Thursday, December 15, 2011

దొరబాబు--1974















సంగీతం::J.V.రాఘవులు 
రచన::ఆత్రేయ  
గానం::P.సుశీల,ఘంటసాల  
తారాగణం::అక్కినేని,మంజుల,సత్యనారాయణ,జయంతి,రాజబాబు,గిరిబాబు. 

పల్లవి::

సయ్యారే సైసై..సయరసైయ్యా
సయ్యారే సైసై..సయరసైయ్యా
అరే సయ్యా..అరే సైయ్యా..అరే సైయ్యా..అరేసైయ్యా 
చంద్రమ్మా..ఆఆఆఆఆ 
చంద్రగిరి...చంద్రమ్మా..ఆఆఆ  
చంద్రమ్మా..ఆఆఆఆఆఆ  
చంద్రగిరి...చంద్రమ్మా..ఆ 
చంద్రగిరి చంద్రమ్మా..సందేళ కొస్తానమ్మా
అందాక నలగిపోక..అలసిపోక వుండమ్మా
చంద్రగిరి చంద్రయ్యా..సందేళ కొస్తానయ్యా
అందాక పనిచేసి..ఆకలేసి వుండయ్యా
చంద్రగిరి...చంద్రమ్మా..ఆఆఆఆ 

చరణం::1

వల్లమాలిన వయసేమో..వెల్లువంటిది
దాని కాశయాల..కానకట్ట వేసుకోవాలీ
ఆనకట్టనే..ఏ..వేసుకోవాలీ
ఆడది మగవాడు..ఆడుతూ పాడుతూ
ఆడది మగవాడు..ఆడుతూ పాడుతూ 
దాన్ని మళ్ళించి..మంచితనం పండించాలి 

చంద్రగిరి చంద్రమ్మా..సందేళ కొస్తానమ్మా
అందాక నలగిపోక..అలసిపోక వుండమ్మా
చంద్రగిరి...చంద్రమ్మా..ఆఆఆఆ   

చరణం::2

మట్టి నీళ్ళల్లా..మనమేకం కావాలి
చెట్టాపట్టగ చేయి..పట్టి నడవాలీ
పట్టీ నడవాలి.. చేయి పట్టి నడవాలీ 
పుట్టినందు కేదైన..గట్టి పనిచేయాలి
పుట్టినందు కేదైన..గట్టి పనిచేయాలి
పుట్టబోయేవాళ్ళు..మనపేరు చెప్పుకోవాలీ 

చంద్రగిరి చంద్రయ్యా..సందేళ కొస్తానయ్యా
అందాక పనిచేసి..ఆకలేసి వుండయ్యా
చంద్రగిరి...చంద్రయ్యా..ఆఆఆఆ 

చరణం::3

కావేరి గోదావరి గంగా కృష్ణమ్మలను
కలిపేసి నిలవేసి..కక్షలను మాపాలి
కక్షలను మాపాలి..కక్షలను మాపాలి
ప్రతిపల్లె పెళ్ళికాని..పడుచుపిల్ల కావాలి
ప్రతిపల్లె పెళ్ళికాని..పడుచుపిల్ల కావాలి
పంటలక్ష్మి యింటింటా..భరతనాట్యమాడాలీ 

చంద్రగిరి చంద్రమ్మా..సందేళ కొస్తానమ్మా
అందాక నలగిపోక..అలసిపోక వుండమ్మా
చంద్రగిరి చంద్రయ్యా..సందేళ కొస్తానయ్యా
అందాక పనిచేసి..ఆకలేసి వుండయ్యా
చంద్రగిరి..చంద్రమ్మా..ఆఆఆఆఆ 

No comments: