Tuesday, November 20, 2007

రంగేళీ రాజా--1971




















సంగీత::ఘంటసాల
రచన::దాశరథి
గానం::ఘంటసాల
తారాగణం::నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు,కాంచన,చలం,గుమ్మడి,లక్ష్మీరాజ్యం,ముక్కామల
కృష్ణమూర్తి,సత్యనారాయణ,వందన,జయకుమారి.

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
ఇలాటి రోజు మళ్ళీ...రానే రాదూ
ఇలాటి హాయి ఇంక..లేనే లేదూ
చలాకి చిన్నదీ...బలేగ వున్నది 
హుషారు చూపుతున్నది..హోయ్ 
మజాలు...చేయమన్నదీ..ఈఈఈ  

చరణం::1

కుర్రదాని బుగ్గలు..గులాబి మొగ్గలు 
అందమైన నవ్వులు..అవాయి చువ్వలు
ఎవరి గుండెలోకి...దూకునో..ఒహోహోయ్   
ఊరించీ..ఊగించీ..ఊరించీ..ఊగించీ 
తీరని మోహాల తేలించునో..ఓ..హో. 
ఇలాటి రోజు..మళ్ళీ రానే రాదూ 
ఇలాటి హాయి..ఇంక లేనే లేదూ
చలాకి చిన్నదీ..బలేగ వున్నది 
హుషారు చూపుతున్నది..ఓయ్ 
మజాలు...చేయమన్నదీ..ఒహోయ్  
అహ్హా..ఒహో..మ్మ్..హా 

చరణం::2

పొంగిపొరలు వయసుతో..బుజాలు కలుపుకో 
నిన్నుకోరు మనసుతో..నిజాలు తెలుసుకో
మధువులోనె మహిమ...వున్నదీ..ఒహోహోయ్ 
కైపుంటే..వలపుంటే..కైపుంటే..వలపుంటే
లేనిది ఏముందీ..యీ లోకంలో..అహా హా హా హా 
ఇలాటి రోజు..మళ్ళీ రానే రాదూ 
ఇలాటి హాయి..ఇంక లేనే లేదూ
చలాకి చిన్నదీ..బలేగ వున్నదీ  
హుషారు..చూపుతున్నదీ..హోయ్ 
మజాలు...చేయమన్నదీ..ఈ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

No comments: