సంగీతం::V.కుమార్
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల
ఖమాస్::రాగం
:::::::
మామా..చందమామా..వినరావా..నా కధ
మామా..చందమామా..వినరావా..నా కధ
వింటే మనసు ఉంటే కలిపేవూ నా జత
మామా..చందమామా..
చరణం::1
నీ చల్లని కిరణాలలో జగమంతా మురిసెనే
నీ చల్లని కిరణాలలో జగమంతా మురిసెనే
నాలోన లోపమేమో నా మనసే కుమిలెనే
అందరికీ ఆనందం అందించే జాబిలి
నాపైన నీకేలా రాదాయే జాలి
మామా..చందమామా..వినరావా..నా కధ
వింటే మనసు ఉంటే కలిపేవూ నా జత
మామా..చందమామా..
చరణం::2
మచ్చ నీకు ఉన్నా లెక్క చెయ్యరే
ముచ్చటైన నీ వెన్నెలనే మెచ్చుకుందురందరూ
మచ్చలేని నన్ను వెక్కిరింతురే
పిచ్చిదానినంటూ నాపై లేని మచ్చ వేసేరు
నిజము తెలిపినా వినరు మనసు తెలుసుకోలేరు
నిజము తెలిపినా వినరు మనసు తెలుసుకోలేరు
నీవుకాక నా వెతలన్నీ వినేవారు ఎవ్వరు
వినేవారు ఎవ్వరు..
మామా..చందమామా..వినరావా..నా కధ
వింటే మనసు ఉంటే కలిపేవూ నా జత
మామా..చందమామా..
No comments:
Post a Comment