Tuesday, May 06, 2014

చెల్లెలి కాపురం--1971


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::దేవులపల్లి కృష్ణశాస్ర్తి 
గానం::S.జానకి,P.B.శ్రీనివాస్ 

పల్లవి::

ఈ దారి నా స్వామి నడిచేనే
పాదాల...జాడలివిగోనే
రానే వచ్చాడు..తీరా తానే వచ్చాడూ..కృష్ణుడు 
రానే వచ్చాడు..తీరా తానే వచ్చాడూ   
లేవండీ పొదరింటా..లేవండీ 
పొదరింటా..లెండే పొగడా గోరింటా
రానే వచ్చాడు..తీరా తానే వచ్చాడూ   
ఎవరే..ఎవరే..ఎవరే  
మువ్వల మురళిని నవ్వే పెదవుల ముద్దాడే వాడే నన్నేలువాడు
కన్నుల చల్లని వెన్నెల జల్లుల విరజిమ్మే వాడే నన్నేలువాడు
ఓహొ..ఓహొ..ఓహొ
ఈ నల్లని రూపం చూచీ..ఈ పిల్ల సోయగము వలచీ 
ఈ నల్లని రూపం చూచీ..ఈ పిల్ల సోయగము వలచీ
రేపల్లె విడిచి రేయల్ల నడచి మన పల్లెకు దయచేసాడటే
లేవండీ పొదరింటా..లెండే పొగడా గోరింటా
రానే వచ్చాడు..తీరా తానే వచ్చాడూ..కృష్ణుడు 
రానే వచ్చాడు..తీరా తానే వచ్చాడూ  

అటు అడుగిడితే నా తోడూ..ఇటు చూడూ
అటు అడుగిడితే నా తోడూ..ఇటు చూడూ
ఇట నిలిచినాడు నీ కోసం లీలా ప్రియుడూ..ఇటు చూడూ
వలచి వలచి వచ్చినదెవరో..పిలిచి పిలిచి అలసిన ఈ పిల్లగ్రోవినడుగు 
వలచి వలచి వచ్చినదెవరో..పిలిచి పిలిచి అలసిన ఈ పిల్లగ్రోవినడుగు 
పిల్లగ్రోవి నడుగూ..ఇటు చూడూ

కృష్ణా..ఏల స్వామీ దయమాలీ..ఈ దీనురాలిని ఎగతాలీ 
ఏల స్వామీ దయమాలీ..నీ కళ్ళ ఎదుటా నిలువలేనీ..పాదధూళిని పొందలేనీ 
నీడకైనా నోచుకోనీ..రేయి కనులా నల్లనైన దీనురాలిని ఎగతాలీ

కనులకు తోచేది కాదు సోయగమూ..మనసులో పూచేటీ మధురిమగానీ
నీ చెలులు చూసేదీ నీ బాహ్యమూర్తీ..నేను వలచేదీ నా నీలలో దీప్తి

No comments: