Monday, November 09, 2009

రాధమ్మ పెళ్ళి--1974

























సంగీత::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::కృష్ణ,మురళీ మోహన్,శారద,నిర్మల,సత్యనరాయణ, రమాప్రభ,రేలంగి,అల్లురామలింగయ్య,రజబాబు.

పల్లవి::

ఆఆఆఆహా..ఏహేయ్..ఓఓఓఓఓఓ 
ఓఓఓ ఓ..ఓఓఓ ఓ..

పారే గోదావరిలా..పరుగెత్తేదే వయసు
పొడిచే తొలిపొద్దులా..పొరలు లేనిదే మనసు
పారే గోదావరిలా..పరుగెత్తేదే వయసు
ఆఆఆఆ ఆఅ ఆఆఆఆ ఆఅ ఆఆఆఆ ఆఅ

చరణం::1

గుండెలో సుడిగుండాలున్నా..నిండుగ నవ్వును ఏరు
పక్కలోన బురదవున్నా..పచ్చగ నవ్వును పైరు
గుండెలో సుడిగుండాలున్నా..నిండుగ నవ్వును ఏరు 
ఏ వెతలున్నా ఏదేమైనా..అలా అలా కిలా కిలా
నవ్వేదే జీవితం..నవ్వేదే జీవితం  

పారే గోదావరిలా..పరుగెత్తేదే వయసు
పొడిచే తొలిపొద్దులా..పొరలు లేనిదే మనసు
పారే గోదావరిలా..పరుగెత్తేదే వయసు

చరణం::2

వేటకాడు పొంచుంటాడనీ..గూటిలో గువ్వ దాగదు
గొడ్డలి వేటు పడుతుందనీ..కొమ్మ ఎదగడం ఆగదు
వేటకాడు పొంచుంటాడనీ..గూటిలో గువ్వ దాగదు
ఎవరేమన్నా..ఎదురేమున్నా..అలా అలా గలా గలా 
సాగేదే జీవితం..సాగేదే జీవితం 
   
పారే గోదావరిలా..పరుగెత్తేదే వయసు
పొడిచే తొలిపొద్దులా..పొరలు లేనిదే మనసు
పారే గోదావరిలా..పరుగెత్తేదే వయసు
ఆఆఆ ఆఆఅ ఆఆఆ ఆఆఅ ఆఆఆ ఆఆఅ

చరణం::3

నిప్పు తొక్కితే కలిగే బాధ..కట్టుకట్టితే పోతుంది
పాము కరిస్తే ఎక్కే విషం..పసరుతో దిగిపోతుంది
కాని!మనిషి కాటుకూ..మందులేదని తెలుసుకొని
మసలుకొని ఉంటేనే జీవితం..ఉంటేనే జీవితం

పారే గోదావరిలా..పరుగెత్తేదే వయసు
పొడిచే తొలిపొద్దులా..పొరలు లేనిదే మనసు
పారే గోదావరిలా..పరుగెత్తేదే వయసు
ఆఆఆ ఆఆఅ ఆఆఆ ఆఆఅ ఆఆఆ ఆఆఅ

No comments: