Friday, December 02, 2011

బంగారుబొమ్మలు--1977

చిమ్మటలోని ఈ పాట మీకోసం



సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు, P.సుశీల


పల్లవి::

ANR::
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

మంజుళ::
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
ఈ...ఈ...ఈ

మంజుళ::
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

ANR::
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
...ఈ...ఈ...

ఇద్దరు::
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

చరణం::1

మంజుళ::
కనకదుర్గ కనుసన్నలలో
గలగల పారే తన ఒడిలో
కనకదుర్గ కనుసన్నలలో
గలగల పారే తన ఒడిలో
ANR::
మన పడవలు రెండూ పయనించాలని
బ్రతుకులు నిండుగ పండించాలని
కలిపింది ఇద్దరినీ...

మంజుళ::
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

ANR::
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

చరణం::2

ANR::
నీ కురుల నలుపులో..
నీ కనుల మెరుపులో..
అలలై..కలలై..అలలై కలలై తానే వెలిసింది

మంజుళ::
నీ లేత మనసులో..నీ దోర వయసులో..
వరదై..వలపై..వరదై వలపై తానే ఉరికిందీ
ANR::
చిరుగాలుల తుంపరగా..
మంజుళ::
చిరునవ్వుల సంపదగా..
ANR::
చిరుగాలుల తుంపరగా..
మంజుళ::
చిరునవ్వుల సంపదగా..

ఇద్దరు::
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...

మంజుళ::
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ


చరణం::3

మంజుళ::
పంట పొలాల్లో పచ్చదనంగా
ANR::
పైరగాలిలో చల్లదనంగా
మంజుళ::
పంట పొలాల్లో పచ్చదనంగా
ANR::
పైరగాలిలో చల్లదనంగా

మంజుళ::
పల్లెపదంలో తీయదనంగా

ఇద్దరు::
చిరంజీవులై జీవించాలని
కలిపింది ఇద్దరినీ..
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ॥

ANR::
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

మంజుళ::
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
ఈ...ఈ...ఈ

ఇద్దరు::
నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

No comments: