Monday, August 02, 2010

మాంగల్య బలం--1959




సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల, P.సుశీల
Film Directed By::Adoorti SubbaaRao
తారాగణం::అక్కినేని,సావిత్రి,ఎస్.వి.రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,

సూర్యకాంతం,రమణమూర్తి

పల్లవి::

పెనుచీకటాయె లోకం..చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

చరణం::1

చిననాటి పరిణయ గాథ..ఎదిరించలేనైతినే
చిననాటి పరిణయ గాథ..ఎదిరించలేనైతినే
ఈనాటి ప్రేమగాథ..తలదాల్చలేనైతినే

కలలే నశించిపోయే..మనసే కృశించిపోయే
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

పెనుచీకటాయె లోకం..చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

చరణం::2

మొగమైన చూపలేదే..మనసింతలో మారెనా
మొగమైన చూపలేదే..మనసింతలో మారెనా
నా ప్రాణ సతివని తెలిపే..అవకాశమే పోయెనా

తొలినాటి కలతల వలన..హృదయాలు బలి కావలెనా
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

పెనుచీకటాయె లోకం..చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ..ఆ..విధియే పగాయె

No comments: