Friday, November 23, 2007

ఆజన్మ బ్రహ్మచారి--1973

సంగీత::S.P.కోదండపాణి
రచన::అప్పలాచార్య
గానం::మాధవపెద్ది సత్యం  
తారాగణం::నాగభూషణం, పద్మనాభం, గీతాంజలి,లీలారాణి,రామకృష్ణ.

పల్లవి::

శ్రీమద్రమారమణ గోవిందో హారి:  
ఆంజనేయ వరద గోవిందో హారి 
పెళ్ళి మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్ 
పెళ్ళి మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్
భార్యాబిడ్డల బాదర బంది మహా ఘోరమండీ
బ్రహ్మచర్యమే మానవ జీవన ముక్తి మార్గమండీ..బాబూ        
పెళ్ళి మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్

బాధకు మూలం భార్యారత్నం కొంపకు నష్టం కుమార రత్నం..పెల్లోద్దు బాబూ
బాధకు మూలం భార్యారత్నం కొంపకు నష్టం కుమార రత్నం..పెల్లోద్దు బాబూ
కూతురు పుడితే కొంతనాశనం..అల్లుడు వస్తే సర్వనాశనం
శ్రీ ఆంజనేయ వరద గోవిందో హారి..అందుకే నాయనలారా   
పెళ్ళి మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్

సంసార ఘొరసాగరమందున ఆలూబిడ్డలు తిమింగలాలు వినండిబాబూ వినండి 
సంసార ఘొరసాగరమందున ఆలూబిడ్డలు తిమింగలాలు వినండిబాబూ వినండి
చుట్టాలంతా పాములు తేళ్ళూ కుట్టీ కొరికీ మ్రింగివేసెదరూ
రామభక్త ఆంజనేయ వాయుపుత్ర ఆంజనేయ బ్రహ్మచారి ఆంజనేయ
పెళ్ళి మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్    

చిలగడదుంపలు చేమ ఆకులూ కాకర రసము కలిపి తాగితే చిరంజీవులారా 
చిలగడదుంపలు చేమ ఆకులూ కాకర రసము కలిపి తాగితే చిరంజీవులారా 
కామం క్రోధం కాలిపొవును బ్రహ్మచర్యమే నిలిచి వెలుగును
పెళ్ళి మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్         

ఆడది పాడుది జన్మకు కీడది గొంతుకు తాడది ఎందుకు చెప్పండీ 
ఆడది పాడుది జన్మకు కీడది గొంతుకు తాడది ఎందుకు చెప్పండీ 
మారుతి మాటలు వరాల మూటలు నాయనలారా వినండి
ఈ మారుతి మాటలు వరాల మూటలు 
భక్తికి ముక్తికి బంగారు బాటలు 
పెళ్ళి మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్ 
పెళ్ళి మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్
రామభక్త ఆంజనేయ వాయుపుత్ర ఆంజనేయ బ్రహ్మచారి ఆంజనేయ
శ్రీమద్రమారమణ గోవిందో హారి:ఆంజనేయ వరద గోవిందో హారి

No comments: