సంగీత::K.V.మహదేవన్
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::మాధవపెద్ది సత్యం
తారాగణం::కృష్ణ,మంజుల,నాగభూషణం,పద్మనాభం,అంజలి, జయంతి,ప్రసన్నరాణి
పల్లవి::
శ్రీమద్రమారమణ గోవిందో హరి
శ్రీ అకౄరవరద గోవిందో హరి
హరి హరిలొ రంగ హరి..హరిలొ రంగ హరి
హరి లొరంగ హరి..వ్రేపల్లె వాడలో గోపాలుడే
నంద గోపాలుడె మాపాలి దేవుడై వచ్చాడులే
మామీద దయచూప వచ్చాడులే
వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె
మాపాలి దేవుడై వచ్చాడులే
మామీద దయచూప వచ్చాడులే
చరణం::1
నల్లా నల్లానివాడు నాజూకు వన్నెకాడు
నల్లా నల్లానివాడు నాజూకు వన్నెకాడు
దొంగలాగ నక్కి నక్కి వచ్చాడే
ఓహో దొంగలాగ నక్కి నక్కి వచ్చాడే
కోకలెత్తుకొని పోయి దాచాడే అహా
కోకలెత్తుకొని పోయి దాచాడే
పుట్టినపుడు లేనికోక..గిట్టినపుడు రానికోక
పుట్టినపుడు లేనికోక..గిట్టినపుడు రానికో
ఇప్పుడింక ఎందుకని..చెప్పినాడే
అబ్బో మెట్టవేదాంతాలు గుప్పినాడే
అబ్బో మెట్టవేదాంతాలు గుప్పినాడే
మెట్టవేదాంతాలు...గుప్పినాడే
వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె
మాపాలి దేవుడై వచ్చాడులే
మామీద దయచూప వచ్చాడులే
చరణం::2
పదారువేల గోపెమ్మలపై మత్తుమందుని చల్లినవాడు
ఓహో...మత్తుమందుని...చల్లినవాడు
చక్కనైన ఒక చుక్కను చూసి చక్కనైన ఒక చుక్కను చూసి
సైయని సైగలు చేశాడు..సైయని సైగలు చేశాడు
పిల్లనగ్రోవిని వూది కులుకుచూ చూపులగాలం వేశాడే
చూపులగాలం...వేశాడే
ముసిముసినవ్వుల ముద్దులాడుచూ
రాసక్రీడలు చేశాడే రాసక్రీడలు చేశాడే
ముసిముసినవ్వుల ముద్దులాడుచూ
రాసక్రీడలు చేశాడేఎన్నెన్నో లీలలు చేశాడే
వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె
మాపాలి దేవుడై...చ్చాడులే
మామీద దయచూప..వచ్చాడులే
చరణం::3
ఒంటిపాటుగా వున్నాడయ్యా..ఒంటిపాటుగా వున్నాడయ్యా
భయమేలేదనుకున్నాడయ్య..ఓహో భయమేలేదనుకున్నాడయ్య
పొంచివేసిన అదురుదెబ్బతో..అవతారం చాలించాడయ్యా
మోహనరూప గోవిందా..మానసచోర గోవిందా
విలాసపురుష గోవిందా..విచిత్రవేష గోవిందా
కపటనాటక గోవిందా..కన్యాపహార గోవిందా
గోవిందాహరి..గోవిందాహరి..గోవిందా
గోవిందాహరి..గోవిందాహరి..గోవిందా
శ్రీమద్రమారమణ...గోవిందో..హరి
No comments:
Post a Comment