Thursday, December 15, 2011

దొరబాబు--1974



















సంగీతం::J.V.రాఘవులు 
రచన::గోపి  
గానం::P.సుశీల,V.రామకృష్ణ  
తారాగణం::అక్కినేని,మంజుల,సత్యనారాయణ,జయంతి,రాజబాబు,గిరిబాబు. 

పల్లవి::

అమ్మమ్మో..అమ్మమ్మో..యీ గుంటడు ఎంతకిలాడీ
హ్హ..గుచ్చి గుచ్చి చంపుతాడు..కళ్ళతోటీ దొంగకళ్ళతోటీ 
అన్నన్నా..అన్నన్నా..ఈ కుర్రది టక్కులాడీ
బులిపించి చంపుతాది..మాటలాడీ మాయమాటలాడీ 

చరణం::1

నీ చేెతిలో ఏదో..మంత్రమున్నదీ
తాకగానే నా..గుండె కొట్టుకుంటదీ
నీ చేెతిలో ఏదో..మంత్రమున్నదీ
తాకగానే నా..గుండె కొట్టుకుంటదీ 
తాకితేనే నీ గుండె..కొట్టుకుంటదీ..ఈ
తాకితేనే నీ గుండె..కొట్టుకుంటదీ 
తాకకుంటే..నా గుండె ఆగిపోతదీ  
అమ్మమ్మో..అమ్మమ్మో
యీ గుంటడు..ఎంతకిలాడీ
గుచ్చి గుచ్చి..చంపుతాడు
కళ్ళతోటీ..దొంగకళ్ళతోటీ 

చరణం::2

నీ కంట్లో నా నీడ..వెచ్చగుంటదీ
నాకేమో ఆ వేడి..దక్కనంటదీ
నీ కంట్లో నా నీడ..వెచ్చగుంటదీ
నాకేమో ఆ వేడి..దక్కనంటదీ
నీడైతే నా కంట్లో..కుదురుగుంటదీ
నీడైతే నా కంట్లో..కుదురుగుంటదీ
నువ్వైతే నా మనసు...చెదిరిపోతదీ
అన్నన్నా..అన్నన్నా..ఈ కుర్రది టక్కులాడీ
బులిపించి చంపుతాది..మాటలాడీ మాయమాటలాడీ 

చరణం::3

నీ సొగసే నా చూపుకి..తిండి పెడతదీ
పిసినిగొట్టు నీ మనసే..కసిరికొడతదీ
నీ సొగసే నా చూపుకి..తిండి పెడతదీ
పిసినిగొట్టు నీ మనసే..కసిరికొడతదీ
చూపుతో నీ వయసుకు..కరువు తీరదు
చూపుతో నీ వయసుకు..కరువు తీరదూ
తీరిస్తే నా సిగ్గుకు...పరువు మిగలదూ   
అన్నన్నా..అన్నన్నా..ఈ కుర్రది టక్కులాడీ
బులిపించి చంపుతాది..మాటలాడీ మాయమాటలాడీ 
అమ్మమ్మో..అమ్మమ్మో..యీ గుంటడు ఎంతకిలాడీ
గుచ్చి గుచ్చి చంపుతాడు..కళ్ళతోటీ దొంగకళ్ళతోటీ

No comments: