నేడు పందిరి నీవై నిలిచావు
ఆశలు రాలే..ఏఏఏఏఏ
ఆశలు రాలే శిశిరంలో ఆమనీ నీవై వెలిశావు
ఆలుమగల అద్వైతానికి అర్ధం నీవై నిలిచావు
తనువు మనసు ఇక నీవే
ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది
ఏదో తెలియని బంధమిది
హ్హాహ్హా....హా
No comments:
Post a Comment