సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
హయ్య..హ్హా హ్హ హ్హా హయ్యా
హయ్య..హ్హా హ్హ హ్హా హయ్యా
రావయ్యా...రావయ్యా
రావయ్య మాయింటికి..రమ్మంటే
రావేల మాయింటికి..
రావయ్య మాయింటికి..రమ్మంటే
రావేల మాయింటికి..
రావయ్య మాయింటికి..రమ్మంటే
రావేల మాయింటికి..క్రిష్ణయ్యా
ఓహోయ్..దొంగ చాటునదూరి వెన్న తిన్నావంట
దొంగ చాటునదూరి వెన్న తిన్నావంట
తలుపుమూసి పట్టబోతే..తప్పుకొన్నావంట
తలుపుమూసి పట్టబోతే..తప్పుకొన్నావంట
భలే ఊళ్ళ తోటకాడ మాటువేసినావంట
గొల్లెమావు మీదచేరి కన్నుగీటినావంట
రావయ్యా..ఓహో..య్..
రావయ్య మాయింటికి
రమ్మంటే రావేల మాయింటికీ..క్రిష్ణయ్యా
ఆహా ఆఆఆఆ ఆహా..ఆఆఆఆ అహా
ఓ..హో..హో..ఒహో ఓహో ఓహో..
గొల్లవాడ వాడలకు క్రిష్ణమూర్తి
నీ వెందుకయా వచ్చినావు క్రిష్ణమూర్తి
నీ వేమి పనికి వచ్చినావు క్రిష్ణమూర్తీ
గొల్లవాడ వాడలకు క్రిష్ణమూర్తి
నీ వెందుకయా వచ్చినావు క్రిష్ణమూర్తి
ఓహోయ్..గుమ్మపాలు తాగిపోను వచ్చినాను
గోపెమ్మలతో ఆడుకోను వచ్చినాను
గోపెమ్మలతో ఆడుకోను వచ్చినాను
ఎన్ని నేర్చినాడవయ్యా..ఎంతమోసగాడివయ్యా
ఆ ఆ ఓహో..ఆహా..ఆహా..
ఎన్ని నేర్చినాడవయ్యా..ఎంతమోసగాడివయ్యా
అమ్మమ్మ నమ్మరాదు అపద్దాలపుట్టవయ్య
రావయ్యా..ఓహోయ్..
రావయ్య మాయింటికీ..రమ్మంటే
రావేల మాయింటికీ..
మాయదారీ గోపాలబాలుడమ్మా..హ్హా..ముద్దులగుమ్మా
మరువరానీ..యశోద పుత్రుడమ్మా..ముద్దులగుమ్మా
సాటిలేనీ వయ్యారి జానడమ్మా..ఓ..బంగరుబొమ్మ
చక్కనయ్యా చిక్కాడో..చోడవమ్మా..ఓ..బంగరుబొమ్మ..3
No comments:
Post a Comment