Friday, November 21, 2008

మాయదారి మల్లిగాడు--1973

























 

సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,మంజుల,నాగభూషణం,పద్మనాభం,అంజలి, జయంతి,ప్రసన్నరాణి    

పల్లవి::

నవ్వుతూ...బతకాలిరా
తమ్ముడూ నవ్వుతూ..చావాలిరా 
ఏయ్..నవ్వుతూ బతకాలిరా
తమ్ముడూ..నవ్వుతూ చావాలిరా
చచ్చినాక నవ్వలేవురా..ఎందరేడ్చినా 
బతికిరావురా..తిరిగిరావురా..అందుకే 
నవ్వుతూ...బతకాలిరా
తమ్ముడూ నవ్వుతూ..చావాలిరా

చరణం::1

చంపేది ఎవడురా..చచ్చేది ఎవడురా
చంపేది ఎవడురా..చచ్చేది ఎవడురా 
శివుడాగ్న లేకుండా..చీమైనా కుట్టదురా 
శివుడాగ్న లేకుండా..చీమైనా కుట్టదురా
కుడితే సావాలని..వరమడిగిన చీమ 
కుట్టి కుట్టకముందె సస్తోంది చూడరా..ఆఆ 
అందుకే..నవ్వుతూ బతకాలిరా
తమ్ముడూ నవ్వుతూ..చావాలిరా

చరణం::2

బతికుండగా...నిన్ను ఏడిపించినోళ్ళు 
నువు సస్తే ఏడుత్తారు..దొంగనాయాళ్ళు 
దొంగనాయాళ్ళు
అది నువు సూసేదికాదు..నిను కాసేదికాదు 
అది నువు సూసేదికాదు..నిను కాసేదికాదు 
నువ్వుపోయినా..నువ్వుపోయినా 
నీ మంచి సచ్చిపొదురా..ఏయ్ సన్నాసీ నవ్వరా
అందుకే నవ్వుతూ...బతకాలిరా
తమ్ముడూ నవ్వుతూ...చావాలిరా 

చరణం::3

వున్నాడురా దేవుడు..వాడు 
ఒస్తాడురా తమ్ముడు..ఎప్పుడు
అన్నాయం...జరిగినపుడు
అక్కరము...పెరిగినపుడు 
అన్నాయం...జరిగినపుడు
అక్కరము...పెరిగినపుడు 
వస్తాడురా...సచ్చినట్టు 
వస్తాడురా..అ..అందుకే 
నవ్వుతూ...హేయ్ హేయ్ 
నవ్వుతూ...బతకాలిరా
తమ్ముడూ..నవ్వుతూ చావాలిరా
చచ్చినాక...నవ్వలేవురా
ఎందరేడ్చినా...బతికిరావురా
తిరిగిరావురా...అందుకే 
నవ్వుతూ...బతకాలిరా
తమ్ముడూ నవ్వుతూ..చావాలిరా

No comments: