సంగీతం::G.K.వెంకటేష్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,సరోజ
తారాగణం::కృష్ణ,జమున,రామకృష్ణ,చంద్రకళ,నిర్మల,సునందిని (నూతన పరిచయం)
పల్లవి::
శేషశైలవాసా..ఆఆఆ
మమ్మేలు శ్రీనివాసా..ఆఆ
కాపాడరావేలా..శ్రీ వెంకటేశా..ఆ
శేషశైలవాసా..మమ్మేలు శ్రీనివాసా
శేషశైలవాసా..మమ్మేలు..శ్రీనివాసా
కాపాడరావేలా..శ్రీ వెంకటేశా
శేషశైలవాసా..మమ్మేలు శ్రీనివాసా
చరణం::1
ఎల్ల జనుల కాచే..ఓ చల్లనైన స్వామీ
ఎల్ల జనుల కాచే..ఓ చల్లనైన స్వామీ
పిల్ల వాని పైన..నీ ప్రేమ చూపవేమీ
తండ్రినీ కొడుకునీ..ఒకటి చేసినావే
తండ్రినీ కొడుకునీ..ఒకటి చేసినావే
నేడు మరల నీవే విడదీయ..దలచినావా
శేషశైలవాసా..మమ్మేలు శ్రీనివాసా
కాపాడరావేలా..శ్రీ వెంకటేశా
శేషశైలవాసా..మమ్మేలు శ్రీనివాసా
చరణం::2
నిన్ను నమ్మినామూ నీతోడు కోరినామూ
అభయమీయవయ్యా..నువు శుభము కూర్చవయ్యా
కళ్ళు తెరచి చూడు..కాపాడవయ్యా నేడు
కలత తీర్చలేవా..ఆ..కరుణ చూపరావా..ఆ..
కనరావా కదలిరావా..మమ్ముకావా దేవదేవా
వెంకటేశా..ఆఆ..శ్రీనివాసా..ఆఆ..
No comments:
Post a Comment