Sunday, January 17, 2010

బాబు--1975





సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల,రామకృష్ణ బృందం

పల్లవి::

ఆఆఆఆఆఆఆఆఅ..
ఒక జంట కలిసిన..తరుణానా
జేగంట మ్రోగెను..గుడిలోనా
ఆ హృదయాల..శృతిలోనా.. 

చరణం::1

కలిమి లేమి జంటలనీ
అవి కలకాలంగా ఉన్నవనీ

కలిమి లేమి జంటలనీ
అవి కలకాలంగా ఉన్నవనీ

విధించేయమని మన ఇద్దరినీ
కాలం నేటికి కలిపెననీ

ఆఆఆఆఆఆఆఆఆఆ
వెలుగు నీడగ ఉండమనీ
వెలుగు నీడగ ఉండమనీ
వలపు గెలుపుగా గుర్తుండమనీ
గుర్తుండమనీ

ఒక జంట కలిసిన..తరుణానా
జేగంట మ్రోగెను..గుడిలోనా
ఆ హృదయాల..శృతిలోనా..

చరణం::2

పెద్దరికానికి పేదరికానికి
ప్రేమే నిలబడి పెళ్ళిచేసేనూ
ఆఆఆఆఆఆఆఆఆఆఆ
పెద్దరికానికి పేదరికానికి
ప్రేమే నిలబడి పెళ్ళిచేసేనూ

సూర్యచంద్రులు వెలిగే వరకూ
తారలన్నీ మెరిసే వరకూ

సూర్యచంద్రులు వెలిగే వరకూ
తారలన్నీ మెరిసే వరకూ

జాతిమతాలు సమిసే వరకూ
జన్మలన్నీ ముగిసే వరకూ

శతమానం భవతీ శత శతమానం భవతీ
శుభాస్తూ..తధాస్తూ.. 


ఒక జంట కలిసిన..తరుణానా
ఒక గుండె రగిలెను ద్వేషానా
ఆ హృదయాల విడదీయు పంతానా
తరతరాల ఈ వంష గౌరవం తగులపెట్టినావూ 
తరతరాల ఈ వంష గౌరవం తగులపెట్టినావూ
తాళిగట్టి ఈ దరిద్రాన్ని నీ వెంట తెచ్చినావూ
అని గర్ధించింది ఒక కన్నతండ్రి కంఠం..

సిరిసంపదలూ..నిలకడకావూ 
పరువు ప్రతిష్ఠలు వాకిట రావూ
మాట తప్పడం..కాదు గౌరవం
మనసూ మమతే..మనిషంటే
అని మనవి చేసెనొక కన్నబిడ్డ హృదయం

కులమూ కులమూ..జాతి జాతియని
గాండ్రించిందా పెద్దతనం
కులమే కులమని..నీతే జాతని
వాదించిందా..యువతరం
తండ్రి కొడుకుల బంధం నేటితో తెగిపోతుందీ
అనురాగపు అనుబంధం..తలవంచక ఉంటుందీ

పొరా పో..పోతేపో..నాశనమైపో
ఈ వంషం పోనీ పోనీ పోనీ పోనీ
అని మానవతను ముక్కలు చేసేను
ఆ మొండి తండ్రీ..

ఆ జంట ముద్దు మురిపాలా 
ఒక బాబు నవ్వుల జడిలోనా
ఆ ఇల్లే స్వర్గము భువిలోనా

కాలానికప్పుడే కనుకుట్టేనో
కటిక మృత్యువుకూడ బగబట్టెనో
కబళించే ఇద్దరిని విడదీయలేకా


Baabu--1975
Music::Chakravarti
Lyrics::Achaarya - Atreya
Singer's::S.P.Balu , P.Suseela, Ramakrisha,Brundam.

:::::
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
oka janTa kalisina..taruNaanaa
jEganTa mrOgenu..guDilOnaa
A hRdayaala..SRtilOnaa.. 

:::::1

kalimi lEmi janTalanii
avi kalakaalangaa unnavanii

kalimi lEmi janTalanii
avi kalakaalangaa unnavanii

vidhinchEyamani mana iddarinii
kaalam nETiki kalipenanii

aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
velugu neeDaga unDamanii
velugu neeDaga unDamanii
valapu gelupugaa gurtunDamanii
gurtunDamanii

oka janTa kalisina..taruNaanaa
jEganTa mrOgenu..guDilOnaa
A hRdayaala..SRtilOnaa..

::::2

peddarikaaniki pEdarikaaniki
prEmE nilabaDi peLLichEsEnuu
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
peddarikaaniki pEdarikaaniki
prEmE nilabaDi peLLichEsEnuu

sooryachandrulu veligE varakoo
taaralannii merisE varakoo

sooryachandrulu veligE varakoo
taaralannii merisE varakoo

jaatimataalu samisE varakoo
janmalannii mugisE varakoo

Satamaanam bhavatii Sata Satamaanam bhavatii
SubhaastU..tadhaastuu.. 


oka janTa kalisina..taruNaanaa
oka gunDe ragilenu dwEshaanaa
aa hRdayaala viDadeeyu pantaanaa
tarataraala ii vaMsha gouravam tagulapeTTinaavU 
tarataraala ii vaMsha gouravam tagulapeTTinaavU
taaLigaTTi ii daridraanni nee venTa techchinaavuu
ani gardhinchindi oka kannatanDri kanTham..

sirisampadaloo..nilakaDakaavuu 
paruvu pratishThalu vaakiTa raavuu
maaTa tappaDam..kaadu gouravam
manasoo mamatE..manishanTE
ani manavi chEsenoka kannabiDDa hRdayam

kulamoo kulamoo..jaati jaatiyani
gaanDrinchindaa peddatanam
kulamE kulamani..neetE jaatani
vaadinchindaa..yuvataram
tanDri koDukula bandham nETitO tegipOtundii
anuraagapu anubandham..talavanchaka unTundii

poraa pO..pOtEpO..naaSanamaipO
ii vaMSham pOnii pOnii pOnii pOnii
ani maanavatanu mukkalu chEsEnu
aa monDi tanDrii..

aa janTa muddu muripaalaa 
oka baabu navvula jaDilOnaa
aa illE swargamu bhuvilOnaa

kaalaanikappuDE kanukuTTEnO
kaTika mRtyuvukooDa bagabaTTenO
kabaLinchE iddarini viDadeeyalEkaa

No comments: