సంగీతం::T.చలపతిరావు రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల,V.రామకృష్ణ తారాగణం::శోభన్‌బాబు,శారద,లక్ష్మి,నాగభూషణం,చంద్రమోహన్,గిరిబాబు,రావుగోపాలరావు పల్లవి:: పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా ఓ లేఖలు అందించే చినవాడా ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా ఓ లేఖలు అందించే చినవాడా ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా చరణం::1 రోజూ ఒక లేఖ రాస్తున్నాను అందించాలని అనుకున్నాను రోజూ ఒక లేఖ రాస్తున్నాను అందించాలని అనుకున్నాను తీరా నిను చూసీ తీయని గుబులేసీ తీరా నిను చూసీ తీయని గుబులేసీ తెచ్చిన లేఖల మాటే మరిచాను ఆ మాటే..ఏఏఏ..మరిచాను పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా చరణం::2 ఇన్నాళ్ళు నేర్పాను పిల్లల పాఠాలు ఇక నేర్చుకోవాలి ప్రేమ గీతాలు ఇన్నాళ్ళు నేర్పాను పిల్లల పాఠాలు ఇక నేర్చుకోవాలి ప్రేమ గీతాలు నీలో పలికే గీతాలన్నీ నీలో పలికే గీతాలన్నీ నను మరపించే నాగస్వరాలు అవే ఈ జన్మకు వరాలు పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా ఓ లేఖలు అందించే చినవాడా ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా చరణం::3 వలచిన మనసే పాఠాలు చెబితే పిలచిన కనులే లేఖలు రాస్తే వలపే పులకించి - కలలే ఫలియి౦చి వలపే పులకించి - కలలే ఫలియి౦చి మన బ్రతుకే ఒక ఉయ్యాల కాదా బంగారు ఉయ్యాల కాదా పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా ఓ లేఖలు అందించే చినవాడా ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా
సంగీతం::T.చలపతిరావు రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల తారాగణం::శోభన్‌బాబు,శారద,లక్ష్మి,నాగభూషణం,చంద్రమోహన్,గిరిబాబు,రావుగోపాలరావు పల్లవి:: ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో ఆ రాగాల...ఉయ్యాల జంపాలలో ఎన్నెన్ని...కనరాని భావాలో ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో చరణం::1 చిరుగాలి ఈల వేసే..ఏ..చిగురాకు తొంగి చూసే చిరుగాలి ఈల వేసే..ఏ..చిగురాకు తొంగి చూసే కిరాణాల జడివానలోన..ఆ..కిరాణాల జడివానలోన వరిచెలు స్నానాలు చేసే..ఏ.. ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో చరణం::2 పరువాల కొమ్మ ఫైనా..ఆ..పాడింది ఒక కోకిలమ్మ ఆ పాట నా...గొంతులోన ఆ పాట నా గొంతులోన..పలికించె నవరాగమాల..ఆ ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో ఈ వేళలో నాలో..ఎన్నెన్ని రాగాలో చరణం::3 మేఘాల పరదాలలోనా..ఆఆ మేఘాల పరదాలలోన..మెరుపల్లె ఒకరోజు తోచె ఆ రాజు చిరునవ్వులోనా..ఆ..నా మేను నాట్యాలు చేసే ఈ వేళలో నాలో..ఓ..ఎన్నెన్ని రాగాలో ఈ వేళలో నాలో..ఓ..ఎన్నెన్ని రాగాలో
సంగీత::చెళ్ళపిళ్ళ సత్యం రచన:: రాజశ్రీ గానం::S.P.బాలు తారాగణం::చలం,సత్యనారాయణ,ధూళిపాళ,త్యాగరాజు,విజయలలిత,పండరీబాయి,బాలకృష్ణ పల్లవి:: నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను యహ్ నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను యహ్ చరణం::1 నమ్మిన వారికి నమ్మకద్రోహము చేసినందుకు శిక్ష ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలు రాసినందుకీ శిక్ష నమ్మిన వారికి నమ్మకద్రోహము చేసినందుకు శిక్ష ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలు రాసినందుకీ శిక్ష నీ డొక్కచించి నే డోలుకట్టి వాయించుటే నా దీక్ష నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను యహ్ చరణం::2 దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము తల పొగరంతా తగ్గేదాకా దులుపుతాను నీ దుమ్ము దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము తల పొగరంతా తగ్గేదాకా దులుపుతాను నీ దుమ్ము నీ కోసమే నే నీ దినం యెత్తేను ఈ అవతారం నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను యహ్
సంగీత::సాలూరు హనుమంతరావు రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల తారాగణం::N.T.రామారావు, వాణిశ్రీ,అనూరాధ,శాంతకుమారి,సత్యనారాయణ పల్లవి:: అ అమ్మ..ఆ ఆవు..అ అమ్మ..ఆ ఆవు అమ్మవంటిదే ఆవు..అది తెలుసుకో నీవు ఇ ఇల్లు..ఈ ఈ...ఈశ్వరుడు..ఆ.. ఇంటిని ఇలనూ కాచేదెవడు ఈశ్వరుడు పరమేశ్వరుడు అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ..ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః అం అః క ఖ గ ఘ జ్ఞ..చ ఛ జ ఝ ఞ..ట ఠ డ ఢ ణ..త థ ద ధ న ప ఫ బ భ మ..య ర ల వ శ ష స హ ళ క్ష అ..మొదలుకొని..క్ష..వరకు..అ..మొదలుకొని క్ష...వరకు మన అక్షరాలు యాభైయారూ అక్షరమాల నేర్చుకొని ఆపై బ్రతుకులు దిద్దుకొని చక్కని పౌరులు కావాలీ..మన జాతికి పేరు తేవాలి అ అమ్మ..ఆ ఆవు..అమ్మవంటిదే ఆవు..అది తెలుసుకో నీవు ఇంటిని ఇలనూ కాచేదెవడు..ఈశ్వరుడు..పరమేశ్వరుడు చరణం::1 అందరిదీ ఒకే కులం..అందరమూ మానవులం కండలు పెంచితె...సరిపోదు కావాలయ్యా.. బుద్ధిబలం..కావాలయ్యా బుద్ధిబలం మనభాషలు వేరే ఐనా..మన మతాలు వేరే ఐనా జీసస్...ఈశ్వర్...అల్లా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఈశ్వర అల్లా తేరేనామ్..సబకో సన్మతి దే భగవాన్ర ఘుపతి రాఘవ రాజారామ్..పతీత పావన సీతారామ్ ఈశ్వర్ అల్లా తేరేనామ్..సబ్ కో సన్మతీ దే భగవాన్ర ఘుపతి రాఘవ రాజారామ్..పతీత పావన సీతారామ్ చరణం::2 మన భాషలు వేరే ఐనా..మన మతాలు వేరే ఐనా పాలూ పైరూ...ఒకటే భూమాత అందరికొకటె...భూమాత అందరికొకటె పేదా గొప్పా భేదాలు...పెళ్ళగించుకొని పోవాలి పేదా గొప్పా భేదాలు...పెళ్ళగించుకొని పోవాలి గిరిజనుడే..ఏ..పురజనుడై..గిరిజనుడే పురజనుడై ధరాచక్రమును తిప్పాలి..ఈ ధరాచక్రమును తిప్పాలి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అమ్మ..ఆ ఆవు..అమ్మవంటిదే ఆవు అది తెలుసుకో నీవు ఇంటిని ఇలనూ కాచేదెవడు..ఈశ్వరుడు..పరమేశ్వరుడు ఈశ్వరుడు..ఊ..పరమేశ్వరుడు..ఊ..