Friday, November 23, 2007

ఆజన్మ బ్రహ్మచారి--1973





















సంగీత::S.P.కోదండపాణి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు  
తారాగణం::నాగభూషణం, పద్మనాభం, గీతాంజలి,లీలారాణి,రామకృష్ణ.

పల్లవి::

ఓ..చక్కని సీతమ్మా..చిక్కని చిలకమ్మా 
చెంతకు రావమ్మా..సిగ్గులు చాలమ్మా
నీ అందమే తీవెలై..పూవులై పూచెనే
ఓహో..చక్కని రామయ్యా..చిక్కితిలేవయ్యా 
తొందర ఏమయ్యా..చిందులు చాలయ్యా
నీ రూపమే కళ్ళలో..చల్లగ నిండెరా

చరణం::1

నీ కళ్ళలో నేనున్నానా..మ్మ్ మ్మ్  
నీ కళ్ళలో నేనున్నానా..నో 
నీ కలల్లో నేనొచ్చానా..నో నో 
ముచ్చటగా నను మెచ్చావా..నో నో నో 
మరి వెచ్చని కౌగిలి యిచ్చావా..?
యస్ యస్ ఆ హ్హా యు సిల్లీ బాయ్ హా     
హోయ్..చక్కని సీతమ్మా..చిక్కని చిలకమ్మా

చరణం::2

నీ మనసులోన ఏముంది..ధీమా 
అది మాటి మాటికి ఏమంటుంది..ప్రేమ ప్రేమ
ఆ ప్రేమ జపిస్తూ కూచోరాదా..ఎందుకు భామా 
యీ పూటకు యింక..గుడ్ బై రామా..హ్హా హ్హా
హరేరామ హరేకృష్ణ..హరేకృష్ణ  హరేరామ 
రామరామ కృష్ణకృష్ణ..హరేకృష్ణ హరే రామ రామా
ఓ చక్కని రామయ్యా..ఓయ్..చిక్కితిలేవయ్యా
తొందర ఏమయ్యా..చిందులు చాలయ్యా
నీ రూపమే కళ్ళలో..చల్లగ నిండెరా 

చరణం::3

యీ సొగసైన కళ్ళెందుకు..నిద్దురకేమో 
యీ చిగురాకు పెదవులెందుకు..సుద్దులకేమో
కాదు ముద్దులకేమో..ఆ యస్ మిస్ 
ఆ ముద్దుల పండుగ నేడే..నేడే రావాలి 
వెయిట్ మిస్టర్..ఆ మూడుముళ్ళూ వేసేదాకా 
ఆగాలి..తమరాగాలి  
హోయ్..చక్కని సీతమ్మా..చక్కని రామయ్యా 
అహ చక్కని సీతమ్మా..హోయ్..చక్కని రామయ్యా

No comments: