Friday, November 18, 2011

కులగౌరవం--1972
























సంగీత::T.G.లింగప్ప
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::పిఠాపురం నాగేశ్వరరావు,L.R.ఈశ్వరి
తారాగణం::N.T.రామారావు (త్రిపాత్రాభినయం), నాగయ్య, జయంతి,పద్మనాభం,
రావి కొండలరావు

పల్లవి::

కులం కులం అంటావు గోత్రమేమిటంటావు
ఏమని చెప్పేది చిన్నోడా
నీకు ఏమని చెప్పేదిర పిచ్చోడా
అమ్మది ఒక కులం అయ్యది ఒక కులం
అమ్మది ఒక కులం అయ్యది ఒక కులం
పుట్టినోళ్ళ కులమేదే ఓలమ్మీ
వాళ్ళ పెళ్ళినాడు తెలుస్తుంది ఓసమ్మీ

చరణం::1

వసిష్టయ్య పెళ్ళడిన అరుంధతిది ఏ కులం 
పరాశరుడు చెయ్యేసిన మత్సగంధిదే కులం 
పురాణాలలోన కులం లేదయ్యో
హోం నడమంత్రపు చాదస్తుల పైత్యమయ్యో
నడమంత్రపు చాదస్తుల పైత్యమయ్యో
కులం కులం అంటావు గోత్రమేమి టంటావు
ఏమని చెప్పేది చిన్నోడా నీకు ఏమని చెప్పేదిర పిచ్చోడా

చరణం::2

ప్రేమ పిచ్చిపట్టినపుడు కిందు మీదు తెలియదులే
కోడె వయసు పరుగులోన ముందు వెనుక చూడరులే
సంసారం నెత్తినబడి అయినవాళ్ళు వెలిబెడితే
కులగోత్రాల్ గుర్తుకొచ్చి సిగ్గు తీస్తదే పిల్లా
అమ్మది ఒక కులం అయ్యది ఒక కులం
పుట్టినోళ్ళ కులమేదే ఓలమ్మీ 
వాళ్ళ పెళ్ళినాడు తెలుస్తుంది ఓసమ్మీ

చరణం::3

రోజులు మారి కొత్త మొజులు వచ్చినవయ్యో
మూఢత్వం వదిలి సంఘం ముందుకు పోతుందయ్యో
ఎక్కువ తక్కువలు లేవు కులమత భేదాలు లేవు
ఏవయ్యో..ఆ..ఎక్కువ తక్కువలు..లేవు 
కులమత భేదాలు..లేవు
వస్తుంది స్వర్న యుగం సర్వమిక జగన్నాధం
కులం కులం అంటావు గోత్రమేమి టంటావు
ఏమని చెప్పేది చిన్నోడా నీకు ఏమని చెప్పేదిర పిచ్చోడా

No comments: