Monday, July 02, 2007

అప్పుచేసి పప్పుకూడు--1958::హిందోళ:::రాగం




డైరెక్టర్::LV.ప్రసాద్
రచన::పింగళి నారాయణ రావ్
సంగీతం::S.రాజేశ్వర రావ్
గానం::AM.రాజా


హిందోళ:::రాగం


మూగవైన ఏమిలే నగుమోమే చాలులే
సైగలింక చాలించుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే

ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
దొంగ మనసు దాగదులే
దొంగ మనసు దాగదులే సంగతెల్ల తెలిసెనులే
మూగవైన ఏమిలే

పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
నను దయతో ఏలుకొనుము
నను దయతో ఏలుకొనుము కనుసన్నల మెలిగెదలే
మూగవైన ఏమిలే

అందాలే బంధాలై నను బందీ చేసెనులే
అందాలే బంధాలై నను బందీ చేసెనులే
కలవరమిక యెందుకులే
కలవరమిక యెందుకులే వలదన్నా వదలనులే

మూగవైన ఏమిలే నగుమోమే చాలులే
సైగలింక చాలించుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే

No comments: