Friday, December 02, 2011

మూడుముళ్ళు--1983

చిమ్మటలోని ఈ పాట మీకోసం



మూడుముళ్ళు 1983
సంగీతం:;రాజేద్ర
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

ఆమె::
నీ కోసం యవ్వనమంతా..దాచాను మల్లెలలో
అతను::
నీ కోసం జీవితమంతా..వేచాను సందెలలో
ఆమె::
మలిసందెలు మల్లెపూలు..మనువాడిన వేళలలో

గీత::
నీ కోసం యవ్వనమంతా..దాచాను మల్లెలలో
మోహన్::
నీ కోసం జీవితమంతా..వేచాను సందెలలో

చరణం::1

ఇద్దరు::లాలాలాల లాల్లలలా లాలాలాల
లాల్లలలా లాలాలాలా లాలా

మోహన్::అటుచూడకు జాబిలివైపు..కరుగుతుంది చుక్కలుగా
చలి చీకటి చీరలోనే..సొగసంతా దాచుకో

రాధిక::అటు వెళ్ళకు దిక్కులవైపూ..కలుస్తాయి ఒక్కటిగా
నా గుప్పెడు గుండెలోనే..జగమంతా ఏలుకో

మోహన్::
నా హృదయం టూ..లెటు..కాడు..మన జంటకు డ్యూయెటు లేదు
రాధిక::
ఆ మాటే విననూ..మాట పడనూ..ఊరుకోనూ..

గీత::వినలేకపోతే చెవులు మూసుకోమ్మా..
ఊర్కోలేకపోతే ఉరేసుకో..వెళ్ళమ్మా వెళ్ళి నీ పని చూసుకో..వెళ్ళు

మోహన్::
నీ కోసం జీవితమంతా..వేచాను సందెలలో
గీత::
నీ కోసం యవ్వనమంతా..దాచాను మల్లెలలో
మోహన్::
మలిసందెలు మల్లెపూలు..మనువాడిన వేళలలో

మోహన్::
నీ కోసం జీవితమంతా..వేచాను సందెలలో
గీత::
నీ కోసం యవ్వనమంతా..దాచాను మల్లెలలో

చరణం::2

రాధిక::అటు చూడకు లోకం వైపు..గుచ్చుతుంది చూపులతో
వడి వెచ్చని నీడలోనే..బిడియాలను పెంచుకో

గీత::అటు వెళ్ళకు చీకటి వైపూ..అంటుతుంది ఆశలతో
విరి సెయ్యల వేడి లోనే..పరువాలను పంచుకో

చంద్రమోహన్::నా కొద్దీ కసి కాలేజీ..మానేస్తా నే మ్యారేజీ
గీత::మరులన్నీ మనవీ..అన్న మనవీ..చేసుకొన్నా

రాధిక::ఏమిటి పాడ్డం..నీ బొంద..అన్నమనవి కాదు
అన్నకు మనవి చేసుకో బాగుంటుంది..పవిట సరిగ్గా వేసుకో
మాష్టర్ ముందు ఇలా తప్పులు పాడతావా?..బుధిలేదూ?
మ్మ్ హి..పవిట సరిగ్గవేసుకో..వెళ్ళమ్మా అక్కడ నిలబడు వెళ్ళు..

రాధిక::
నీ కోసం యవ్వనమంతా..దాచాను మల్లెలలో
మోహన్::
నీ కోసం జీవితమంతా..వేచాను సందెలలో
ఇద్దరు::
మలిసందెలు మల్లెపూలు..మనువాడిన వేళలలో

ఇద్దరు:::ఆహాహా హాహాహా లాలాల లాలలా
ఆహాహా హాహాహా లాలాల లాలలా

No comments: