Monday, July 02, 2007

అప్పుచేసి పప్పుకూడు--1958::మోహన::రాగం





గానం::AM.రాజా,P.లీల
సంగీతం : S.రాజేశ్వరరావు
రచన::పింగళి నారాయణ రావ్


రాగం:::మోహన

(భుప్~భుపాలీ హిందుస్తాని.)

చేయి చేయి కలుపరావె హాయిహాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా ఉం ఉం ఉం ఉం
చేయి చేయి కలుపరావె హాయిహాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా
అహ చేయి చేయి
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయిహాయిగా ఉం ఉహు ఉహు
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయిహాయిగా
ఉహు చేయి చేయి

మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాళలేనుగా ఉం ఉం ఉం ఉం
మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాళలేనుగా
అహ చేయి చేయి

వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా ఉం ఉం ఉహు ఉహు
వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా
చేయి చేయి కలుపరావె హాయిహాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా
అహ చేయి చేయి

No comments: