సంగీత::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::రాజబాబు,రమాప్రభ
తారాగణం::కృష్ణ,మురళీ మోహన్,శారద,నిర్మల,సత్యనరాయణ, రమాప్రభ,రేలంగి,అల్లురామలింగయ్య,రజబాబు.
పల్లవి::
కకక కాకినాడ రేవుకాడ ఒ ఓడెక్కి..బొ బొంబాయి రేవుకాడ దిగుదామా
కాకినాడ రేవుకాడ ఓడెక్కి..బొంబాయి రేవుకాడ దిగుదామా..మ్మ్ హూ..
రర రాజమండ్రి టేషన్ లో రె రైలెక్కి..అంబాయి టేషన్లో దిగుదామా
రాజమండ్రి టేషన్ లో రైలెక్కి..అంబాయి టేషన్లో దిగుదామా..వద్దు
చరణం::1
ద దారిలోని టేషన్ లో..త తాతయ్య ఉంటాడు
దారిలోని టేషన్ లో..తాతయ్య ఉంటాడు..మ్మ్
జుట్టుపట్టుకుంటాడు..గంటకొట్టమంటాడు..అయ్యబాబోయ్
అసలు సంగతంతా..మా అమ్మతో చెబుతాడు
అమ్మో..అయ్యో..అమ్మో..అయ్యో
ఇద్దరిని కలవకుండ చేస్తాడు..ఆ అందుకే
కాకినాడ రేవుకాడ ఓడెక్కి..బొంబాయి రేవుకాడ దిగుదామామ్మ్ హూ
రాజమండ్రి టేషన్ లో రైలెక్కి..అంబాయి టేషన్లో దిగుదామా
చరణం::2
అనార్కలి న్..పార్వతినే నువు
రోమియోను నేనైతే..జు జూలియటు నువ్వు..లైలా..హోయ్
లైలావే..నువైతే మజ్ఞూ..నేనేను
మేడలపై మిద్దెలపై గోడలపై ఓడలపై..మనబొమ్మలే ఉంటాయి
ఆ బొమ్మలతో పాటు..పేడముద్దలే ఉంటాయి
హిందీ పోస్టర్ల మీద..ఏ ముద్దలు వుండవు
అందుకే వేషాలు..హిందీలో వేద్దాం..మ్మ్
కకక కాకినాడ రేవుకాడ ఓడెక్కి..బొ బొంబాయి రేవుకాడ దిగుదామా
కాకినాడ రేవుకాడ ఓడెక్కి..బొంబాయి రేవుకాడ దిగుదామా..మ్మ్
రరర రాజమండ్రి టేషన్ లో రైలెక్కి..అం అంబాయి టేషన్లో ది దిగుదామా
రాజమండ్రి టేషన్ లో రైలెక్కి..అంబాయి టేషన్లో దిగుదామా..వద్దు..
No comments:
Post a Comment