Showing posts with label అప్పుచేసి పప్పుకూడు--1958. Show all posts
Showing posts with label అప్పుచేసి పప్పుకూడు--1958. Show all posts

Monday, July 02, 2007

అప్పుచేసి పప్పుకూడు--1958




సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::పింగళి
గానం::P.లీల

రామ రామ శరణం..భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం...

తాటకిని వధించి..మునిరాజుకౄపనుగాంచి
తాటకిని వధించి..మునిరాజుకౄపనుగాంచి
శిలకుప్రాణమిచ్చి..సన్నుతులుగాంచినట్టి
రామ రామ శరణం..భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం...

శివుని విల్లు ద్రుంచి..శ్రీజానకిని గ్రహించి
శివుని విల్లు ద్రుంచి..శ్రీజానకిని గ్రహించి
జనకు మాటనెంచి..వనవాసమేగినట్టి
రామ రామ శరణం..భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం...

రావణుని వధించి..ఘనకీర్తి జగతినించి
రావణుని వధించి..ఘనకీర్తి జగతినించి
పాపముల హరించి..భువినెల్ల గాచునట్టి
రామ రామ శరణం..భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం...

అప్పుచేసి పప్పుకూడు--1958::ఆరభి :::రాగం






















డైరెక్టర్::LV.ప్రసాద్
రచన::పింగళి నారాయణ రావ్
సంగీతం::S.రాజేశ్వర రావ్
గానం::ఘంటసాల,AM.రాజా,P.లీల

ఆరభి :::రాగం


సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా
సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా

అందము ప్రాయము ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
అందము ప్రాయము ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
ముందుగ ఎవరిని వరించునోయని తొందరలో మతి పోవుకద
సుందరాంగులను చూసిన వేళల కొందరు పిచ్చనుపడనేలా
కొందరు ముచ్చటపడనేలా
హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద
హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద
మందహాసమున మనసును తెలిపే ఇందువదన కనువిందుకదా

ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు పరవశ పడనేల
కొందరు కలవరపడనేల

యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
ప్రేమపందెమును గెలిచేవరకు నామది కలవరపడునుకదా

ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు కలవరపడనేల
కొందరు పరవశ పడనేల

కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద
కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద
వరములొసంగే ప్రేమదేవి గన పరవశమే మది కలుగుకదా

సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా

అప్పుచేసి పప్పుకూడు--1958::ఆభేరి:::రాగం





డైరెక్టర్::LV.ప్రసాద్
రచన::పింగళి నారాయణ రావ్
సంగీతం::S.రాజేశ్వర రావ్
గానం::P.సుశీల,P.లీల


ఆభేరి:::రాగం

చిగురుల పూవుల సింగారముతో తీవెల సొంపులు గనలేదు
ముసిముసి నవ్వుల గిలిగింతలతో వసంత ఋతువా రానేలేదు


కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
తరుణం కాని తరుణంలో నా మది యీ గుబులెందుకనో
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో

వలుపులు మీటగ తీయని పాటలు హృదయవీణపై పలికెనుగా
ప్రియతము గాంచిన ఆనందములో మనసే వసంత ఋతువాయెనుగా
కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే
తరుణం కాని తరుణంలో నీ మది ఆ గుబులందుకనే
కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే

తళుకుబెళుకుళ తారామణులతో శారదరాత్రులు రాలేదు
ఆకాశంలో పకపకలాడుచు రాకాచంద్రుడు రానేలేదు
కాలం కాని కాలంలో చల్లని వెన్నెల ఎందుకనో
తరుణం కాని తరుణంలో నా మది యీ గుబులెందుకనో
కాలం కాని కాలంలో చల్లని వెన్నెల ఎందుకనో

తలచిన తలపులు ఫలించగలవని బులపాటము బలమాయెనుగా
పగటి కల గను కన్యామణులను ప్రియుడే రాకాచంద్రుడుగా
కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే
తరుణం కాని తరుణంలో నీ మది యీ గుబులందుకనే
కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే

అప్పుచేసి పప్పుకూడు--1958::మధ్యమావతి:::రాగం





డైరెక్టర్::LV.ప్రసాద్
రచన::పింగళి నారాయణ రావ్
సంగీతం::S.రాజేశ్వర రావ్
గానం::ఘంటసాల,స్వర్ణలత


మధ్యమావతి:::రాగం
కాశికి పోయాను రామా హరీ
గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరీ
గంగ తీర్థాము తెచ్చాను రామా హరీ
కాశికి పోలేదు రామా హరీ
ఊరి కాల్వలో నీళ్ళండి రామ హరీ
మురుగు కాల్వలో నీళ్ళండి రామా హరీ

శ్రీశైలమెళ్ళాను రామా హరీ
శివుని విభూది తెచ్చాను రామా హరీ
శివుని విభూది తెచ్చాను రామా హరీ
శ్రీశైలం పోలేదు రామా హరీ
శివుని విభూది తేలేదు రామా హరీ
ఇది కాష్టంలో బూడిద రామ హరీ

అన్నమక్కరలేదు రామా హరీ
నేను గాలి భోంచేస్తాను రామా హరీ
ఉత్త గాలి భోంచేస్తాను రామా హరీ
గాలితో పాటుగా రామ హరీ
వీరు గారెలే తింటారు రామా హరీ
నేతి గారెలే తింటారు రామా హరీ

కైలాసమెళ్ళాను రామా హరీ
శివుని కళ్ళార చూసాను రామా హరీ
రెండు కళ్ళార చూసాను రామా హరీ
కైలాసమెళితేను రామా హరీ
నంది తన్ని పంపించాడు రామా హరీ
బాగ తన్ని పంపించాదు రామా హరీ

ఆలుబిడ్డలు లేరు రామా హరీ
నేను ఆత్మయోగినండి రామా హరీ
గొప్ప ఆత్మయోగినండి రామా హరీ
ఆ మాట నిజమండి రామా హరీ
నేను అందుకే వచ్చాను రామా హరీ
నేను అందుకే వచ్చాను రామా హరీ

అప్పుచేసి పప్పుకూడు--1958





డైరెక్టర్::LV.ప్రసాద్
రచన::పింగళి నారాయణ రావ్
సంగీతం::S.రాజేశ్వర రావ్
గానం::ఘంటసాల,లీల


ఆనందం పరమానందం ఆనందం పరమానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం
యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం
యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం
ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం
ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం

వేణుగానమున శిశువులు పశువులు తన్మయమందుట ఆనందం
వేణుగానమున శిశువులు పశువులు తన్మయమందుట ఆనందం
కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం
కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం

ఆనందం పరమానందం ఆనందం పరమానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం

అప్పుచేసి పప్పుకూడు--1958::మోహన:::రాగం





డైరెక్టర్::LV.ప్రసాద్
రచన::పింగళి నారాయణ రావ్
సంగీతం::S.రాజేశ్వర రావ్
గానం::ఘంటసాల,లీల


మోహన:::రాగం

ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ....
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ
ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ ....
ప్రకృతినెల్ల హాయిగా
తీయగా మాయగా పరవశింపజేయుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి

జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ
జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ
మనసు మీద హాయిగా ఆ ఆ ఆ ....
మనసు మీద హాయిగా
తీయగా మాయగా మత్తుమందు జల్లుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి

హృదయవీణ మీటుతూ ప్రేమగీతి పాడుతూ
హృదయవీణ మీటుతూ ప్రేమగీతి పాడుతూ
ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ . ..
ప్రకృతినెల్ల హాయిగా
తీయగా మాయగా పరవశింపజేయుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఈ చల్లని గాలి.

అప్పుచేసి పప్పుకూడు--1958::కాపీ::రాగం (పీలు)





డైరెక్టర్::LV.ప్రసాద్
రచన::పింగళి నారాయణ రావ్
సంగీతం::S.రాజేశ్వర రావ్
గానం::ఘంటసాల,స్వర్ణలత

కాపీ::రాగం (పీలు)


ఓ మరదలా నా మదిలో పొంగి పొరలే ప్రేమ వరదలా
నీరు పాలు కలిసి ఒకటైనటులే నీవు నేను ఒకటే కాదా
ఓ పంచెవన్నెల చిలక ఆ అ
ఓ పంచెవన్నెల చిలక నీకెందుకింత అలక
ఓ పంచెవన్నెల చిలక నీకెందుకింత అలక
మాటాడవేమే మాటాడవేమే నీనోటి ముత్యాలొలక
పంచెవన్నెల ఓ పంచెవన్నెల చిలక నీకెందుకింత అలక
ఒహొ బావ మార్చుకో నీ వంకర టింకర దోవ
ఊరికే నీవు నేను ఒకటే అనుకుంటే ఒప్పుతుందా ఈ లోకం
ఓ కొంటె బావగారు హాయ్
ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు
ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు
మా నాన్నగారు చూస్తే
మా నాన్నాగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు
ఓ కొంటె బావగారు
ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు

సీమటపాకాయలాగ చిటపటాలాడేవు
సీమటపాకాయలాగ చిటపటాలాడేవు
ప్రేముందా లేదా ఓ మరదలా నామీద
పంచెవన్నెల ఓ పంచెవన్నెల చిలక నీకెందుకింత అలక

మరదలినైతే మాత్రం మరీ అంత చనువా
మరదలినైతే మాత్రం మరీ అంత చనువా
మర్యాద కాదు నీ బావమరిది చొరవ

కొంటె బావగారు
ఓ కొంటే బావగారు మనకెందుకింక పోరు
మా నాన్నగారు చూస్తే
మా నాన్నాగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు
ఓ కొంటె బావగారు
ఓ పంచెవన్నెల చిలక
ఓ కొంటే బావగారు
ఓ పంచెవన్నెల చిలక

అప్పుచేసి పప్పుకూడు--1958::హిందోళ:::రాగం




డైరెక్టర్::LV.ప్రసాద్
రచన::పింగళి నారాయణ రావ్
సంగీతం::S.రాజేశ్వర రావ్
గానం::AM.రాజా


హిందోళ:::రాగం


మూగవైన ఏమిలే నగుమోమే చాలులే
సైగలింక చాలించుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే

ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
దొంగ మనసు దాగదులే
దొంగ మనసు దాగదులే సంగతెల్ల తెలిసెనులే
మూగవైన ఏమిలే

పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
నను దయతో ఏలుకొనుము
నను దయతో ఏలుకొనుము కనుసన్నల మెలిగెదలే
మూగవైన ఏమిలే

అందాలే బంధాలై నను బందీ చేసెనులే
అందాలే బంధాలై నను బందీ చేసెనులే
కలవరమిక యెందుకులే
కలవరమిక యెందుకులే వలదన్నా వదలనులే

మూగవైన ఏమిలే నగుమోమే చాలులే
సైగలింక చాలించుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే

అప్పుచేసి పప్పుకూడు--1958::మోహన::రాగం





గానం::AM.రాజా,P.లీల
సంగీతం : S.రాజేశ్వరరావు
రచన::పింగళి నారాయణ రావ్


రాగం:::మోహన

(భుప్~భుపాలీ హిందుస్తాని.)

చేయి చేయి కలుపరావె హాయిహాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా ఉం ఉం ఉం ఉం
చేయి చేయి కలుపరావె హాయిహాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా
అహ చేయి చేయి
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయిహాయిగా ఉం ఉహు ఉహు
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయిహాయిగా
ఉహు చేయి చేయి

మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాళలేనుగా ఉం ఉం ఉం ఉం
మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాళలేనుగా
అహ చేయి చేయి

వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా ఉం ఉం ఉహు ఉహు
వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా
చేయి చేయి కలుపరావె హాయిహాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా
అహ చేయి చేయి