Monday, September 19, 2011

పసి హృదయాలు--1973




సంగీతం::G.K.వెంకటేష్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,జమున,రామకృష్ణ,చంద్రకళ,నిర్మల,సునందిని (నూతన పరిచయం) 

పల్లవి::

చూసిన చూపే..చూడనీ పదే పదే
దోచిన రూపే..దోచనీ పదే పదే
మెరిసే పగలైనా..ఉరిమే రేయైనా 
మెరిసే పగలైనా..ఉరిమే రేయైనా
వలచే జంటలకూ..సహజం ఇదే ఇదే
చూసిన చూపే..చూడనీ పదే పదే

చరణం::1

నా మనసే ఎగిసినదీ..నీ మీదే అది వాలినదీ
నా మనసే ఎగిసినదీ..నీ మీదే అది వాలినదీ
నాచెయీ..నీచెయీ..పెనవేస్తూ..పోతుంటే
నీపెదవీ నా పెదవీ..ప్రతి నిముషం తోడుంటే
తేనే వెన్నెలా..కలయిక అదే అదే తేనే 
వెన్నెలా కలయిక..అదే..అదే
అదే..అదే..హానిమూన్ 
      
చూసిన చూపే..చూడనీ పదే పదే
దోచిన రూపే..దోచనీ పదే పదే
మెరిసే పగలైనా..ఉరిమే రేయైనా 
మెరిసే పగలైనా..ఉరిమే రేయైనా
వలచే జంటలకూ..సహజం ఇదే ఇదే 
చూసిన చూపే..చూడనీ పదే పదే

చరణం::2

కౌగిలిలో కలిశామూ..కమ్మదనంలో కరిగామూ
కౌగిలిలో కలిశామూ..కమ్మదనంలో కరిగామూ
చెలరేగే పరువాలె..కెరటాలై ఢీ కుంటే
ప్రతి తరగ ప్రతి నురగ..మన కథలే చెబుతుంటే
వలపుల కడలికే..వంతెన కడదాము
వలపుల కడలికే..వంతెన కడదాము 
అదే..అదే..హానీమూన్

చూసిన చూపే..చూడనీ పదే పదే
దోచిన రూపే..దోచనీ పదే పదే
మెరిసే పగలైనా..ఉరిమే రేయైనా 
మెరిసే పగలైనా..ఉరిమే రేయైనా
వలచే జంటలకూ..సహజం ఇదే ఇదే

No comments: