Friday, November 23, 2007

మంచి మనిషి--1964



















రచన::కోసరాజు
సంగీతం::S.రాజేశ్వర రావు,చలపతి రావ్
గానం::ఘంటసాల


ఏవండీ..ఏవండోయ్
ఏమండీ..ఇటు చూడండీ..
ఒక్కసారి ఇటు చూశారంటే మీసొమ్మేది పోదండీ
ఏమండీ ఇటు చూడండీ..ఏమండోయ్..

సిగలోన దాగిన మల్లెమొగ్గకు బిగువెందుకొ చెప్పాలండీ
వరసైన వన్నెల రామచిల్కకు పొగరు కాస్త తగ్గాలండీ
మన స్నేహము మోమాటము పొడిమాటలతోనే పోదండీ
ఏమండీ..ఇటు చూడండీ..
ఒక్కసారి ఇటు చూశారంటే మీసొమ్మేదీ పోదండీ,ఏమండోయ్

మనసంత మాపై ఉందిలెండి తెలుసులెండి మీ తాపం
మొగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం
మనసంత మాపై ఉందిలెండి తెలుసులెండి మీ తాపం
మొగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం
వగలెందుకు..సెగలెందుకు ఈసారికి ఏదో పోనీండి
ఏమండీ..ఇటు చూడండీ..ఏమండోయ్

మిము నమ్ముకొన్న నేస్తగాడు మీవెంటనె ఉన్నాడండీ
ఏనాటికీ ముమ్మాటికీ తన మనసే మీదన్నాడండీ
కవ్వించక కథ పెంచక ఔనంటే అంతే చాలండీ
ఏమండీ..ఇటు చూడండీ..ఒక్కసారి ఇటు చూశారంటే
మీసొమ్మేదీ పోదండీ...ఏమండోయ్

No comments: