Monday, July 21, 2014

ఆలయశిఖరం--1983


సంగీతం::సత్యం
రచన::ఉపద్రష్ట సాయి
గానం::S.P.బాలు 
తారాగణం::చిరంజీవి,సుమలత,గొల్లపూడిమారుతిరావు,సత్యనారాయణ. 


పల్లవి::

హే..హేహే
ఇది ఆశలు రేపే లోకం..అడియాశలు చేసే లోకం
హే..స్వార్థం మరిగిన మనుషుల్లారా
సాగదు సాగదు మీ మోసం..ఊ
సాగదు..సాగదు..మీ మోసం

ఇది ఆశలు రేపే లోకం..అడియాశలు చేసే లోకం
హే..స్వార్థం మరిగిన మనుషుల్లారా
సాగదు సాగదు మీ మోసం..ఊ
సాగదు..సాగదు..మీ మోసం

చరణం::1

కోటలు కట్టిన రాజులెక్కడో..ఓ
బాటలు వేసిన కూలీలెవరో
కోటలు కట్టిన రాజులెక్కడో..బాటలు వేసిన కూలీలెవరో
కాలం నడిచే కాలినడకలో..సమాధిరాళ్ళై నిలిచారు..ఊ ఊ
చరిత్రగానే మిగిలేరు

ఇది ఆశలు రేపే లోకం..అడియాశలు చేసే లోకం
హే..స్వార్థం మరిగిన మనుషుల్లారా
సాగదు సాగదు మీ మోసం..ఊ
సాగదు..సాగదు..మీ మోసం

చరణం::2

మనుషుల మమతలు మట్టిగోడలు
కలిసిన మనుసులు మర్రి ఊడలు
మనుషుల మమతలు మట్టిగోడలు
కలిసిన మనుసులు మర్రి ఊడలు
కన్నవారి కల పండించాలీ..ఈ
కన్నవారి కల పండించాలి
రేపటి వెలుగయి నిలవాలి

ఇది ఆశలు రేపే లోకం
అడియాశలు చేసే లోకం
హే..స్వార్థం మరిగిన మనుషుల్లారా 
సాగదు సాగదు మీ మోసం..ఊ
సాగదు..సాగదు..మీ మోసం
హై..హేహే..హై

No comments: