Friday, December 02, 2011

రైతుకుటుంబం--1972






సంగీత::T.చలపతిరావ్ 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని, కాంచన,పద్మనాభం,రామకృష్ణ, అంజలీదేవి,గీతాంజలి,సత్యనారాయణ

పల్లవి::

మనసే పొంగెను..ఈవేళా..ఆ
వలపే పండెను..ఈవేళా..ఆ
మనసే పొంగెను ఈవేళా..ఆ
వలపే పండెను ఈవేళా..ఆ
తారల దారుల వెన్నెల వాడల
తారల దారుల..వెన్నెల వాడల
తనువే ఊగెను...ఉయ్యాలా
మనసే పొంగెను ఈవేళా..ఆ
వలపే పండెను ఈవేళా..ఆ

చరణం::1

నీల గగనాల...ముంగిటా..ఆ
ఆణి ముత్యాల...పందిటా..ఆ
మంగళ వాద్యాలు...మ్రోగగా..ఆ
నవపారిజాతాలు...కురియగా..ఆ
జరుగునులే మన..కళ్యాణమూ..మూ
పలుకునులే జీవనరాగమూ..మూ 
పలుకునులే...జీవనరాగమూ..మూ       
మనసే పొంగెను ఈవేళా..ఆ
వలపే పండెను ఈవేళా..ఆ
ఈవేళా..ఆ..ఆ..ఈవేళా..ఆ

చరణం::2

పూలపానుపున నేనుంటే..ఏ
తలుపుమాటున నీవుంటే..ఏ
చిలిపిగ నీవే ననుచేరగా..ఆఆ
సిగ్గులు నాలో చిగురించగా..ఆఆ
తొలిరేయి మనకై పెరిగేనులే..ఏఏ
కౌగిలిలో హాయి కరిగేనులే..ఏఏ
కౌగిలిలో హాయి..కరిగేనులే..ఏఏ     
మనసే పొంగెను...ఈవేళా..ఆఆ
వలపే పండెను...ఈవేళా..ఆఆ
ఈవేళా..ఆ..ఆ..ఈవేళా..ఆ

No comments: