సంగీత::T.G.లింగప్ప
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T.రామారావు (త్రిపాత్రాభినయం), నాగయ్య, జయంతి,పద్మనాభం,
రావి కొండలరావు
పల్లవి::
మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం
అమ్మ అనిపించుకుంటే స్త్రీ మూర్తికి గౌరవం
మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం
అమ్మ అనిపించుకుంటే స్త్రీ మూర్తికి గౌరవం
చరణం::1
స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారూ
సృస్ఠికి ఒక వింథ సోభ కలిగిస్తారూ
స్త్రీ పురుషులు ఒకరినొకరు ప్రేమిస్తారూ
సృస్ఠికి ఒక వింథ సోభ కలిగిస్తారూ
మబ్బువెంట నీరువలే పువ్వునంటు తావివలే
మబ్బువెంట నీరువలే పువ్వునంటు తావివలే
అనుశృతముగా వచ్చును ఈ సంబంధం ఈ అనుబంధం
ఆలుమగలు బ్రతుకున పంచుకున్న పరమార్థం
మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం ఆడజన్మ సార్దకం
చరణం::2
ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించినదీ
భూమాత మురిసి పచ్చ పచ్చగ నవ్వుతున్నదీ
ప్రకృతి కాంత పురుషుని ఒడిలోన పరవశించినదీ
భూమాత మురిసి పచ్చ పచ్చగ నవ్వుతున్నదీ
అంతా అనురాగమయం..ఆనందానికి నిలయం
అంతా అనురాగమయం..ఆనందానికి నిలయం
పతి హృదయమే సతికి నిత్య సత్యమైన ఆలయం
పూజించే దేవాలయం
భర్తయే బార్యకు ఇలలో వెలసిన దై వెలసిన దైవం
మాతృత్వం లోనే ఉంది ఆడజన్మ సార్దకం
అమ్మ అనిపించుకుంటే స్త్రీ మూర్తికి గౌరవం
No comments:
Post a Comment