సంగీతం::రమేష్‌నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు , P.సుశీల
తారాగణం::రాజ్‌కుమార్,రతి అగ్నిహోత్రి
పల్లవి::
కోయిల పిలుపే..కోనకు మెరుపు
మాయని వలపే..మనసుకు మెరుపు..ఊ
కోయిల పిలుపే..కోనకు మెరుపు
మాయని వలపే..మనసుకు మెరుపు
చరణం::1
ఆఆ..అహహా..ఆ..ఆ..అహహా..ఆ
ఆఆ..అహహా..ఆ..ఆ..అహహా..ఆ
నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ
నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ
పెదవులకెంత ఆశ..ఎంత ఆశ..ఎంత ఆశా
పెదవులకెంత ఆశ..ఎంత ఆశ..ఎంత ఆశా
పదే పదే పదే పదే..ఒదిగి ఉండాలని
కోయిల పిలుపే..కోనకు మెరుపు
మాయని వలపే..మనసుకు మెరుపు
కోయిల పిలుపే..కోనకు మెరుపు
మాయని వలపే..మనసుకు మెరుపు
చరణం::2
కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ
కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ
హృదయం కోరుతుంది..కోరుతుంది..కోరుతుంది
హృదయం కోరుతుంది..కోరుతుంది..కోరుతుంది
ఇలా ఇలా ఇలా ఇలా కలిసి ఉండాలనీ
కోయిల పిలుపే కోనకు మెరుపు
మాయని వలపే మనసుకు మెరుపు
కోయిల పిలుపే కోనకు మెరుపు
మాయని వలపే మనసుకు మెరుపు
No comments:
Post a Comment