Saturday, July 30, 2011

మాంగల్య బలం--1959::కాఫీ::రాగం















సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీశ్రీ
గానం::P.సుశీల,సరోజిని
Film Directed By::Adoorti SubbaaRao
తారాగణం::అక్కినేని,సావిత్రి,S.V.రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,

సూర్యకాంతం,రమణమూర్తి

కాఫీ::రాగం 

పల్లవి::

హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా..చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి

చరణం::1

సతి ధర్మం పతి సేవేయని..పతి భక్తిని చూపాలి
అనుదినము అత్త మామల..పరిచర్యలనే చేయాలి
పతి ఇంట్లో బంధు జనాల..అభిమానం పొందాలి
పతి ఇంట్లో బంధు జనాల..అభిమానం పొందాలి
పదిమంది నీ సుగుణాలే..పలుమార్లు పొగడాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి

చరణం::2

ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి
సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి
శరీరాలు వేరే కానీ..మనసొకటై మసలాలి
శరీరాలు వేరే కానీ..మనసొకటై మసలాలి
సుఖమైనా అసత్యమైనా..సగపాలుగా మెలగాలి

హాయిగా..చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి

చరణం::3

ఇరుగమ్మలు పొరుగమ్మలతో..ఇంటి సంగతులు అనవద్దు
చీరలు నగలిమ్మని భర్తను..చీటికి మాటికి అడగద్దు
అత్తింటను అదిరిపాటుతో..పుట్టింటిని పొగడద్దు
అత్తింటను అదిరిపాటుతో..పుట్టింటిని పొగడద్దు
తరుణం దొరికిందే చాలని..తలగడ మంత్రం చదవద్దు

హాయిగా..చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి

No comments: