Friday, December 02, 2011

మూడుముళ్ళు--1983

చిమ్మటలోని ఈ పాట మీకోసం




సంగీతం::రాజన్‌నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

రాధిక::

జో..లాలీ..జో జో జో ...
బజ్జోరా నా కన్నా లాలిజో
ఎవరయ్యా నీకన్నా లాలిజో..
ఇల్లాలి లాలిజో..జోలాలి లాలిజో
ఈ..ఇల్లాలి లాలి జో..ఓ ఓ ఓ

బజ్జోరా నా కన్నా లాలిజో..
జో జో జో..లాలి జో...

చరణం::1

రాధిక::

ముద్దూ ముచ్చట తెలిసి బతకర ముద్దుల కన్నయ్యా
ముద్ద పప్పులా..పప్పు సుద్దలా..మారకు చిన్నయ్యా
మింగటమే తెలుసూ..కొందరి పెదవులకూ
ముద్దంటే అలుసూ..ఆ మొద్దుల పెదవులకూ
బొమ్మలు అడిగే కన్నా..ఓ..అమ్మను అడుగు కన్నా
బొమ్మలు అడిగే కన్నా..ఓ..అమ్మను అడుగు కన్నా
అందాకా ఆపోద్దూ..నీ గోలా..నీ గోల పాడినా..హాహా

అతడు::
బజ్జోర నా కన్నా లాలి జో..ఎవరయ్య నీ కన్నా లాలి జో
ఈ నాన్న పాడినా..మీ అమ్మా లాలి జో..
ఈ నాన్న పాడినా..మీ అమ్మా లాలి జో..
బజ్జోర నా కన్నా లాలి జో..జో జో జో..లాలి జో

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అహహ ఆహహహా ఆ ఆ ఆ హా హా హా

పెదవుల చివరి ముద్దులు మనకు..వద్దుర కన్నయ్యా
మంచిన మించిన ముద్దుల పదవులు లేవుర చిన్నయ్యా
నవ్వర నా తండ్రీ..నకిలీ ప్రేమలకూ
నమ్మకు నా తండ్రీ..ఈ నవ్వే భామలనూ
కనిపించే ప్రతి బొమ్మా..కాదుర నాన్న అమ్మా
కనిపించే ప్రతి బొమ్మా..కాదుర నాన్న అమ్మా
నీకేలా..ఈ గోలా..ఈ వేళా..ఉయ్యల ఊగరా

అతడు::
బజ్జోర నా కన్నా లాలి జో..ఎవరయ్య నీ కన్నా లాలి జో

రాధిక::
ఇల్లాలి లాలిజో..జోలాలి లాలిజో
ఈ..ఇల్లాలి లాలి జో..ఓ ఓ ఓ
బజ్జోరా నా కన్నా లాలిజో
జో జో జో లాలి జో లాలి జో ....

No comments: