సంగీతం::K.V.మహదేవన్
రచన::దాశరథి
గానం::B.వసంత,S.P.బాలు
తారాగణం::శోభన్ బాబు,రామ్మోహన్,ప్రభాకర రెడ్డి,గీతాంజలి,జయలలిత,రావికొండలరావు
పల్లవి::
గాజులు ఘల్లనగానే జాజులు గుం గుం గుమ్మనగానే
నీవే అనుకున్నాలే అది నీవే అనుకున్నాలే
తుమ్మెద గుం గుం గుమ్మనగానే తెమ్మెర రా రమ్మనగానే
నీవే అనుకున్నాలే..అది నీవే అనుకున్నాలే
చరణం::1
నీ కాటుక కన్నుల సొగసు నీ చెంగునదూకే వయసు
నన్నెంతో తొందరచేసే నీ కౌగిట బందీచేసే
వెచ్చని వెన్నెలలోన విచ్చిన కలువనుచూసీ
నీవే అనుకున్నాలే..అది నీవే అనుకున్నాలే
చరణం::2
నీ కదిలే పెదవులు చూసీ నా మెరిసే చెక్కిలి మురిసి
నీ వెచ్చని వొడిలోచేరి నా వయసే పొంగెను నేడే
కోయిల కోయనగానే కొమ్మల వోయనగానే
నీవే అనుకున్నాలే..అది నీవే అనుకున్నాలే
చరణం::3
నలనల్లని ఆకాశంలో తెలతెల్లని మేఘంలాగా
నల్లని ఆకాశంలో తెలతెల్లని మేఘంలాగా
నీ నీలికురులలో విరిసే మరుమల్లెలు నావే నావే
నీ హృదయపు పందిరిమీద పెనవేసిన మమతల తీగ
హృదయపు పందిరిమీద పెనవేసిన మమతల తీగ
విరబూసిన వలపుల పూలే ఏ నాటికి నావే నావే
గాజులు ఘల్లనగానే జాజులు గుమ్మనగానే
నీవే అనుకున్నాలే అది నీవే అనుకున్నాలే
తుమ్మెద ఝుమ్మనగానే తెమ్మెర రమ్మనగానే
నీవే అనుకున్నాలే..అది నీవే అనుకున్నాలే
లలలాలాలాలాలలలలలాలాలాలాలలలలా
No comments:
Post a Comment