Monday, July 02, 2007

అప్పుచేసి పప్పుకూడు--1958::కాపీ::రాగం (పీలు)





డైరెక్టర్::LV.ప్రసాద్
రచన::పింగళి నారాయణ రావ్
సంగీతం::S.రాజేశ్వర రావ్
గానం::ఘంటసాల,స్వర్ణలత

కాపీ::రాగం (పీలు)


ఓ మరదలా నా మదిలో పొంగి పొరలే ప్రేమ వరదలా
నీరు పాలు కలిసి ఒకటైనటులే నీవు నేను ఒకటే కాదా
ఓ పంచెవన్నెల చిలక ఆ అ
ఓ పంచెవన్నెల చిలక నీకెందుకింత అలక
ఓ పంచెవన్నెల చిలక నీకెందుకింత అలక
మాటాడవేమే మాటాడవేమే నీనోటి ముత్యాలొలక
పంచెవన్నెల ఓ పంచెవన్నెల చిలక నీకెందుకింత అలక
ఒహొ బావ మార్చుకో నీ వంకర టింకర దోవ
ఊరికే నీవు నేను ఒకటే అనుకుంటే ఒప్పుతుందా ఈ లోకం
ఓ కొంటె బావగారు హాయ్
ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు
ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు
మా నాన్నగారు చూస్తే
మా నాన్నాగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు
ఓ కొంటె బావగారు
ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు

సీమటపాకాయలాగ చిటపటాలాడేవు
సీమటపాకాయలాగ చిటపటాలాడేవు
ప్రేముందా లేదా ఓ మరదలా నామీద
పంచెవన్నెల ఓ పంచెవన్నెల చిలక నీకెందుకింత అలక

మరదలినైతే మాత్రం మరీ అంత చనువా
మరదలినైతే మాత్రం మరీ అంత చనువా
మర్యాద కాదు నీ బావమరిది చొరవ

కొంటె బావగారు
ఓ కొంటే బావగారు మనకెందుకింక పోరు
మా నాన్నగారు చూస్తే
మా నాన్నాగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు
ఓ కొంటె బావగారు
ఓ పంచెవన్నెల చిలక
ఓ కొంటే బావగారు
ఓ పంచెవన్నెల చిలక

No comments: