Monday, December 08, 2008

దేవుడు చేసిన పెళ్ళి--1975



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,V.రామకృష్ణ
తారాగణం::శోభన్‌బాబు,శారద,లక్ష్మి,నాగభూషణం,చంద్రమోహన్,గిరిబాబు,రావుగోపాలరావు 

పల్లవి::

పాఠాలు నేర్పేటి పంతులమ్మా
ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా        
పాఠాలు నేర్పేటి పంతులమ్మా
ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా        
ఓ లేఖలు అందించే చినవాడా
ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా
ఓ లేఖలు అందించే చినవాడా
ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా

చరణం::1

రోజూ ఒక లేఖ రాస్తున్నాను
అందించాలని అనుకున్నాను
రోజూ ఒక లేఖ రాస్తున్నాను
అందించాలని అనుకున్నాను
తీరా నిను చూసీ తీయని గుబులేసీ
తీరా నిను చూసీ తీయని గుబులేసీ
తెచ్చిన లేఖల మాటే మరిచాను
ఆ మాటే..ఏఏఏ..మరిచాను
పాఠాలు నేర్పేటి పంతులమ్మా
ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా        

చరణం::2

ఇన్నాళ్ళు నేర్పాను పిల్లల పాఠాలు
ఇక నేర్చుకోవాలి ప్రేమ గీతాలు
ఇన్నాళ్ళు నేర్పాను పిల్లల పాఠాలు
ఇక నేర్చుకోవాలి ప్రేమ గీతాలు
నీలో పలికే గీతాలన్నీ
నీలో పలికే గీతాలన్నీ 
నను మరపించే నాగస్వరాలు
అవే ఈ జన్మకు వరాలు
పాఠాలు నేర్పేటి పంతులమ్మా
ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా        
ఓ లేఖలు అందించే చినవాడా
ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా

చరణం::3

వలచిన మనసే పాఠాలు చెబితే
పిలచిన కనులే లేఖలు రాస్తే
వలపే పులకించి - కలలే ఫలియి౦చి
వలపే పులకించి - కలలే ఫలియి౦చి
మన బ్రతుకే ఒక ఉయ్యాల కాదా
బంగారు ఉయ్యాల కాదా
పాఠాలు నేర్పేటి పంతులమ్మా
ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా        
ఓ లేఖలు అందించే చినవాడా
ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా
పాఠాలు నేర్పేటి పంతులమ్మా
ప్రేమ పాఠాలు చెబుతావా చిలకమ్మా

No comments: