Friday, December 16, 2011

దొరబాబు--1974




సంగీత::J.V.రాఘవులు
రచన::ఆంజనేయశాస్త్రి
గానం::V.రామకృష్ణ , P.సుశీల
తారాగణం: అక్కినేని,మంజుల,సత్యనారాయణ,జయంతి,గిరిబాబు.

పల్లవి::

నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ 

చరణం::1

కొత్త కొత్త కోరికలేవో నాలో చెలరేగాయీ
కౌగిలిలో బంధిస్తేనే కలత నిదురపోతాయీ
కొత్త కొత్త కోరికలేవో నాలో చెలరేగాయీ
కౌగిలిలో బంధిస్తేనే కలత నిదురపోతాయీ
తెలిసింది నీ ఎత్తూ..ఆ ఎత్తే గమ్మత్తూ
అహా..తెలిసింది నీ ఎత్తూ..ఆ ఎత్తే గమ్మత్తూ
సందెలో విందులా..విందులో..పొందులా
పొందులా..అలా అలా అలా అలా అలా
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ
వయసూ సొగసూ..కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ 

చరణం::2

ఏడడుగులు నడిచావంటే..ఎండమొహం చూడనీయను
వలపు జల్లు తడిసిన..ఒళ్ళూ ఎక్కడ ఆరేసుకోను
ఏడడుగులు నడిచావంటే..ఎండమొహం చూడనీయను
వలపు జల్లు తడిసిన..ఒళ్ళూ ఎక్కడ ఆరేసుకోను 
నాలోనే వేడుందీ..నీ ధోరణి బావుంది
నాలోనే వేడుందీ..నీ ధోరణి బావుంది
ఎండలో వానలా వానలో..హాయిలా  
అలా..అలా..అలా..అలా..అలా        
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి..రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ 

చరణం::3

మూడు ముళ్ళూ వేయకముందే..నన్నల్లరి చెయ్యొద్దూ
ఇల్లాలివి కావాలంటే...యివ్వాలి తొలిముద్దూ
ఏమిటి యీ చిలిపితనం..అంతేలే కుర్రతనం 
పూవులో..తేటిలా..తేటిలో.. పాటలా  
అలా..అలా..అలా..అలా..అలా            
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి..రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ

No comments: