Thursday, December 15, 2011

దొరబాబు--1974



















సంగీత::J.V.రాఘవులు
రచన::దాశరథి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం: అక్కినేని,మంజుల,సత్యనారాయణ,జయంతి,గిరిబాబు.

పల్లవి::

దేవుడెలా వుంటాడని..ఎవరైన అడిగితే
మా అన్నలా వుంటాడని..అంటాను నేనూ

అనురాగమెలా వుంటుందని..ఎవరైనా అడిగితే
మా చెల్లిలా వుంటుందని..చెబుతాను నేనూ

చరణం::1

చెల్లెలున్న యీ యిల్లే..సిరిమల్లె తోట
మా అమ్మలు చిరునవ్వే..ముత్యాల మూట
చెల్లెలున్న యీ యిల్లే..సిరిమల్లె తోట
మా అమ్మలు చిరునవ్వే..ముత్యాల మూట
అన్నయ్య హృదయమే..అందాల మేడ
చెల్లాయికి కలకాలం..అది చల్లని నీడ
కన్నతల్లి తీపికలల..రూపాలం మనము
కన్నతల్లి తీపికలల..రూపాలం మనము
కోవెలలో వెలిగించిన..దీపాలం మనము   
ఆ దేవుడెలా వుంటాడని..ఎవరైన అడిగితే
మా అన్నలా వుంటాడని..అంటాను నేనూ

చరణం::2

అల్లారు ముద్దుగా..నను పెంచినావు
అమ్మనూ నాన్ననూ..మరపించినావు
అల్లారు ముద్దుగా..నను పెంచినావు
అమ్మనూ నాన్ననూ..మరపించినావు
ఇల్లాలివై నీవు...విలసిల్లవమ్మా
పిల్లాపాపలతోటి..చల్లగా వుండంమ్మా 
పుట్టినింట వున్నా..మెట్టినింట వున్నా
పుట్టినింట వున్నా..మెట్టినింట వున్నా
అన్నయ్య...దీవనే శ్రీరామరక్ష           
అనురాగమెలా వుంటుందని..ఎవరైనా అడిగితే
మా చెల్లిలా వుంటుందని..చెబుతాను నేనూ
దేవుడెలా వుంటాడని..ఎవరైన అడిగితే
మా అన్నలా వుంటాడని..అంటాను నేనూ

No comments: