Monday, January 18, 2010

మేనకోడలు--1972




















సంగీతం::ఘంటసాల
రచన::దాశరథి
గానం::ఘంటసాల
డైరెక్టర్::B.S.నారాయణ 
తారాగణం::కృష్ణ,జమున,గుమ్మడి, సూర్యకాంతం, నాగభూషణం, కల్పన


తిరుమల మందిర సుందరా 
సుమధుర కరుణాసాగరా
ఏ పేరున నిను పిలిచేనురా   
ఏ రూపముగా కొలిచేనురా
తిరుమల మందిర సుందరా 
సుమధుర కరుణాసాగరా
ఏ పేరున నిను పిలిచేనురా   
ఏ రూపముగా కొలిచేనురా
తిరుమల మందిర సుందరా 
సుమధుర కరుణాసాగరా

చరణం::1

పాలకడలిలో శేశశయ్యపై..పవళించిన శ్రీపతివో
పాలకడలిలో శేశశయ్యపై..పవళించిన శ్రీపతివో
వెండికొండపై నిండుమనముతో..వెలిగే గౌరీపతివో 
ముగురమ్మలకే మూలపుటమ్మగ..భువిలో వెలసిన ఆదిశక్తివో

తిరుమల మందిర సుందరా 
సుమధుర కరుణాసాగరా

చరణం::2


కాంతులు చిందే నీ ముఖబింబము కాంచిన చాలును గడియైనా
కాంతులు చిందే నీ ముఖబింబము కాంచిన చాలును గడియైనా
నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలును రేయైనా
నీ పదములపై కుసుమము నేనై నిలిచిన చాలును క్షణమైనా 

తిరుమల మందిర సుందరా 
సుమధుర కరుణాసాగరా
ఏ పేరున నిను పిలిచేనురా   
ఏ రూపముగా కొలిచేనురా
తిరుమల మందిర సుందరా 
సుమధుర కరుణాసాగరా

Menakodalu--1972
MUSIC::Ghantasala
Lyricist::DaaSarathi 
Singers::Ghantasala
Director:: B. S. Narayana
CAST::Krishna,Jamuna,Gummadi,Suryakantam,Nagabhushanam,Kalpana.

tirumala mandira sundaraa 
sumadhura karuNaasaagaraa
E pEruna ninu pilichEnuraa 
E roopamugaa ninu kolachEnuraa 

tirumala mandira sundaraa 
sumadhura karuNaasaagaraa
E pEruna ninu pilichEnuraa 
E roopamugaa ninu kolachEnuraa 
tirumala mandira sundaraa 
sumadhura karuNaasaagaraa

:::1

paalakaDalilO SEshaSayyapai pavaLiMchina SreepativO
paalakaDalilO SEshaSayyapai pavaLiMchina SreepativO
vendikondapai nindumanamutO veligE goureepativO
mugurammalakE moolapuTammaga bhuvilO velasina aadiSaktivO

tirumala maMdira suMdaraa 
sumadhura karuNaasaagaraa

:::2

kaantulu chindE nee mukhabimbamu kaanchina chaalunu gaDhiyainaa
kaantulu chindE nee mukhabimbamu kaanchina chaalunu gaDhiyainaa
nee guDi vaakiTa divvenu nEnai veligina chaalunu rEyainaa
nee padamulapai kusumamu nEnai nilichina chaalunu kshaNamainaa

tirumala maMdira suMdaraa 
sumadhura karuNaasaagaraa
E pEruna ninu pilichEnuraa 
E roopamugaa ninu kolachEnuraa 
tirumala maMdira suMdaraa 
sumadhura karuNaasaagaraa

నీతి నిజాయితి--1972



















సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::D. సినారె
గానం::P.సుశీల
తారాగణం::సతీష్ అరోరా,కాంచన, గుమ్మడి, నాగభూషణం, కృష్ణంరాజు 

పల్లవి:

మాటలకందని భావాలు మంచి మనసులు చెపుతాయి
కవితలకందని భావాలు కంటిపాపలే చెబుతాయి
మాటలకందని భావాలు మంచి మనసులు చెపుతాయి

చరణం::1

వెన్నెల మాటాడునా వెదజల్లును చల్లదనాలు
మల్లిక మాట్లాడునా కురిపించును పరిమళాలు
వెన్నెల మాటాడునా వెదజల్లును చల్లదనాలు
మల్లిక మాట్లాడునా కురిపించును పరిమళాలు
భాషరాని పాపాయి బోసినవ్వు చాలదా
భాషరాని పాపాయి బోసినవ్వు చాలదా
ఏనాడు పలకని దైవం ఈలోకములేలదా
ఈలోకములేలదా
మాటలకందని భావాలు మంచి మనసులు చెపుతాయి

చరణం::2

పిల్లగాలి పరుగులలో వెల్లివిరియు గీతికలు
కొండవాగు తరగలలో కోటిరాగమాలికలు
పిల్లగాలి పరుగులలో వెల్లివిరియు గీతికలు
కొండవాగు తరగలలో కోటిరాగమాలికలు
హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం 
హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం
కనగలిగిన మనసుంటే బ్రతుకే అనురాగమయం
బ్రతుకే అనురాగమయం

మాటలకందని భావాలు మంచి మనసులు చెపుతాయి
కవితలకందని భావాలు కంటిపాపలే చెబుతాయి

Sunday, January 17, 2010

బాబు--1975





సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల,రామకృష్ణ బృందం

పల్లవి::

ఆఆఆఆఆఆఆఆఅ..
ఒక జంట కలిసిన..తరుణానా
జేగంట మ్రోగెను..గుడిలోనా
ఆ హృదయాల..శృతిలోనా.. 

చరణం::1

కలిమి లేమి జంటలనీ
అవి కలకాలంగా ఉన్నవనీ

కలిమి లేమి జంటలనీ
అవి కలకాలంగా ఉన్నవనీ

విధించేయమని మన ఇద్దరినీ
కాలం నేటికి కలిపెననీ

ఆఆఆఆఆఆఆఆఆఆ
వెలుగు నీడగ ఉండమనీ
వెలుగు నీడగ ఉండమనీ
వలపు గెలుపుగా గుర్తుండమనీ
గుర్తుండమనీ

ఒక జంట కలిసిన..తరుణానా
జేగంట మ్రోగెను..గుడిలోనా
ఆ హృదయాల..శృతిలోనా..

చరణం::2

పెద్దరికానికి పేదరికానికి
ప్రేమే నిలబడి పెళ్ళిచేసేనూ
ఆఆఆఆఆఆఆఆఆఆఆ
పెద్దరికానికి పేదరికానికి
ప్రేమే నిలబడి పెళ్ళిచేసేనూ

సూర్యచంద్రులు వెలిగే వరకూ
తారలన్నీ మెరిసే వరకూ

సూర్యచంద్రులు వెలిగే వరకూ
తారలన్నీ మెరిసే వరకూ

జాతిమతాలు సమిసే వరకూ
జన్మలన్నీ ముగిసే వరకూ

శతమానం భవతీ శత శతమానం భవతీ
శుభాస్తూ..తధాస్తూ.. 


ఒక జంట కలిసిన..తరుణానా
ఒక గుండె రగిలెను ద్వేషానా
ఆ హృదయాల విడదీయు పంతానా
తరతరాల ఈ వంష గౌరవం తగులపెట్టినావూ 
తరతరాల ఈ వంష గౌరవం తగులపెట్టినావూ
తాళిగట్టి ఈ దరిద్రాన్ని నీ వెంట తెచ్చినావూ
అని గర్ధించింది ఒక కన్నతండ్రి కంఠం..

సిరిసంపదలూ..నిలకడకావూ 
పరువు ప్రతిష్ఠలు వాకిట రావూ
మాట తప్పడం..కాదు గౌరవం
మనసూ మమతే..మనిషంటే
అని మనవి చేసెనొక కన్నబిడ్డ హృదయం

కులమూ కులమూ..జాతి జాతియని
గాండ్రించిందా పెద్దతనం
కులమే కులమని..నీతే జాతని
వాదించిందా..యువతరం
తండ్రి కొడుకుల బంధం నేటితో తెగిపోతుందీ
అనురాగపు అనుబంధం..తలవంచక ఉంటుందీ

పొరా పో..పోతేపో..నాశనమైపో
ఈ వంషం పోనీ పోనీ పోనీ పోనీ
అని మానవతను ముక్కలు చేసేను
ఆ మొండి తండ్రీ..

ఆ జంట ముద్దు మురిపాలా 
ఒక బాబు నవ్వుల జడిలోనా
ఆ ఇల్లే స్వర్గము భువిలోనా

కాలానికప్పుడే కనుకుట్టేనో
కటిక మృత్యువుకూడ బగబట్టెనో
కబళించే ఇద్దరిని విడదీయలేకా


Baabu--1975
Music::Chakravarti
Lyrics::Achaarya - Atreya
Singer's::S.P.Balu , P.Suseela, Ramakrisha,Brundam.

:::::
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
oka janTa kalisina..taruNaanaa
jEganTa mrOgenu..guDilOnaa
A hRdayaala..SRtilOnaa.. 

:::::1

kalimi lEmi janTalanii
avi kalakaalangaa unnavanii

kalimi lEmi janTalanii
avi kalakaalangaa unnavanii

vidhinchEyamani mana iddarinii
kaalam nETiki kalipenanii

aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
velugu neeDaga unDamanii
velugu neeDaga unDamanii
valapu gelupugaa gurtunDamanii
gurtunDamanii

oka janTa kalisina..taruNaanaa
jEganTa mrOgenu..guDilOnaa
A hRdayaala..SRtilOnaa..

::::2

peddarikaaniki pEdarikaaniki
prEmE nilabaDi peLLichEsEnuu
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
peddarikaaniki pEdarikaaniki
prEmE nilabaDi peLLichEsEnuu

sooryachandrulu veligE varakoo
taaralannii merisE varakoo

sooryachandrulu veligE varakoo
taaralannii merisE varakoo

jaatimataalu samisE varakoo
janmalannii mugisE varakoo

Satamaanam bhavatii Sata Satamaanam bhavatii
SubhaastU..tadhaastuu.. 


oka janTa kalisina..taruNaanaa
oka gunDe ragilenu dwEshaanaa
aa hRdayaala viDadeeyu pantaanaa
tarataraala ii vaMsha gouravam tagulapeTTinaavU 
tarataraala ii vaMsha gouravam tagulapeTTinaavU
taaLigaTTi ii daridraanni nee venTa techchinaavuu
ani gardhinchindi oka kannatanDri kanTham..

sirisampadaloo..nilakaDakaavuu 
paruvu pratishThalu vaakiTa raavuu
maaTa tappaDam..kaadu gouravam
manasoo mamatE..manishanTE
ani manavi chEsenoka kannabiDDa hRdayam

kulamoo kulamoo..jaati jaatiyani
gaanDrinchindaa peddatanam
kulamE kulamani..neetE jaatani
vaadinchindaa..yuvataram
tanDri koDukula bandham nETitO tegipOtundii
anuraagapu anubandham..talavanchaka unTundii

poraa pO..pOtEpO..naaSanamaipO
ii vaMSham pOnii pOnii pOnii pOnii
ani maanavatanu mukkalu chEsEnu
aa monDi tanDrii..

aa janTa muddu muripaalaa 
oka baabu navvula jaDilOnaa
aa illE swargamu bhuvilOnaa

kaalaanikappuDE kanukuTTEnO
kaTika mRtyuvukooDa bagabaTTenO
kabaLinchE iddarini viDadeeyalEkaa

Saturday, January 16, 2010

ఇంటికోడలు--1974




సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల, S.P.బాలు
Film Directed By::Lakshmii Deepak
తారాగణం::S.V.రంగారావు,కృష్ణంరాజు,గుమ్మడి,చంద్రమోహన్,మిక్కిలినేని,రావికొందలరావు,సాక్షిరంగారావు,మాడా,K.K.శర్మ,రమణారెడ్డి(అతిధి),ప్రమీల,S.వరలక్ష్మి,P.R.వరలక్ష్మీ,రోజారమణి,శ్రీరంజని,మాలతి,సూర్యకళ,సుశీల,సుధామాల,


పల్లవి::

చలిగాలిలో..మ్మ్..మ్మ్ హు..నులివెచ్చని
బిగికౌగిలి...పెనవేసుకో 
చలిగాలిలో...నులివెచ్చని
బిగికౌగిలి...పెనవేసుకో
ఊరించి నవ్వింది...సొగసు
అహా..ఉప్పొంగి పోయింది మనసు 
ఈ..చలిగాలిలో..ఓఓఓఓఓ..                        

చరణం::1

తొలికారు మేఘాలు...మూశాయి 
చిటపట చిటపట చిటపట చినుకులు కురిశాయి
జల్లులో ఒళ్ళంత తడిసింది గుండెలో ఒక జ్వాల రగిలింది 
జల్లులో ఒళ్ళంత తడిసింది గుండెలో ఒక జ్వాల రగిలింది
తొలి ప్రేమలో పులకింతలై తొలి ప్రేమలో పులకింతలై 
జిలిబిలి తలపులు..తహ తహ లాడాయి 
మేను కరగినది హాయి పెరిగినది అందాలు చిందేసెలే..ఏఏఏ  
చలిగాలిలో..ఓఓఓఓఓ..        

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
తెరచాటు పరువాలు మెరిశాయి..ఆ ఆ 
తెరచాటు పరువాలు...మెరిశాయి
ముసిముసి మిలమిల వలపులు గుసగుస లాడాయి
ఊహలే ఊయ్యాల ఊగేను..మోహమే చలిమంట కాగేను 
ఊహలే ఊయ్యాల ఊగేను..మోహమే చలిమంట కాగేను
అనురాగమే అనుబంధమై అనురాగమే అనుబంధమై 

తనువుల మనసుల ఒక్కటి...చేసింది..ఈ

Friday, January 15, 2010

మాయాబజార్--1957::తిలంగ్::రాగం




సంగీతం::ఘంటసాల
రచన::పింగళి
గానం::జిక్కి,పి.సుశీల బృందం
Film Directed By::K.V.Reddi
తారాగణం::N.T.R.A.N.R.సావిత్రి,S.V.రంగారావు,రేలంగి,రమణారెడ్డి,గుమ్మడి,ముక్కామల,C.S.R.,చాయాదేవి,ఋష్యేంద్రమణి,సూర్యకాంతం,అల్లురామలింగయ్య,మాధవపెద్ది సత్యం,ధుళిపాళ,మిక్కిలినేని,నాగభూషణం.

తిలంగ్::రాగం 

పల్లవి::


లల్లిలలా..లల్లిలలా ఆ ఆ
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల
అల్లిబిల్లి ఆటలే లల్లిలలా పాటలే
అల్లిబిల్లి ఆటలే లల్లిలలా పాటలే

ఎవరెవరే కోయిలలు కుహూ కుహూ కుహూ కుహూ
ఎవరెవరె నెమలి ఆ ఆ కికి కికి కికి కికి
ఎవరెవరె ఎవరెవరె మల్లి లేడి పిల్లలు 
ఎవరెవరె ఎవరెవరె మల్లి లేడి పిల్లలు
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల
కు...కు...కు

అల్లీబిల్లీ అమ్మాయికి చల చల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము 
అల్లీబిల్లీ అమ్మాయికి చల చల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

చరణం::1

యవ్వన శోభల పర్వమే ఇది బావన తలచుకు గర్వమే 
యవ్వన శోభల పర్వమే ఇది బావన తలచుకు గర్వమే
ఆ బావే తనకిక సర్వమే

అల్లీబిల్లీ అమ్మాయికి చల చల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

చరణం::2

వున్నమాటకి వులికెందుకు మరి వున్నదె చెపుతాము 
వున్నమాటకి వులికెందుకు మరి వున్నదె చెపుతాము
వలదన్నా చెపుతాము

నూతన విద్యల ప్రవీణుడే బలె ప్రతిభావంతుడె మీ బావ 
నూతన విద్యల ప్రవీణుడే బలె ప్రతిభావంతుడె మీ బావ
అతి చతుర వీరుడే మీ బావ

అల్లీబిల్లీ అమ్మాయికి చల చల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

చరణం::3

మల్లీ జాజి మలతి సంపెంగ పూల బాణములు వేసెను 
మల్లీ జాజి మలతి సంపెంగ పూల బాణములు వేసెను 
బాలామనితో మురిసేను మన బాలామనితో మురిసేను
తన పెళ్ళికి బావను పిలిచేను

అల్లీబిల్లీ అమ్మాయికి చల చల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

సంబరాల రాంబాబు--1970::ఖమాస్::రాగం






















సంగీతం::V.కుమార్
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల
ఖమాస్::రాగం 

:::::::

మామా..చందమామా..వినరావా..నా కధ
మామా..చందమామా..వినరావా..నా కధ 
వింటే మనసు ఉంటే కలిపేవూ నా జత
మామా..చందమామా..

చరణం::1

నీ చల్లని కిరణాలలో జగమంతా మురిసెనే
నీ చల్లని కిరణాలలో జగమంతా మురిసెనే
నాలోన లోపమేమో నా మనసే కుమిలెనే
అందరికీ ఆనందం అందించే జాబిలి
నాపైన నీకేలా రాదాయే జాలి 

మామా..చందమామా..వినరావా..నా కధ 
వింటే మనసు ఉంటే కలిపేవూ నా జత
మామా..చందమామా..

చరణం::2

మచ్చ నీకు ఉన్నా లెక్క చెయ్యరే
ముచ్చటైన నీ వెన్నెలనే మెచ్చుకుందురందరూ
మచ్చలేని నన్ను వెక్కిరింతురే
పిచ్చిదానినంటూ నాపై లేని మచ్చ వేసేరు
నిజము తెలిపినా వినరు మనసు తెలుసుకోలేరు 
నిజము తెలిపినా వినరు మనసు తెలుసుకోలేరు
నీవుకాక నా వెతలన్నీ వినేవారు ఎవ్వరు
వినేవారు ఎవ్వరు..

మామా..చందమామా..వినరావా..నా కధ 
వింటే మనసు ఉంటే కలిపేవూ నా జత
మామా..చందమామా..

Thursday, January 14, 2010

పసిడి మనసులు--1970




















సంగీతం::ఆశ్వర్థామ
రచన::ఉషశ్రీ 
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,శారద, విజయలలిత, చంద్రమోహన్,రాంమోహన్,రాజబాబు 

పల్లవి::

నిన్నే వలచితినోయి...
నిన్నే వలచితినోయి..కన్నుల్లో దాచితినోయి
వెన్నెల్లో వేచితినోయీ..నీకై అభిసారికనై 
ఓ..ప్రియా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..నిన్నే వలచితినోయి

చరణం::1

మదిలో కోయిల పాడ..మమతల ఊయలలూగ
ఈ రేయి నీకోసం..వేచితి అభిసారికనై
ఓ..ప్రియా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..నిన్నే వలచితినోయి

నిన్నే వలచితినోయి..కన్నుల్లో దాచితినోయి
నిన్నే వలచితినోయి

చరణం::2

వెన్నెల కురిసే వేళ..మల్లెలు పూచే వేళ
విరిసే నిండు వెన్నెల్లో..వేచితి అభిసారికనై
ఓ..ప్రియా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..నిన్నే వలచితినోయి

నిన్నే వలచితినోయి..కన్నుల్లో దాచితినోయి
వెన్నెల్లో వేచితినోయీ..నీకై అభిసారికనై 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

Saturday, January 09, 2010

రంగూన్ రౌడి--1979




















సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

చరణం::1

చినుకు మీద చినుకు పడ్దదీ
చిన్నదాని సొగసు మీద మనసు పడ్డది
వణుకుతున్న వయసు చెడ్దదీ
చిన్నవాడి వలపు నన్ను కలుపుతున్నది

ఈ పులకరింత చూడబోతే చిటికెంత
ఆ జలదరింత చూడబోతె జన్మంతా
నాకు నువ్వెంతో..నీకు నేనంతా
నీకు వయసెంతో..నాకు మనసంతా

వరస కలసి జంట లాయనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే
అహ వరస కలసి జంట లాయనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే

వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
ఆఁవయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

చరణం::2

చినుకు ముల్లు గుచ్చుకున్నదీ
చిన్నదాని వలపు ఒళ్ళు విరుచుకున్నది
వానజల్లు వెచ్చకున్నదీ
చిన్నవాడి వయసు తేనె వెల్లువైనది

కురిసి వెలసిన వాన వరదంటా
మనసు కలసిన జంట వలపంటా
నీకు మెరుపెంతో..నాకు ఉరుమంతా
వయసు వయసంతా..వలపు గిలిసెంతా

వరస కలసి జంటలాయెనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే
వరస కలసి జంటలాయెనే
ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే

వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే
మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే
అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి
వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే
అర్రెరెర్రె వయసు తడిసి మోపెడాయనే
ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

భలే మొనగాడు--1968




భలే మొనగాడు--1968
సంగీతం::కోదండపాణి
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
తారాగణం::కాంతారావు, కృష్ణకుమారి, చలం, గీతాంజలి, త్యాగరాజు, విజయలలిత 

పల్లవి::

ఇంద ఇంద తీసుకో 
ఇపుడే సొంతం చేసుకో
ఎంతమందో వచ్చారోయి
అంతమందీ వెళ్ళారోయి

ఇంత చక్కని మగసిరి ఠీవి
ఎవరిలోనూ కనపడదోయి
అబ్బో అబ్బో అబ్బోసి
గండర గండ అబ్బోసి

ఇంద ఇంద తీసుకో 
ఇపుడే సొంతం చేసుకో

చరణం::1

నాలో మురిపాలు పొంగి
నీలో మోహాలు రేగి
ఏదో ఆవేశమందు ఎదలే తెల్పరా

ముచ్చట తీరని మనుగడలో
నచ్చిన వరుడే కరువాయే
మోడువారిన ఆడగుండేలో
మొదటి వలపే నింపవోయి

ఇంద ఇంద తీసుకో 
ఇపుడే సొంతం చేసుకో

చరణం::2

రారా అందాల రాజా
రారా సొంపైన వాడా
రగిలే పరువాలు చూడు
మనసే తెలుసుకో

దాచితి నీకై నా వలపు 
వేచితి వీణై నీ కొరకు
పలకనట్టి కులుకులు మీటి
ప్రణయరాజ్యం ఏలవోయి

ఇంద ఇంద తీసుకో
ఇపుడే సొంతం చేసుకో 


Bhale Monagaadu--1968
Music::KodandaPaani
Lyrics::Arudra
Singer's::P.Suseela
Cast::Kantarao,Krishnakumari,Chalam,Geetanjali,Tyagaraju,Vijayalalita.

::::

inda inda teesukO 
ipuDE sontam chEsukO
entamandO vachchaarOyi
antamandii veLLaarOyi

inta chakkani magasiri Thiivi
evarilOnU kanapaDadOyi
abbO abbO abbOsi
ganDara ganDa abbOsi

inda inda teesukO 
ipuDE sontam chEsukO

:::::1

naalO muripaalu pongi
neelO mOhaalu rEgi
EdO AvESamandu edalE telparaa

muchchaTa teerani manugaDalO
nachchina varuDE karuvaayE
mODuvaarina ADagunDElO
modaTi valapE nimpavOyi

inda inda teesukO 
ipuDE sontam chEsukO

::::2

raaraa andaala raajaa
raaraa sompaina vaaDaa
ragilE paruvaalu chUDu
manasE telusukO

daachiti neekai naa valapu 
vEchiti veeNai nee koraku
palakanaTTi kulukulu meeTi
praNayaraajyam ElavOyi

inda inda teesukO
ipuDE sontam chEsukO 

భలే మొనగాడు--1968
















సంగీతం::కోదండపాణి
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

ఏ ఊరు నీ పయనం..చక్కని మగరాయా
ఏ భామా నోచినదో..మక్కువలోని తీయదనం
నీ మక్కువలోని తీయదనం

మీ ఊరే నా పయనం..చక్కని జవరాలా
నీ మనసే దోచినది..మక్కువలోని తీయదనం
నీ మక్కువలోని తీయదనం

చరణం::1

వెళ్ళేవు కాని వేరెవరి కంటా..పడనియ్యకయ్యా నీ అందం
వెళ్ళేవు కాని వేరెవరి కంటా..పడనియ్యకయ్యా నీ అందం
ఏ ఇంతులైనా నీ ఇంపు చూసి..దోచుకొనేరు నీ హృదయం

నిను చూసి నాకను
నిను చుసి నా కనులు..రతి అందమైనా కోరవు

ఏ ఊరు నీ పయనం..చక్కని మగరాయా
ఏ భామా నోచినదో..మక్కువలోని తీయదనం
నీ మక్కువలోని తీయదనం

చరణం::2

తెమ్మన్నవన్నీ తెస్తానుకాని..కమ్మని వలపులు ఇవ్వాలి
నేతిరిగి వచ్చే తరుణమ్ముదాకా..నాలో నెలకొని నవ్వాలి

కలలోనా కనిపించి..
కలలోనా కనిపించి..వలపులదాహం తీర్చేదా

మీ ఊరే నా పయనం..చక్కని జవరాలా
నీ మనసే దోచినది..మక్కువలోని తీయదనం
నీ మక్కువలోని తీయదనం

చరణం::3

అందాల పెళ్ళి పందిళ్ళు వేస్తా..రయమున తిరిగి రావాలి
సందిట్లో నిన్ను బంధించగానే..కౌగిలి వీడక కరగాలి

ఆనందం..అనురాగం
ఆనందం..అనురాగం..మనలో మదిలో పండాలి

ఏ ఊరు నీ పయనం..చక్కని మగరాయా
ఏ భామా నోచినదో..మక్కువలోని తీయదనం
నీ మక్కువలోని తీయదనం 

Bhale Monagaadu--1968
Music::KodandaPaani
Lyrics::Arudra
Singer's::Ghantasala,P.Suseela

:::

E Uru nee payanam..chakkani magaraayaa
E bhaamaa nOchinadO..makkuvalOni teeyadanam
nee makkuvalOni teeyadanam

mee UrE naa payanam..chakkani javaraalaa
nee manasE dOchinadi..makkuvalOni teeyadanam
nee makkuvalOni teeyadanam

:::1

veLLEvu kaani vErevari kanTaa..paDaniyyakayyaa nee andam
veLLEvu kaani vErevari kanTaa..paDaniyyakayyaa nee andam
E intulainaa nee impu chUsi..dOchukonEru nee hRdayam

ninu chUsi naakanu
ninu chusi naa kanulu..rati andamainaa kOravu

E Uru nee payanam..chakkani magaraayaa
E bhaamaa nOchinadO..makkuvalOni teeyadanam
nee makkuvalOni teeyadanam

:::2

temmannavannii testaanukaani..kammani valapulu ivvaali
nEtirigi vachchE taruNammudaakaa..naalO nelakoni navvaali

kalalOnaa kanipinchi..
kalalOnaa kanipinchi..valapuladaaham teerchEdaa

mee UrE naa payanam..chakkani javaraalaa
nee manasE dOchinadi..makkuvalOni teeyadanam
nee makkuvalOni teeyadanam

:::3

andaala peLLi pandiLLu vEstaa..rayamuna tirigi raavaali
sandiTlO ninnu bandhinchagaanE..kougili veeDaka karagaali

aanandam..anuraagam
aanandam..anuraagam..manalO madilO panDaali

E Uru nee payanam..chakkani magaraayaa
E bhaamaa nOchinadO..makkuvalOni teeyadanam
nee makkuvalOni teeyadanam