Sunday, November 01, 2009

బంగారు తల్లి--1971


















సంగీతం:: S రాజేశ్వరరావు
రచన::దేవులపల్లి
గానం::P.లీల బృందం
తారాగణం::జగ్గయ్య,జమున, శోభన్‌బాబు, కృష్ణంరాజు, వెన్నిరడై నిర్మల, నాగభూషణం,నిర్మల,రమప్రభ

పల్లవి::

తరలింది బంగారు బొమ్మా
ఇన్నాళ్ళూ మా ఇంట వెలిగింది 
ఈ మణి దీపమమ్మా
తరలింది బంగారు బొమ్మా
ఇన్నాళ్ళూ మా ఇంట వెలిగింది 
ఈ మణి దీపమమ్మా
తరలింది బంగారు బొమ్మా  
వడిగా మగనింటికి..నడిచేవు గానీ
వడిగా మగనింటికి..నడిచేవు గానీ
గడియేని విడి యుండగలవా..అమ్మా 
తరలింది బంగారు బొమ్మా..ఆ ఆ ఆ

చరణం::1

అడిగింది బంగారు..బొమ్మా
అమ్మా పాదాలనొకసారి..కడనిమ్మనీ
అడిగింది బంగారు..బొమ్మా
అయ్యా పాదాలనొకసారి..కడనిమ్మనీ
అడిగింది బంగారు..బొమ్మా 
కడుపారగా నన్ను..కని పెంచినారని
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
కడుపారగా నన్ను కని పెంచినారని 
విడలేక విడలేక..సెలవిమ్మనీ
అడిగింది బంగారు..బొమ్మా 

చరణం::2 

వెడలింది బంగారు..బొమ్మా
తొలి వలపు..దవళాలు 
పులుకించి వూగే..పూరెమ్మా
వెడలింది బంగారు..బొమ్మా   
మనసారా ఒకసారి..చూసీ
పతి కేసీ యెనలేని..బిడియాల కనులెల్లా మూసీ
సవరిస్తే ముంగురులూ..చందమామ చూడాలీ
ఎవరో నీ మగని పేరూ..ఏమీ కాక పలకవే
ఎవరో నీ మగని పేరూ..ఏమీ కాక పలకవే 
కలికివే..చిలకవే..కళ్యాణ..గీతికవే
లేత మామిడి పూత..కోరూ
తీగ పందిరి ఊత..కోరూ 
చెలియ మనసు..ప్రాణనాధుని 
చెలిమినే కోరూ..చెలిమినే కోరూ

No comments: