Monday, September 17, 2012

మదన కామరాజు కథ--1962::యదుకుల కాంభోజి::రాగం



సంగీతం::రాజన్ నాగేంద్ర
రచన::G.కృష్ణమూర్తి
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల

యదుకుల కాంభోజి::రాగం

పల్లవి::


నీలి మేఘమాలవో నీలాలతారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో
నీలి మేఘమాలవో..

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

నీలి మేఘమాలనో నీలాల తారనో
నా సోయగాలతో మదినీ దోచిపోడునో
నీలి మేఘమాలనో..

చరణం::1

నీ రాక కోసమే చెలీ..నే వేచి యుంటినే
ఆరాటమేలనో ప్రియా..నే చెంతనుంటినే
ఆనంద మధుర గీతములా..ఆలపింతుమా
నీలి మేఘమాలనో..

చరణం::2

చివురించు వలపు తీవెలా..విరిపూలు పూయగా
చిరునవ్వు విరుపు లోపలా..హరివిల్లు విరియగా
నెలవంక నావలోన మనమూ..కలసి పోదమా
నీలి మేఘమాలవో..

చరణం::3

మనలోని కలత మాయమై..మన ఆశ తీరెగా
అనురాగ రాగమే ఇక..మన రాగమాయేగా
మనసార ప్రేమ మాధురులా..సాగిపోదమా

నీలి మేఘమాలనో నీలాల తారనో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో

No comments: