సంగీత::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::కృష్ణ,మురళీ మోహన్,శారద,నిర్మల,సత్యనరాయణ, రమాప్రభ,రేలంగి,అల్లురామలింగయ్య,రజబాబు.
పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆడది కోరుకునే వరాలు..రెండే రెండు
చల్లని సంసారం..చక్కని సంతానం
ఆడది కోరుకునే వరాలు..రెండే రెండు
చల్లని సంసారం..చక్కని సంతానం
చరణం::1
కాపురమే ఒక మందిరమై..పతియే తన దైవమై
కాపురమే ఒక మందిరమై..పతియే తన దైవమై
అతని సేవలో తన బ్రతుకే..హారతి యైపోతే
అంతకు మించిన సౌభాగ్యం..ఆడదానికేముంది
ఆడదానికింకేముంది
ఆడది కోరుకునే వరాలు..రెండే రెండు
చల్లని సంసారం..చక్కని సంతానం
చరణం::2
ఇల్లాలే ఒక తల్లియై..చల్లని మమతల పాలవెల్లియై
తన పాప లాలనలో..తాను కరిగిపోతే
ఇల్లాలే ఒక తల్లియై..చల్లని మమతల పాలవెల్లియై
తన పాప లాలనలో..తాను కరిగిపోతే
అంతకు మించిన ఆనందం..ఆ..తల్లికేముంది
ఆ..తల్లికింకేముంది
ఆడది కోరుకునే వరాలు..రెండే రెండు
చల్లని సంసారం..చక్కని సంతానం
ఆడది కోరుకునే వరాలు..రెండే రెండు
చల్లని సంసారం..చక్కని సంతానం
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
No comments:
Post a Comment