సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::P.సుశీల,రమోల
తారాగణం::రామకృష్ణ,ప్రభ,శ్రీదేవి కపూర్,కంతారావు,ప్రభాకర్‌రెడ్డి,జ్యోతిలక్ష్మీ,జయమాలిని,జి.వరలక్ష్మీ,సారథి.
పల్లవి::
యేమన్నాడే..అతడు ఔనన్నాడా
యేం చేశాడే..అక్కా చక్కనిచుక్కా..ఛీ పోవే
చరణం::1
పక్కనచేరి చెక్కిలి మీటి చక్కలిగింతలు చేశాడా..ఏయ్
ఊసులు చెప్పీ బాసలు చేసీ ఆశలు ఎన్నో రేపాడా..ఊరుకోవే
సిగ్గెందుకే బిగువెందుకే నీ బుగ్గలు చెబుతున్నాయిలే
ఏయ్ తంతాను...జాగ్రత్త
ఏయ్ ఏయ్..తడిచి పోతావే..ఛీ పో
పక్కనచేరి చెక్కిలి మీటి చక్కలిగింతలు చేశాడా..ఏయ్
ఊసులు చెప్పీ బాసలు చేసీ ఆశలు ఎన్నో రేపాడా
యేమన్నాడే..అతడు ఔనన్నాడా
యేం చేశాడే..అక్కా చక్కనిచుక్కా..ఛీ పోవే
చరణం::2
జల జల కురిసే జడివానలో తడవాలని నీకు లేదా..ఊహు
అల్లరిచేసే చల్లగాలిలో ఆడాలని నీకు లేదా
ఈ వయసులో ఈ వేళలో
నీ కోరిక దాచేవు ఎందుకే..అబ్బబ్బ ఊరుకోవే
పక్కనచేరి చెక్కిలి మీటి చక్కలిగింతలు చేశాడా..ఏయ్
ఊసులు చెప్పీ బాసలు చేసీ ఆశలు ఎన్నో రేపాడా
యేమన్నాడే..అతడు ఔనన్నాడా
యేం చేశాడే..అక్కా చక్కనిచుక్కా..ఛీ పోవే
No comments:
Post a Comment