సంగీతం::G.K.వెంకటేష్
రచన::ఆరుద్ర
గానం::S.జానకి,సరోజ
తారాగణం::కృష్ణ,జమున,రామకృష్ణ,చంద్రకళ,నిర్మల,సునందిని (నూతన పరిచయం)
పల్లవి::
పిన్నీ మళ్ళీ నవ్వూ..బాబాయ్ నువ్వూ నవ్వు
పిన్నీ మళ్ళీ నవ్వూ..బాబాయ్ నువ్వూ నవ్వు
మల్లెపువులా తెల్ల తెల్లగా..ఆశతీరా నవ్వాలి
పిన్నీ మళ్ళీ నవ్వూ..బాబాయ్ నువ్వూ నవ్వు
చరణం::1
ఓరగా ఓరగా చూస్తారు ఊరకే ఉలికీపడతారు..బాబూ ఎందుకో
ఓరగా ఓరగా చూస్తారు ఊరకే ఉలికీపడతారు..బేబీ ఎందుకో
పలకరించితే పులకరించటం..హాయ్..బాగా వుందిలే
పిన్నీ మళ్ళీ నవ్వూ..బాబాయ్ నువ్వూ నవ్వు
చరణం::2
చూచిన చూపులలోనే ఆశలు ఎన్నో వుంటాయ్..బేబీ ఎందుకో
చూచిన చూపులలోనే ఆశలు ఎన్నో వుంటాయ్..బాబూ ఎందుకో
కనులు కలుపుతూ ఊసులాడుతూ..మన సంగతినే మరచారు
పిన్నీ మళ్ళీ నవ్వూ..బాబాయ్ నువ్వూ నవ్వు
చరణం::3
పిన్నికి ఎందుకు సిగ్గు నాన్నకి ఎందుకు మోజు..బాబూ తెలుసునా
పిన్నికి ఎందుకు సిగ్గు బాబయ్ కెదుకు మోజు..బేబీ తెలియదు
నీకు తెలియదు నాకు తెలియదు..ప్రేమ అంటే అంతేలే
పిన్నీ మళ్ళీ నవ్వూ..బాబాయ్ నువ్వూ నవ్వు
మల్లెపువులా తెల్ల తెల్లగా..ఆశతీరా నవ్వాలి
పిన్నీ మళ్ళీ నవ్వూ..బాబాయ్ నువ్వూ నవ్వు
No comments:
Post a Comment