సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::D. సినారె
గానం::P.సుశీల
తారాగణం::సతీష్ అరోరా,కాంచన, గుమ్మడి, నాగభూషణం, కృష్ణంరాజు
పల్లవి:
మాటలకందని భావాలు మంచి మనసులు చెపుతాయి
కవితలకందని భావాలు కంటిపాపలే చెబుతాయి
మాటలకందని భావాలు మంచి మనసులు చెపుతాయి
చరణం::1
వెన్నెల మాటాడునా వెదజల్లును చల్లదనాలు
మల్లిక మాట్లాడునా కురిపించును పరిమళాలు
వెన్నెల మాటాడునా వెదజల్లును చల్లదనాలు
మల్లిక మాట్లాడునా కురిపించును పరిమళాలు
భాషరాని పాపాయి బోసినవ్వు చాలదా
భాషరాని పాపాయి బోసినవ్వు చాలదా
ఏనాడు పలకని దైవం ఈలోకములేలదా
ఈలోకములేలదా
మాటలకందని భావాలు మంచి మనసులు చెపుతాయి
చరణం::2
పిల్లగాలి పరుగులలో వెల్లివిరియు గీతికలు
కొండవాగు తరగలలో కోటిరాగమాలికలు
పిల్లగాలి పరుగులలో వెల్లివిరియు గీతికలు
కొండవాగు తరగలలో కోటిరాగమాలికలు
హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం
హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం
కనగలిగిన మనసుంటే బ్రతుకే అనురాగమయం
బ్రతుకే అనురాగమయం
మాటలకందని భావాలు మంచి మనసులు చెపుతాయి
కవితలకందని భావాలు కంటిపాపలే చెబుతాయి
No comments:
Post a Comment